ఏపీలో 17 యూనివర్సిటీలకు కొత్త వీసీలు-జాబితా ఇదే..

 టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
కూటమి సర్కార్ ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పలు యూనివర్శిటీలకు ఇన్ చార్జ్ వీసీలను నియమిస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 17 యూనివర్శిటీలకు ఇన్ ఛార్జ్ లుగా పలువురు అధ్యాపకులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రంలో ఐదు యూనివర్శిటీ చట్టాల ప్రకారం వీరి నియామకాలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఇన్ ఛార్జ్ వీసీగా ప్రొఫెసర్ చిప్పాడ అప్పారావు, అనంతపురం ఎస్కేయూ వీసీగా ప్రొఫెసర్ బి అనిత, విశాఖ ఆంధ్రా వర్శిటీ వీసీగా ప్రొఫెసర్ గొట్టాపు శశిభూషణ్ రావు, గుంటూరు నాగార్జున వర్సిటీ వీసీగా ప్రొఫెసర్ కంచర్ల గంగాధర్, అనంతపురం జేఎన్టీయూ వీసీగా హెచ్. సుదర్శనరావు, తిరుపతి పద్మావతి మహిళా వర్శిటీ వీసీగా ప్రొఫెసర్ వి.ఉమ, విజయనగరం జేఎన్డీయూ గురజాడ వర్శిటీ వీసీగా ప్రొఫెసర్ డి రాజ్యలక్ష్మిని నియమించారు. కాకినాడ జేఎన్టీయూ వీసీగా ప్రొఫెసర్ కేవీసీజీ మురళీకృష్ణ, రాజమండ్రి ఆదికవి నన్నయ్య వర్శిటీ వీసీగా ప్రొఫెసర్ వై శ్రీనివాసరావు, నెల్లూరు విక్రమ సింహపురి వర్శిటీ వీసీగా ప్రొఫెసర్ సారంగం విజయభాస్కర్ రావు, బందరు కృష్ణావర్శిటీ వీసీగా ఆర్ శ్రీనివాసరావు, కర్నూలు రాయలసీమ వర్శిటీ వీసీగా ఎన్టీకే నాయక్, కుప్పం ద్రవిడ వర్శిటీ వీసీగా దొరైస్వామి, కడప వైఎస్సార్ ఆర్కిటెక్చర్ వర్శిటీ వీసీగా విశ్వనాథ కుార్, ఒంగోలు ఆంధ్రకేసరి వర్శిటీ డీవీఆర్ మూర్తి, కర్నూలు అబ్దుల్ హక్ ఉర్దూ వర్సిటీ వీసీగా పటాన్ షేక్ షావల్లీ ఖాన్, కడప యోగి వేమన వర్శిటీ వీసీగా కె. కృష్ణారెడ్డి నియమితులయ్యారు.