Skip to main content

Posts

Showing posts from July, 2024

కొత్త లుక్ లో ఫిదా చేస్తున్న డార్లింగ్

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: కల్కి 2898 ఏడీ మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టాడు. ఇప్పటికే రూ. 1100 కోట్ల వసూళ్లను సాధించి.. రికార్డు నెలకొల్పాడు. అయితే గత కొంత కాలంగా ప్రభాస్ లుక్ లో ఎలాంటి ఛేంజ్ లేదు. కత్తులు, తుపాకులు, బాంబులతోనే ఎక్కువగా ఫ్యాన్స్ కు కనిపించాడు. కానీ మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘ది రాజా సాబ్’ మూవీ కోసం తన లుక్ ను పూర్తిగా మార్చివేశాడు. ఎంతగా అంటే మళ్ళీ మళ్ళీ మరిన్ని ప్రాజెక్టులు మారుతి తో చేసే అంతగా.వింటేజ్ ఈ మూవీ గ్లింప్స్ లో వింటేజ్ ప్రభాస్ ను గుర్తుకు తెచ్చాడు. దాంతో డార్లింగ్ లో వాటే ఛేంజ్.. ఇది అస్సలు ఊహించలేదు అంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సలార్ మూవీలో ఎలా ఉండేవాడు ఇప్పుడు ఎలా మారిపోయాడు ఈ మార్పును గమనించారా? అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గత కొంత కాలంగా ప్రభాస్ నవ్వులు పూయించిన సినిమా లేనే  లేదు. కల్కిలో అక్కడక్కడ నవ్వించాడు డార్లింగ్. కానీ రాజా సాబ్ గ్లింప్స్ చూసిన తర్వాత మారుతి ప్రభాస్ లో ఉన్న కామెడీ టచ్ ను పూర్తిగా వాడుకుని నవ్వించబోతున్నాడని గ్లింప్స్ ద్వారానే అర్ధమవుతోంది. ఈ చిత్రం రొమాంటిక్ హార్రర...

సినిమాల ప్రదర్శనకు తెలంగాణా థియేటర్ల పర్సంటేజ్ విదానాన్ని ఏపి లోనూ అమలు చేయాలి

ఆగస్ట్ 2 నుండి సినిమాల ప్రదర్శనకు తెలంగాణాలో  పర్సంటేజ్ మాత్రమే ! ✓ ఆంధ్రలోనూ అమలు చేయాలి ✓ చిన్న సినిమాల విడుదలకు సదవకాశం ✓ ధియేటర్లూ బ్రతుతాయి! - మా- ఎపి దిలీప్ రాజా  టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తెనాలి జూలై 29: తెలంగాణాలో ఆగస్టు 2 నుండి ధియేటర్లలో సినిమాల ప్రదర్శనకు ధియేటర్లలో పర్సంటేజీ పద్ధతి  ఆచరణలోకి వస్తున్న నేపధ్యంలో తెలుగురాష్ట్రాల్లో భాగమైన ఆంధ్రప్రదేశ్ లో  కూడా ఇదే పద్ధతిని అమలు చేయాలని ' మా - ఏపి' వ్యవస్థాపకులు, సినీ దర్శకుడు దిలీప్ రాజా కొరారు.స్థానిక ' మా-ఏపీ' 24 విభాగాల యూనియన్ కార్యాలయంలో సోమవారo ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతoలోమాదిరిగా ధియేటర్లకు అద్దె చెల్లించకుండా పర్సంటేజీ పద్దతి వలన చిన్నసినిమానిర్మాతలకుఎoతోఉపయోగమన్నారు. దీనివలన చిన్న సినిమాలు విడుదలకు నోచుకుంటాయనే  ఆశాభావాన్ని ఆయన వ్యక్తo చేశారు.వెంటిలేటర్ పై ఉన్న ధియేటర్లు బ్రతుకుతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.గ్లోబల్ ఫిలిoస్ సునీల్ నారంగ్, యస్వీ క్రియేషన్స్ శిరీష్ రెడ్డిల దగ్గర హైదరాబాద్ లో ఏవిధంగా అగ్రిమెంట్లు  జరుగుతున్నాయో అదేమాదిరిగా అగ్రిమెంట్లున...

విజ్ఞాన్స్‌లో ఘనంగా లావు రత్తయ్య పుట్టినరోజు వేడుకలు

విజ్ఞాన్స్‌లో ఘనంగా లావు రత్తయ్య పుట్టినరోజు వేడుకలు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య జన్మదిన వేడుకలను ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ విద్యార్థులు మాత్రమే తారతమ్య భేధాలు లేకుండా శుభాకాంక్షలు తెలియజేస్తారని అన్నారు. విద్యార్థులందరూ జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహిస్తే తాను ఇంకా ఎక్కువ సంతోషిస్తామని తెలియజేశారు. విద్యార్థులతో తనకున్న అనుబంధం మాటల్లో వర్ణించలేనిదని, అందుకోసమే ప్రతి సంవత్సరం తన పుట్టినరోజును ఇలా విద్యార్థుల మధ్య జరుపుకోవడానికి ఇష్టపడతానని పేర్కొన్నారు. సాధారణ ఆలోచనలతో కాకుండా క్రియేటివ్‌గా ఆలోచిస్తేనే విజయం సాధించగలరని విద్యార్థులకు సూచించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలోనే విద్యార్థులు సరైన దిశగా ఎదగలగరనే సిద్ధాంతాన్ని తాను మొదటి నుంచి నమ్ముతున్నానని చెప్పారు. అదే సూత్రాన్ని తాము ప్రతి పాఠశాల, కళాశాలల్లో అమలు చేస్తున్నామని తెలిపారు.  కాబట్టే తమ విద్యార్థులు ఎన్నో అద్భుతాలు చేయగ...

అందరూ రక్తదానం చేయాలి

అందరూ రక్తదానం చేయాలి - విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: రక్తదానం ప్రాణదానంతో సమానమాని, విద్యార్థులు అందరూ రక్తదానానికి పూనుకోవాలని విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య పిలుపునిచ్చారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శనివారం విద్యార్థులు రక్తదానం చేశారు. విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం వారు జీజీహెచ్‌ గుంటూరు, నీడ్స్‌ బ్లడ్‌ బ్యాంక్, లైఫ్‌ షేర్, తలసేమీయా నీడ్స్‌ బ్లడ్‌ బ్యాంక్‌ల సంయుక్త ఆధ్వర్యంలో యూనివర్సిటీలో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి రెండు సెకన్లకు ఎక్కడో ఓ చోట ఎవరో ఒకరికి రక్తం అవసరం అవుతూనే ఉన్నదని తెలిపారు. విద్యార్థులు తాము రక్తదానం చేయడంతోపాటు మిత్రులను కూడా ఈ మహత్తర కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని కోరారు. రక్తదానం చేశాక శరీరం తాను కోల్పోయిన రక్తాన్ని 48 గంటల్లోగా తిరిగ...

మ్యూజిక్ షాప్ మూర్తి చూడండి..

మ్యూజిక్ షాప్ మూర్తి . చూసారా ! చూసి ఉండకపోతే తప్పక చూడండి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: మ్యూజిక్ కేసెట్ల వ్యాపారం చేసుకునే మూర్తి యాభై ఏళ్ళ వయసులో DJ నేర్చుకుని , పట్టుదలతో  హైదరాబాద్ వెళ్లి DJ ఆర్టిస్ట్ కావటం కధాంశం . ఈ క్రమంలో అంజనా అనే అమ్మాయి స్నేహితురాలు , గురువు కావటం బాగుంటుంది , కధను నడిపిస్తుంది . మంచి నటుడిగా మనందరికీ పరిచయమే . దిగువ మధ్య తరగతి కుటుంబీకుడిగా , దేనికయినా సర్దుకుపోయేవాడిగా , ఏ అవమానాన్ని అయినా భరించేవాడిగా , ఆశయాన్ని విడవని విక్రమార్కుడిగా subdued నటన చక్కగా ప్రదర్శించారు .  అతని తర్వాత చాందినీ చౌదరి , ఆమని చాలా  బాగా నటించారు . అజయ్ ఘోష్ కుమార్తెలు , హైదరాబాదులో అతన్ని ఆదరించే మిత్రులుగా నటించినవారు , భానుచందర్ , అందరూ తమ తమ పాత్రలను బాగా పోషించారు . సినిమా లోని పాత్రలన్నీ మంచి పాత్రలే . సమాజంలో ఇంత మంది మంచివారు ఉన్నట్లు చూపిన కధా రచయితను , దర్శకుడు శివ పాలడుగుని మెచ్చుకోవాల్సిందే .సినిమాలో టివి ఇంటర్వ్యూ మనసుల్ని కదిలిస్తుంది . Really heart-touching . సంగీత దర్శకుడు పవన్ సంగీత దర్శకత్వంలో పాటలు , నేపధ్య సంగీతం బాగున్నాయి . స్లోగా ఉ...

భవిష్యత్‌ మెకానికల్, సివిల్‌ రంగాలదే!

భవిష్యత్‌ మెకానికల్, సివిల్‌ రంగాలదే! - షార్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌ గ్రూప్‌ డైరక్టర్‌ పీ.గోపీక్రిష్ణ  టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: రాబోవు కాలంలో ఆటోమేషన్‌ రంగంలోని మెకానికల్, సివిల్‌ ఇంజినీరింగ్‌ రంగాల విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని షార్‌ ( శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ ) మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌ గ్రూప్‌ డైరక్టర్‌ పీ.గోపీక్రిష్ణ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు ముఖ్య అతిథిగా విచ్చేసిన షార్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌ గ్రూప్‌ డైరక్టర్‌ పీ.గోపీక్రిష్ణ మెకానికల్, సివిల్‌ ఇంజినీరింగ్‌ అధ్యాపకులు, విద్యార్థులకు ప్రత్యేక అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెకట్రానిక్స్, రోబోటిక్స్, స్పేస్‌ క్రాఫ్ట్‌ డిజైన్‌లో గల ఉన్నత సాంకేతిక నైపుణ్యాలపై అవగాహన కల్పించారు. కోర్‌ ఇంజినీరింగ్, స్పేస్‌ టెక్నాలజీ రంగాలలో గల ఉద్యోగ అవకాశాలను విద్యార్థులతో పంచుకున్నారు. తయారీ రంగంలో మిగిలిన ప్రపంచ దేశాలు ప్రస్తుతం వెనుకంజలో ఉన్నాయని, మన దేశం తయారీ రంగంలో అగ్రగామిగా నిలవడానికి ఇదే సరైన సమయమన్నారు. రాబోయే రోజ...

విజ్ఞాన్స్‌ వర్సిటీ లైబ్రేరియన్‌కు అయ్యంకి వెలగా పురస్కారం

విజ్ఞాన్స్‌ వర్సిటీ లైబ్రేరియన్‌కు అయ్యంకి వెలగా పురస్కారం టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ప్రధాన గ్రంథాలయ అధికారిణి  ఆచంట రజనీకుమారికు గ్రంథాలయ పితామహుడు, పద్మశ్రీ అయ్యంకి వెంకటరమణయ్య, గ్రంథాలయ గాంధీ డాక్టర్‌ వెలగా వెంకటప్పయ్యల పేర్లతో ప్రతిష్టాత్మకంగా ఇచ్చే గ్రంథాలయ పురస్కారం అందుకున్నారని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణం గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో వీసీ మాట్లాడుతూ అన్నమయ్య సేవా సమితి ఆధ్వర్యంలో గుంటూరులోని బృందావన్‌ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి డాక్టర్‌ జస్టిస్‌ కేజీ శంకర్, డాక్టర్‌ ఆరేటి కృష్ణకుమారీలు చేతుల మీదుగా గ్రంథాలయ పురస్కారంతో పాటు రూ.10 వేల నగదు బహుమతిని అందుకున్నారని వెల్లడించారు. ఆచంట రజనీకుమారి గడిచిన 28 సంవత్సరాలుగా లైబ్రేరియన్‌గా ఎంతో విలువైన సేవలు అందించారని, వర్సిటీలో డిజిటల్‌ లైబ్రరీను ఏర్పాటు చేయడంతో పాటు ఎప్పటికప్పుడు విద్యార్థులు, రీసెర్చ్‌ స్కాలర్స్, అధ్యాపకులకు అవసరమైన పుస్తకాలను, పరిశోధన పత్రాలను అందజేయడం...

