సినిమాల ప్రదర్శనకు తెలంగాణా థియేటర్ల పర్సంటేజ్ విదానాన్ని ఏపి లోనూ అమలు చేయాలి

ఆగస్ట్ 2 నుండి సినిమాల ప్రదర్శనకు తెలంగాణాలో  పర్సంటేజ్ మాత్రమే !
✓ ఆంధ్రలోనూ అమలు చేయాలి
✓ చిన్న సినిమాల విడుదలకు సదవకాశం
✓ ధియేటర్లూ బ్రతుతాయి!
- మా- ఎపి దిలీప్ రాజా 
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెనాలి జూలై 29: తెలంగాణాలో ఆగస్టు 2 నుండి ధియేటర్లలో సినిమాల ప్రదర్శనకు ధియేటర్లలో పర్సంటేజీ పద్ధతి  ఆచరణలోకి వస్తున్న నేపధ్యంలో తెలుగురాష్ట్రాల్లో భాగమైన ఆంధ్రప్రదేశ్ లో  కూడా ఇదే పద్ధతిని అమలు చేయాలని ' మా - ఏపి' వ్యవస్థాపకులు, సినీ దర్శకుడు దిలీప్ రాజా కొరారు.స్థానిక ' మా-ఏపీ' 24 విభాగాల యూనియన్ కార్యాలయంలో సోమవారo ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతoలోమాదిరిగా ధియేటర్లకు అద్దె చెల్లించకుండా పర్సంటేజీ పద్దతి వలన చిన్నసినిమానిర్మాతలకుఎoతోఉపయోగమన్నారు.
దీనివలన చిన్న సినిమాలు విడుదలకు నోచుకుంటాయనే 
ఆశాభావాన్ని ఆయన వ్యక్తo చేశారు.వెంటిలేటర్ పై ఉన్న ధియేటర్లు బ్రతుకుతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.గ్లోబల్ ఫిలిoస్ సునీల్ నారంగ్, యస్వీ క్రియేషన్స్ శిరీష్ రెడ్డిల దగ్గర హైదరాబాద్ లో ఏవిధంగా అగ్రిమెంట్లు  జరుగుతున్నాయో అదేమాదిరిగా అగ్రిమెంట్లును రూపొందించుకోవాల్సిందిగా ఆంధ్రకు చెందిన చిన్న
నిర్మాతలకు ఆయన సూచించారు.దయచేసి  ఖాళీ అగ్రిమెంట్లను ఎవరూ ఇచ్ఛిరావద్దని దిలీప్ రాజా సలహా ఇచ్చారు.దర్శకుడు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ భారత దేశంలోని అన్ని సింగిల్ స్క్రీన్ ధియేటర్లకు పర్సంటేజీ విధానంలో షేర్ ఇవ్వబడుతుందని చెప్పారు.ఎపి లో ధియేటర్ల యాజమాన్యం,కంట్రోలర్ అసోసియేషన్ సహకరించవలసిందిగా  ఆయన కోరారు.సమావేశంలో  కో - డైరెక్టర్ ఇంటూరి విజయ భాస్కర్,సిద్దెల మనోహర్ పాల్గొన్నారు.