విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు.  ఈ సినిమాకి అశ్విన్‌ రామ్‌ దర్శకత్వం వహించగా, మ్యూజిక్‌ డైరెక్టర్‌గా వివేక్‌ సాగర్, డీవోపీ నరేష్‌ రామదురై, ఎడిటర్‌గా ప్రదీప్‌ ఈ రాఘవ్‌ పనిచేశారని తెలిపారు. సినిమా హీరోయిన్‌ నభా నటేష్‌ మాట్లాడుతూ ఈ సినిమా తన మనసుకు బాగా దగ్గరైన సినిమానని తెలియజేసారు. ఈ సినిమాలో తన పాత్ర ఇప్పటివరకు చేసిన పాత్రల కంటే వైవిధ్యభరితమైనదని వెల్లడించారు. అనంతరం డార్లింగ్‌ సినిమా యూనిట్‌ బృందాన్ని విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు అభినందించి చిత్రం అఖండ విజయం సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు