కేంద్రబడ్జెట్ ఏపికి సంతృప్తి కలిగిస్తుంది

కేంద్రబడ్జెట్ ఏపికి సంతృప్తి కలిగిస్తుంది
తెదేపా వాణిజ్యవిభాగం రాష్ట్ర అధికారప్రతినిధి ఈదర
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనికి కేంద్ర బడ్జెట్ సంతృప్తి కలిగిస్తుందని రాష్ట్ర తెదేపా వాణిజ్యవిభాగం రాష్ట్ర అధికారప్రతినిధి ఈదర వెంకటపూర్ణచంద్ అన్నారు. ఆమేరకు ఆయన బుధవారం పట్టణంలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కేంద్రం బడ్జెట్లో ఏపి రాజధాని అమరావతికి రూ 15వేల కోట్లు పోలవరం నిర్మాణ బాధ్యత తీసుకోవటం శుభపరిణామన్నారు. విశాఖ-చెన్నె కోస్టల్
కారిడార్,పరిశ్రమలు, రైల్వేల అభివృద్ధికి నిధులు కేటాయింపుపై ప్రకటన చేయటం సంతోషంగా ఉందని తెలిపారు. నిధులు సమీకరణలో ప్రణాళికా బద్దంగా పనిచేసి సఫలీకృతులైన ఎపి అభివృద్ధి కాముకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతులు తెలిపారు. గుంటూరు జిల్లా అభివృద్ధికి కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్రమంత్రులు నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్ లు చేస్తున్న కృషికి అభినందనలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా గుంటూరు జిల్లాను కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి చేయాలని మంత్రులకు విన్నవించారు. పరిశ్రమలు ఏర్పాటు వలన నిరుద్యోగం తగ్గి ప్రజలకు మెరుగైన ఉపాధి లభించటంతోపాటు పేదరికం తీరే అవకాశాలు ఉన్నందున తెనాలి-గుంటూరు ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరారు.