విజ్ఞాన్స్‌ వర్సిటీలో ఘనంగా రోబోట్‌ మ్యానుఫాక్చరింగ్‌ హబ్‌ ప్రారంభం

- రోబోటిక్స్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు
- రోబోకప్లర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఈవో ప్రవీణ్‌ మల్లా
- విజ్ఞాన్స్‌ వర్సిటీలో ఘనంగా రోబోట్‌ మ్యానుఫాక్చరింగ్‌    హబ్‌ ప్రారంభం
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
భవిష్యత్తులో రోబోటిక్స్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని రోబోకప్లర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఈవో ప్రవీణ్‌ మల్లా అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ కోర్‌ ఇంజినీరింగ్‌లోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ ( రోబోటిక్స్‌ అండ్‌ ఆటోమేషన్‌) విభాగంలో ‘‘ రోబోకప్లర్స్‌ సెమి–హ్యూమనాయిడ్‌ రోబోట్‌ మ్యానుఫాక్చరింగ్‌ హబ్‌’’ ను గురువారం ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రోబోకప్లర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఈవో ప్రవీణ్‌ మల్లా మాట్లాడుతూ విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అడ్వాన్స్‌డ్‌ రోబోటిక్స్‌ లేబొరేటరీతో మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ రోబోట్‌ మ్యానుఫాక్చరింగ్‌ హబ్‌ వల్ల విద్యార్థులతో పాటు పరిశోధనా అధ్యాపకులు రోబోట్‌లను రూపొందించడం, వాటిని అభివృద్ధి చేయడం మాత్రమే కాకుండా వాటిని వాణిజ్యీకరణ కోసం మార్కెట్‌లోకి తీసుకెళ్లే అద్భుతమైన అవకాశం వస్తుందన్నారు. ఇండస్ట్రీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆవిష్కరణలను ప్రోత్సహించడంతో పాటు విద్యార్థులకు ప్రాక్టికల్‌గా మల్టీడిసిప్లనరీ నాలెడ్జ్‌ అనుభవం వస్తుందన్నారు. కార్యక్రమంలో వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, వర్సిటీలోని ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.