Skip to main content

సినిమాటోగ్రఫీ మంత్రితో 'మా - ఎపి' చర్చలు

సినిమాటోగ్రఫీ మంత్రితో 'మా - ఎపి' చర్చలు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేషు శనివారం రాష్ట్ర సెక్రటరియెట్లో మా-ఎపి (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, 24 విభాగాల యూనియన్) ప్రతినిధులు సమావేశం అయ్యారు. ఎపిలో సినీపరిశ్రమ అభివృద్ధిపై సినిమాటోగ్రఫీ మంత్రితో చర్చించిన ప్రధాన అంశాల వివరాలను స్థానిక “మా-ఎపి” కార్యాలయంలో మా ఎపి వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీదర్శకుడు దిలీప్ రాజా శనివారం వెల్లడించారు. ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పనపై తక్షణ చర్చలు తీసుకోవలసిందిగా కోరినట్లు ఆయన తెలిపారు. అమరావతి సినిమా స్టూడియోస్ పేరుతో అమరావతిలో వంద ఎకరాలలో ప్రభుత్వమే స్టూడియోను నిర్మించాలని అలాగే రాజమండ్రి, విశాఖపట్నం బీబ్, తిరుపతిలలో కూడా స్టూడియోలు నిర్మించుకునేందుకు ఆసక్తి చూపిన నిర్మాతలకు కనీసం పదిఫ్లోర్లకు తగ్గకుండా ఏర్పాటుచేసుకొనేందుకు తగిన చర్యలను తీసుకొవాల్సిందిగా ప్రభుత్వానికి మనవి చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు. నిర్మాతలు, దర్శకులు, నటీనటుల, సాంకేతిక నిపుణులకు అమరావతిలోనే ఇండ్లస్థలాలను కేటాయించాలని కొరినట్లుగా దిలీవ్రాజా వివరించారు. ఆంధ్రలో 1090 తెలంగాణాలో 485 సినిమా ధియేటర్లు ఉన్నప్పటికీ ఆంధ్రలో ఆయా ధియేటర్లు మూతబడకుండా ప్రభుత్వం ఆయకోవాల్సిన అవసరం వుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలిపారు. తామ తెలంగాణాకు గానీ వేరెవ్వరికీ గానీ వ్యతిరేకులం కాదని ఆంధ్రలో సినీ పరిశ్రమ అభివృద్ధి మాత్రం తమ ఏకైక ఏజండా అని ఆయన స్పష్టం చేశారు.
సినిమాటోగ్రఫీ చట్టం 1952 మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రనర్విభజన చట్టం 2014లో గల 108 సెక్షన్లు, 12 భాగాలు, 13 షెడ్యూల్సులో రాష్ట్రానికున్న స్వయంప్రతిపత్తి మేరకు ఆంధ్రలో సినీపరిశ్రమను అభివృద్ధి చేయవలసిందినా మా-ఎపి రూపొందించిన ప్రతిపాదనలను సినిమాటోగ్రఫీ మంత్రికి అందజేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో భవానీద్వీపం (విజయవాడ) కోనసీమ, గోదావరి తీరం, లంబసింగి, అరకులోయ, జలపాతాలు, సముద్ర తీరాలు, అడవులు, పచ్చటి పంటపొలాలు, ఇలా ఎన్నో లొకేషన్లు నిర్మాతలకు అందుబాటులో వున్నాయిని ఆయన వివరించారు. పరిశ్రమలో నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, టెక్నిషియన్లు ఆంధ్రవారే మూడోంతులు వున్న నేపధ్యంలో జన్మభూమిపై మమకారంతో ఆంధ్రప్రదేశ్లో సినీపరిశ్రమ అభివృద్ధికి ఆయా సినీపెద్దలు పెద్దమనసుతో ముందుకు రావాలని కోరారు. నటుడు మీసాల భాస్కర్ మాట్లడుటు చిన్న సినిమాలను బ్రతికించవలసినదిగా మంత్రిని కోరినట్లు తెలిపారు. సినిమాటోగ్రఫీ మంత్రితో మా ఎపి జరిపిన చర్చల్లో నటుడు మిలటరీ ప్రసాద్, హీరోయిన్ టీనా చౌదరి, మన్నె సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.
 

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...