Skip to main content

సామాజిక మాధ్యమాల వలన కాలం వృథా


సామాజిక మాధ్యమాల వలన కాలం వృథా
- తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ గురిజాల రాధారాణి
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెనాలి: 20-07-2024: సామాజిక మాధ్యమాలు, సెల్ఫోన్లతో కాలాన్ని వృథా చేయకుండా, సామాన్య జీవితాన్ని గడుపుతూ ఆదర్శంగా జీవించడం బాల్యం నుండి అలవరచుకోవాలని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ గురిజాల రాధారాణి అన్నారు. కీ.శే. మొవ్వా విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రలో శనివారం ఉదయం సమితి వ్యవస్థాపకుడు మొవ్వా సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మొవ్వా విజయలక్ష్మి స్మారక పురస్కారాన్ని సబ్ కలెక్టర్ ప్రఖరైన్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ చేతులమీదుగా జస్టిస్ గురిజాల రాధారాణి అందుకుని అనంతరం జరిగిన సభలో ఆమె 'విద్యార్థులు-భవిష్యత్ సవాళ్ళు' అనే అంశంపై ప్రసంగించారు. సభకు సమితి వ్యవస్థాపకులు మొవ్వా సత్యనారాయణ అధ్యక్షత వహించారు. రాధారాణి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ మనం చదివే చదువు వినూత్న ఆలోచనా ధోరణి నేర్పేలా ఉండాలి అన్నారు. చదువంటే మార్కులు, ఉద్యోగం కోసం కాదు. మానసిక వికాసం కోసం చదువుకోవాలి. ఉద్యోగం అవసరం. కానీ అదే పరమావధి కాదు. సాధారణంగా ఆడపిల్లలు క్రీడలకు దూరంగా ఉంటుంటారు. నేను బాలికను అనే న్యూనతా భావం ఏ కోశానా రాకుండా క్రీడల్లో కూడా రాణించాలి. తల్లిదండ్రులకు ఇంటి పనులలో ప్రతి విద్యార్థి సాయపడుతూ కుటుంబ, సమాజ విషయాలపట్ల అవగాహన పెంచుకోవాలి. చదువుతోపాటు నైతిక విలువలను నేర్పే ఉపాధ్యాయులు నేటి సమాజానికి అవసరం. అటువంటి ఉపాధ్యాయులను విద్యార్థులు జీవితాంతం గుర్తుంచుకుంటారు. వందశాతం కష్ట పడకుండా ఏదీ సాధించలేరని జస్టిస్ రాధారాణి అన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖరైజైన్ మాట్లాడుతూ జీవితంలో అపజయాలు వస్తుంటాయి. వాటిని పాఠాలుగా నేర్చుకుంటూ దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించే వైపు దృష్టి సారించాలి అన్నారు. పోటీపరీక్షలకు సంబంధించిన విషయాలలో అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తీసుకోవడం, విజ్ఞాన విషయలను చర్చించడం వల్ల విజయం పొందవచ్చని ప్రఖరైన్ అన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ మంచి, చెడులను విశ్లేషించుకుంటూ నైతిక విలువలతో కూడిన గుణగణాలతో విద్యను అభ్యసిస్తే బంగారు భవితకు మార్గం సుగమమౌతుందన్నారు. సభానంతంరం జస్టిస్ రాధారాణి, శీలం గాంధీ దంపతులకు ఘనంగా సత్కరించి శ్రీమతి మొవ్వా విజయలక్ష్మి స్మారక పురస్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో చైతన్య వేదిక అధ్యక్షుడు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి, హైదరాబాద్ రవాణాశాఖ మాజీ అడిషనల్ కమీషనర్ శీలం గాంధీ, అమృతసాయి ఇంజినీరింగ్ కళాశాల కరస్పాండెంట్ కె. రామమోహనరావు తదితరులు ప్రసంగించారు. అనంతరం గత విద్యా సంవత్సరం తెనాలి మున్సిపల్ పాఠశాలలతో పాటు తెనాలి మండలంలోని జిల్లాపరిషత్ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేసి 550కు పైగా మార్కులు సాధించిన 26 మంది టెన్త్ విద్యార్థులకు ఒక్కొక్కరిని రూ. 5 వేల నగదును బహూకరించి, జ్ఞాపికతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి రాజశేఖర్, ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కె. రామ్ చంద్ , మహమ్మద్ ఖుద్దూస్, జి. పూర్ణచంద్, కటకం ప్రసాద్, వెంకట్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...