కేంద్రబడ్జెట్ ఏపికి సంతృప్తి కలిగిస్తుంది

కేంద్రబడ్జెట్ ఏపికి సంతృప్తి కలిగిస్తుంది తెదేపా వాణిజ్యవిభాగం రాష్ట్ర అధికారప్రతినిధి ఈదర టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనికి కేంద్ర బడ్జెట్ సంతృప్తి కలిగిస్తుందని రాష్ట్ర తెదేపా వాణిజ్యవిభాగం రాష్ట్ర అధికారప్రతినిధి ఈదర వెంకటపూర్ణచంద్ అన్నారు. ఆమేరకు ఆయన బుధవారం పట్టణంలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కేంద్రం బడ్జెట్లో ఏపి రాజధాని అమరావతికి రూ 15వేల కోట్లు పోలవరం నిర్మాణ బాధ్యత తీసుకోవటం శుభపరిణామన్నారు. విశాఖ-చెన్నె కోస్టల్ కారిడార్,పరిశ్రమలు, రైల్వేల అభివృద్ధికి నిధులు కేటాయింపుపై ప్రకటన చేయటం సంతోషంగా ఉందని తెలిపారు. నిధులు సమీకరణలో ప్రణాళికా బద్దంగా పనిచేసి సఫలీకృతులైన ఎపి అభివృద్ధి కాముకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతులు తెలిపారు. గుంటూరు జిల్లా అభివృద్ధికి కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్రమంత్రులు నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్ లు చేస్తున్న కృషికి అభినందనలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గుంటూరు జిల్లాను కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి చేయాలని మంత్రులకు విన్నవించారు. ప...

నేటి సమాజానికి జాషువ రచనలు మార్గదర్శకం

నేటి సమాజానికి జాషువ రచనలు మార్గదర్శకం టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తెనాలి: 24-07-2024: నేటి సమాజానికి జాషువ రచనలు మార్గదర్శకమని పలువురు వక్తలు అన్నారు. గుర్రం జాషువ 53వ వర్థంతిని పురస్కరించుకుని గుర్రం జాషువ విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో స్థానిక బస్టాండ్ వద్ద కల జాషువ విగ్రహానికి పూలమాలలు వేసి పలువురు నివాళులర్పించారు. ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించిన జాషువ సాహితీవేత్తగా ఎదిగి 59 ఖండకావ్యాలు, 14 నాటకాలు రాసారని, అలనాటి సమాజంలోని రుగ్మతలను రూపుమాపేందుకు తన రచనల ద్వారా 'సమాజంలో చైతన్యం తీసుకువచ్చిన విశ్వనరుడు జాషువ అని వక్తలు కొనియాడారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ పొన్నెకంటి రత్నాకర్ ఇటీవల బాపూ జగజ్జీవనరామ్ ఛైర్కు సంచాలకులుగా నియమితులైన నేపథ్యంలో ఈ కార్యక్రమంలో ఆయనను గుర్రం జాషువ విజ్ఞాన సమితి నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమలో జె. న్యూటన్, పి. రవికుమార్, కొండమూది రమేష్, వి. రత్నం, పి. రాజగోపాల్, గరికిపాటి సుబ్బారావు, షేక్ అబ్దుల్ హకీం జాని, యండ్రపాటి అశోక్ కుమార్, కె. సింగయ్య, వి. రాజారత్నం, ...

భవిష్యత్‌లో ఈవీ ఇండస్ట్రీలో మిలియన్‌ ఉద్యోగాలు

భవిష్యత్‌లో ఈవీ ఇండస్ట్రీలో మిలియన్‌ ఉద్యోగాలు -  ఎన్‌ఐటీ ఏపీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ వీ.సందీప్‌ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: భవిష్యత్‌లో ఈవీ ( ఎలక్ట్రిక్‌ వెహికల్‌) ఇండస్ట్రీలో మిలియన్‌ ఉద్యోగాలు క్రియేట్‌ చేయబడుతాయని ఎన్‌ఐటీ ఏపీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ వీ.సందీప్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలలోని ఈఈఈ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో ఏఐసీటీఈ– వాణి ( వైబ్రంట్‌ అడ్వోకసీ ఫర్‌ అడ్వాన్స్‌మెంట్‌ అండ్‌ నర్చరింగ్‌ ఆఫ్‌ ఇండియన్‌ ల్యాంగ్వేజెస్‌) ఆర్థిక సహకారంతో ‘‘విద్యుదీకరణ చలనశీలత: ఎలక్ట్రిక్‌ వాహనాలతో భవిష్యత్‌ను రూపొందించడం’’ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించనున్న వర్క్‌షాప్‌ను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్‌ఐటీ ఏపీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ వీ.సందీప్‌ మాట్లాడుతూ భవిష్యత్‌ అంతా ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌దేనని పేర్కొన్నారు. రెన్యూవబుల్‌ ఎనర్జీ మరియు ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ రంగాలలో విద్యార్థులకు అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ఎలక్ట్రికల్‌ వెహికల్స్‌ డిజైనింగ్‌ను ఎలక్ట్రికల్‌...

విజ్ఞాన్స్‌ విద్యార్థికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ విద్యార్థికి పీహెచ్‌డీ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగంలోని ఈఈఈ  డిపార్ట్‌మెంట్‌కు చెందిన విద్యార్థి ముత్తుకూరి నరేంద్ర కుమార్‌కు తమ యూనివర్సిటీ పీహెచ్‌డీ పట్టా అందజేసిందని వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ శనివారం తెలిపారు. ఈయన ‘‘ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ప్రొపోర్షనల్‌ రీసోనంట్‌ క్రంటోల్డ్‌ సింగల్‌ ఫేస్‌ ఫిఫ్టీన్‌ లెవల్‌ ప్యాక్డ్‌ యూ సెల్‌ మల్టిలెవల్‌ ఇన్వర్టర్‌ పీవీ అప్లికేషన్స్‌’’ అనే అంశంపై పరిశోధన చేశారని తెలియజేసారు. ఈయనకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఈఈఈ డిపార్ట్‌మెంట్‌లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ మోపిదేవి సుబ్బరావు గైడ్‌గా వ్యవహరించారని పేర్కొన్నారు. ఈయన తన పరిశోధనలో భాగంగా మొత్తం  ఎస్‌సీఐ–1, స్కోపస్‌ జర్నల్స్‌–2, ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌లు 2 ప్రచురించారని వెల్లడించారు. పీహెచ్‌డీ పట్టాపొందిన ముత్తుకూరి నరేంద్ర కుమార్‌ను ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు.

సామాజిక మాధ్యమాల వలన కాలం వృథా

సామాజిక మాధ్యమాల వలన కాలం వృథా - తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ గురిజాల రాధారాణి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తెనాలి: 20-07-2024: సామాజిక మాధ్యమాలు, సెల్ఫోన్లతో కాలాన్ని వృథా చేయకుండా, సామాన్య జీవితాన్ని గడుపుతూ ఆదర్శంగా జీవించడం బాల్యం నుండి అలవరచుకోవాలని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ గురిజాల రాధారాణి అన్నారు. కీ.శే. మొవ్వా విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రలో శనివారం ఉదయం సమితి వ్యవస్థాపకుడు మొవ్వా సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మొవ్వా విజయలక్ష్మి స్మారక పురస్కారాన్ని సబ్ కలెక్టర్ ప్రఖరైన్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ చేతులమీదుగా జస్టిస్ గురిజాల రాధారాణి అందుకుని అనంతరం జరిగిన సభలో ఆమె 'విద్యార్థులు-భవిష్యత్ సవాళ్ళు' అనే అంశంపై ప్రసంగించారు. సభకు సమితి వ్యవస్థాపకులు మొవ్వా సత్యనారాయణ అధ్యక్షత వహించారు. రాధారాణి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ మనం చదివే చదువు వినూత్న ఆలోచనా ధోరణి నేర్పేలా ఉండాలి అన్నారు. చదువంటే మార్కులు, ఉద్యోగం కోసం కాదు. మానసిక వికాసం క...

ఏపీలో 17 యూనివర్సిటీలకు కొత్త వీసీలు-జాబితా ఇదే..

 టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: కూటమి సర్కార్ ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పలు యూనివర్శిటీలకు ఇన్ చార్జ్ వీసీలను నియమిస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 17 యూనివర్శిటీలకు ఇన్ ఛార్జ్ లుగా పలువురు అధ్యాపకులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రంలో ఐదు యూనివర్శిటీ చట్టాల ప్రకారం వీరి నియామకాలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఇన్ ఛార్జ్ వీసీగా ప్రొఫెసర్ చిప్పాడ అప్పారావు, అనంతపురం ఎస్కేయూ వీసీగా ప్రొఫెసర్ బి అనిత, విశాఖ ఆంధ్రా వర్శిటీ వీసీగా ప్రొఫెసర్ గొట్టాపు శశిభూషణ్ రావు, గుంటూరు నాగార్జున వర్సిటీ వీసీగా ప్రొఫెసర్ కంచర్ల గంగాధర్, అనంతపురం జేఎన్టీయూ వీసీగా హెచ్. సుదర్శనరావు, తిరుపతి పద్మావతి మహిళా వర్శిటీ వీసీగా ప్రొఫెసర్ వి.ఉమ, విజయనగరం జేఎన్డీయూ గురజాడ వర్శిటీ వీసీగా ప్రొఫెసర్ డి రాజ్యలక్ష్మిని నియమించారు. కాకినాడ జేఎన్టీయూ వీసీగా ప్రొఫెసర్ కేవీసీజీ మురళీకృష్ణ, రాజమండ్రి ఆదికవి నన్నయ్య వర్శిటీ వీసీగా ప్రొఫెసర్ వై శ్రీనివాసరావు, నెల్లూరు విక్రమ సింహపురి వర్శిటీ వీసీగా ప్రొఫెసర్ సారంగం విజయభాస్కర్ రావు, బందరు కృష్...

పుట్టిన రోజు శుభాకాంక్షలు

పెమ్మసాని జోక్యంతో రైళ్ల పునరుద్ధరణ

పెమ్మసాని జోక్యంతో రైళ్ల పునరుద్ధరణ   టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: రైల్వే ప్రయాణికుల ఇక్కట్లను గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఒక్క లేఖతో పరిష్కరించారు. గూడూరు-విజయవాడ, విజయవాడ-గూడూరు మీదుగా ప్రయాణించే రెండు రైళ్ల రాకపోకల రద్దును రైల్వే అధికారులతో మాట్లాడి తక్షణమే అందుబాటులోకి వచ్చేలా చేశారు. వివరాల్లోకి వెళితే నూతన రైల్వే లైన్ నిర్మాణం, రైల్వే సిగ్నలింగ్ ఆధునీకరణ నేపథ్యంలో ఇటీవలే 25 ప్యాసింజర్ ఎక్స్ ప్రెస్ రైళ్ళను రద్దు చేస్తున్నట్లుగా రైల్వే శాఖ ఇటీవల ప్రకటించింది. అందులో భాగంగా గూడూరు-విజయవాడ, విజయవాడ - గూడూరు మీదుగా రాకపోకలు సాగించే రెండు రైళ్ళను కూడా దక్షిణ మధ్య రైల్వే అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. దీంతో ఒంగోలు-బాపట్ల - తెనాలి మీదుగా విజయవాడకు నిత్యం ప్రయాణించే కార్మికులు, ఉద్యోగస్తులు, వ్యాపారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రయాణికుల ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కు కేంద్ర సహాయ మంత్రి సోమవారం లేఖ రాశారు. డాక్టర్ పెమ్మసాని జోక్యంతో రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్...

సినిమాటోగ్రఫీ మంత్రితో 'మా - ఎపి' చర్చలు

సినిమాటోగ్రఫీ మంత్రితో 'మా - ఎపి' చర్చలు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేషు శనివారం రాష్ట్ర సెక్రటరియెట్లో మా-ఎపి (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, 24 విభాగాల యూనియన్) ప్రతినిధులు సమావేశం అయ్యారు. ఎపిలో సినీపరిశ్రమ అభివృద్ధిపై సినిమాటోగ్రఫీ మంత్రితో చర్చించిన ప్రధాన అంశాల వివరాలను స్థానిక “మా-ఎపి” కార్యాలయంలో మా ఎపి వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీదర్శకుడు దిలీప్ రాజా శనివారం వెల్లడించారు. ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పనపై తక్షణ చర్చలు తీసుకోవలసిందిగా కోరినట్లు ఆయన తెలిపారు. అమరావతి సినిమా స్టూడియోస్ పేరుతో అమరావతిలో వంద ఎకరాలలో ప్రభుత్వమే స్టూడియోను నిర్మించాలని అలాగే రాజమండ్రి, విశాఖపట్నం బీబ్, తిరుపతిలలో కూడా స్టూడియోలు నిర్మించుకునేందుకు ఆసక్తి చూపిన నిర్మాతలకు కనీసం పదిఫ్లోర్లకు తగ్గకుండా ఏర్పాటుచేసుకొనేందుకు తగిన చర్యలను తీసుకొవాల్సిందిగా ప్రభుత్వానికి మనవి చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు. నిర్మాతలు, దర్శకులు, నటీనటుల, సాంకేతిక నిపుణులకు అమరావతిలోనే ఇండ్లస్థలాలను కేటాయించాలని కొరినట్లుగా దిలీవ్రాజా వివరించార...

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

విజ్ఞాన్స్‌ వర్సిటీలో ఘనంగా రోబోట్‌ మ్యానుఫాక్చరింగ్‌ హబ్‌ ప్రారంభం

- రోబోటిక్స్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు - రోబోకప్లర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఈవో ప్రవీణ్‌ మల్లా - విజ్ఞాన్స్‌ వర్సిటీలో ఘనంగా రోబోట్‌ మ్యానుఫాక్చరింగ్‌    హబ్‌ ప్రారంభం టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: భవిష్యత్తులో రోబోటిక్స్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని రోబోకప్లర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఈవో ప్రవీణ్‌ మల్లా అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ కోర్‌ ఇంజినీరింగ్‌లోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ ( రోబోటిక్స్‌ అండ్‌ ఆటోమేషన్‌) విభాగంలో ‘‘ రోబోకప్లర్స్‌ సెమి–హ్యూమనాయిడ్‌ రోబోట్‌ మ్యానుఫాక్చరింగ్‌ హబ్‌’’ ను గురువారం ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రోబోకప్లర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఈవో ప్రవీణ్‌ మల్లా మాట్లాడుతూ విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అడ్వాన్స్‌డ్‌ రోబోటిక్స్‌ లేబొరేటరీతో మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ రోబోట్‌ మ్యానుఫాక్చరింగ్‌ హబ్‌ వల్ల విద్యార్థులతో పాటు పరిశోధనా అధ్యాపకులు రోబోట్‌లను రూపొందించడం, వాటిని అభివృద్ధి చేయడం మాత్రమే కాకుం...

విజ్ఞాన్స్‌లో ఘనంగా ‘‘ భారత్‌ పిచథాన్‌ 3.0 ’’

విజ్ఞాన్స్‌లో ఘనంగా ‘‘ భారత్‌ పిచథాన్‌ 3.0 ’’ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఆఫీస్‌ ఆఫ్‌ డీన్‌ ప్రమోషన్స్‌ కొలాబరేషన్స్‌ అండ్‌ ఫ్యాకల్టీ అఫైర్స్, విజ్ఞాన్‌ టీబీఐ, ఈసెల్, హెడ్‌స్టార్ట్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ‘‘భారత్‌ పిచథాన్‌ 3.0’’కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ‘‘అన్‌ఎర్తింగ్‌ స్టార్టప్స్‌ ఫ్రమ్‌ భారత్‌’’ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. ఆవిష్కరణలు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్స్‌ను పెంపొందించే లక్ష్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ స్టార్టప్‌ల నుండి ఆయా కంపెనీల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమానికి విజ్ఞాన్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ ముఖ్య అతిథిగా హాజరై పారిశ్రామికవేత్తలతో సంభాషించి వారిని ప్రోత్సహిస్తూ, పారిశ్రామికవేత్తలకు విజ్ఞాన్‌ అందిస్తున్న సహకారం గురించి మాట్లాడారు. అనంతరం హైదరాబాద్‌లోని నాంది వెంచర్స్‌తో ఎంవోయూపై సంతకం చేశారు. అనంతరం ఎంవోయూ పత్రాలను నాంది వెంచర్స్‌ కోఫౌండర్‌ వికాస్‌ కాట్రగడ్డకు అందజేసారు. హెడ్‌స్టార్ట్‌ నిర్వహించిన ఈ భారత్‌ పిచాథ...

నిరుపేద గిరిజనులకు అంజలి నిత్యావసరాలు పంపిణి

నిరుపేద గిరిజనులకు అంజలి నిత్యావసరాలు పంపిణి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తెనాలి,జూలై 4 : స్థానిక యడ్ల లింగయ్య కాలనీలో  యానాది సామాజికవర్గoలోని నిరుపేదలకు ట్రైబల్స్ మినిస్ట్రీ అధ్యక్షులు అంజలి రావూరి గురువారం నిత్యావసరాలను పంపిణిచేశారు.ఆయా గిరిజనుల బిడ్డలను పాఠశాలలో  చేర్చవలసిందిగా ఆమె గిరిజనులకు సూచించారు.బడులకు పంపకుండా పనులకు పo పించడం వలన పిల్లల జీవితాలు బ్రతికున్నంతకాలం ప్రశ్నార్ధకం  అవుతాయని ఆమె  చెప్పారు.ఇప్పటికే తరతరాలుగా యానాది సామాజవర్గానికి చెందిన కుటుంబాలు చెట్లకిందో.. పాముల పుట్టల పక్కనో నివాసం ఉంటు జీవితకాలం నిరాశ్రయులుగా బ్రతికేస్తున్నారనే  ఆవేదనను ఆమె వ్యక్తం చేశారు.అందుకే ప్రతి మనిషి తలరాతను చదువు మార్చెస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.ఈసందర్భంగా పాఠశాలలో చేరిన 13 మంది గిరిజన బాలబాలికలకు ఆధార్ కార్డు మంజూరు కోసo యoఈవో  ద్వార తగిన చర్యలను తీసుకున్నట్లుగా అంజలి తెలిపారు.కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి డాక్టర్ మేకల లక్ష్మీనారాయణ, ఇంటూరు విజయ భాస్కర్ ,దోనేపూడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

హోం మంత్రి అనితతో దిలీప్ రాజా భేటీ

హోం మంత్రి అనితతో దిలీప్ రాజా భేట టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తెనాలి, జూలై 3: రాష్ట్ర హోం శాఖ మంత్రి అనితతో సినీ దర్శకుడు,మా - ఏపి వ్యవస్థాపకులు దిలీప్ రాజా బుధవారం సెక్రెటేరియెట్ లో సమావేశమయ్యారు.స్టానిక విలేకరులకు సమావేశపు వివరాలను వెళ్ళడించారు.ఆగస్ట్ మాసంలో తెనాలిలో జరుగనున్న సినిమా సంబంధీత కార్యక్రమంపై హోం శాఖమంత్రి వంగలపూడి అనితతో ఆయన చర్చించినట్లు తెలిపారు.రాష్ట్ర సివిల్ సప్లైస్ శాఖమంత్రి నాదెండ్ల మనోహర్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లతో మాట్లాడిన అనంతరం ఏ రోజున కార్యక్రమం జరిగేది నిర్ణయిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈసినిమా కార్యక్రమానికి కొందరు శాసన సభ్యులను కూడా ఆహ్వానించినట్లు దిలీప్ రాజా చెప్పారు.హోం శాఖ మంత్రిని కలిసిన వారిలో నటుడు మిలటరీ ప్రసాద్, సహాయ దర్శకుడు వెంకీ రావన్ ఉన్నారు.

Learning and Development Should Be a Happy Process

Learning and Development Should Be a Happy Process  - Says Dr. Lavu Rathaiah - Vignan University Commences B.Tech First Year Classes Talent express news: Vignan University kicked off its B.Tech first year classes on Monday, welcoming students and their parents from across the state. Dr. Lavu Rathaiah, Chairman of Vignan Educational Institutions, addressed the gathering as the chief guest, emphasizing the importance of a joyful approach to education and development.Dr. Rathaiah extended his gratitude to the parents for choosing Vignan University and congratulated the students on their new journey. He highlighted the success of the Pancha Sutras, a unique program comprising Faculty Development Program, Planning, Training, Communication System, Counseling System, CRT Classes, and Teaching Method, which has propelled many of their alumni to high positions in life. He encouraged parents to support their children holistically, emphasizing the university's focus on physical fi...

అందమైన కంప్యూటర్ డిజైన్ వర్క్స్ కోసం..