' పెమ్మసాని చంద్రశేఖర్ అనే నేను..*
+ కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పెమ్మసాని
+ ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
+ ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబుకు నమస్కరించిన పెమ్మసాని
'డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అనే నేను.. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని' అంటూ గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థిగా భారీ మెజారిటీతో విజయం నమోదు చేసిన పెమ్మసాని చంద్రశేఖర్ గారు రాష్ట్రపతి భవన్ ముంగిట ఏర్పాటుచేసిన ప్రమాణ స్వీకార వేదికపై కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం ఆదివారం చేశారు.  ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఏడు దేశాల అధ్యక్షులు, దేశ, రాష్ట్ర నాయకుల సాక్షిగా ఆయన ఈ ప్రమాణస్వీకారం నిర్వహించారు. ప్రమాణ స్వీకారం అనంతరం డాక్టర్ పెమ్మసాని స్పందిస్తూ చంద్రబాబు నాయుడు వైపు చూస్తూ కృతజ్ఞతకొద్దీ ఆయనకు పెమ్మసాని నమస్కరించారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసినంత సేపు యావత్ గుంటూరు పార్లమెంటు ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయన ఎప్పుడెప్పుడు ప్రమాణస్వీకారం చేస్తారా! అని ఆదివారం ఉదయం నుంచి అభిమానులు, కార్యకర్తలు గుంటూరు, నరసరావుపేట జిల్లాల్లో వేచి చూశారు. దాదాపు 45 ఏళ్ల తర్వాత గుంటూరు పార్లమెంటుకు కేంద్రం మంత్రి పదవిని తీసుకొచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్ కు పార్లమెంటు ప్రజలతోపాటు యావత్ టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.