నేటి సమాజానికి జాషువ రచనలు మార్గదర్శకం


నేటి సమాజానికి జాషువ రచనలు మార్గదర్శకం
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెనాలి: 24-07-2024: నేటి సమాజానికి జాషువ రచనలు మార్గదర్శకమని పలువురు వక్తలు అన్నారు. గుర్రం జాషువ 53వ వర్థంతిని పురస్కరించుకుని గుర్రం జాషువ విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో స్థానిక బస్టాండ్ వద్ద కల జాషువ విగ్రహానికి పూలమాలలు వేసి పలువురు నివాళులర్పించారు. ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించిన జాషువ సాహితీవేత్తగా ఎదిగి 59 ఖండకావ్యాలు, 14 నాటకాలు రాసారని, అలనాటి సమాజంలోని రుగ్మతలను రూపుమాపేందుకు తన రచనల ద్వారా 'సమాజంలో చైతన్యం తీసుకువచ్చిన విశ్వనరుడు జాషువ అని వక్తలు కొనియాడారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ పొన్నెకంటి రత్నాకర్ ఇటీవల బాపూ జగజ్జీవనరామ్ ఛైర్కు సంచాలకులుగా నియమితులైన నేపథ్యంలో ఈ కార్యక్రమంలో ఆయనను గుర్రం జాషువ విజ్ఞాన సమితి నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమలో జె. న్యూటన్, పి. రవికుమార్, కొండమూది రమేష్, వి. రత్నం, పి. రాజగోపాల్, గరికిపాటి సుబ్బారావు, షేక్ అబ్దుల్ హకీం జాని, యండ్రపాటి అశోక్ కుమార్, కె. సింగయ్య, వి. రాజారత్నం, ఏ. మల్లేశ్వరరావు, కె. దేవయ్య, శరత్ వెంకయ్య, సుద్దపల్లి మురళీధర్, కె. లక్ష్మణరావు, ఎల్. ప్రసాదరావు,
తదితరులు పాల్గొన్నారు.
5