అందరూ రక్తదానం చేయాలి

అందరూ రక్తదానం చేయాలి
- విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
రక్తదానం ప్రాణదానంతో సమానమాని, విద్యార్థులు అందరూ రక్తదానానికి పూనుకోవాలని విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య పిలుపునిచ్చారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శనివారం విద్యార్థులు రక్తదానం చేశారు. విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం వారు జీజీహెచ్‌ గుంటూరు, నీడ్స్‌ బ్లడ్‌ బ్యాంక్, లైఫ్‌ షేర్, తలసేమీయా నీడ్స్‌ బ్లడ్‌ బ్యాంక్‌ల సంయుక్త ఆధ్వర్యంలో యూనివర్సిటీలో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి రెండు సెకన్లకు ఎక్కడో ఓ చోట ఎవరో ఒకరికి రక్తం అవసరం అవుతూనే ఉన్నదని తెలిపారు. విద్యార్థులు తాము రక్తదానం చేయడంతోపాటు మిత్రులను కూడా ఈ మహత్తర కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని కోరారు. రక్తదానం చేశాక శరీరం తాను కోల్పోయిన రక్తాన్ని 48 గంటల్లోగా తిరిగి భర్తీ చేసుకుంటుందని వెల్లడించారు. రక్తాన్ని కృత్రిమంగా తయారుచేయలేమని, ఎవరైనా దానం చేస్తేనే లభిస్తుందని వెల్లడించారు. ప్రమాదాల సమయంలో బాధితులకు రక్తం అవసరం ఎంతో ఉంటుందని చెప్పారు. రక్తదానం వల్ల నేడు ఎంతో మందిని వైద్యులు బతికించగలుగుతున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ, విజ్ఞాన్స్‌ లారా, విజ్ఞాన్స్‌ ఫార్మసీ కాలేజికి చెందిన 400 మంది విద్యార్థులు రక్తదానం చేశారు.  అనంతరం రక్తదానం చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేసారు. అంతేకాకుండా తెనాలి చెంచుపేటలోని యేల్చూరి అమ్మ చారిటబుల్‌ ట్రస్ట్‌కు, కోయవారిపాలెం వృద్ధాశ్రమానికి, గాంధీ ఆశ్రమానికి, రెండు బ్లైండ్‌ స్కూల్స్‌ ( షిరిడి సాయి బ్లైండ్‌ స్కూల్, కళాభారతి బ్లైండ్‌ స్కూల్‌), చిన్నపిల్లల ఆశ్రమానికి నిత్యవసర సరుకులు, దుప్పట్లు, చీరలు అందజేసారు. వేజండ్ల, జాగర్లమూడి, అంగళకుదురు, నారాకోడూరు ప్రభుత్వ స్కూల్స్‌లో విద్యార్థులకు కాంపిటీషన్స్‌ నిర్వహించి బహుమతులు అందజేసారు. వీరనాయకునిపాలెంలో మెడికల్‌ క్యాంప్‌ను నిర్వహించారు. నేడు వడ్లమూడిలో కంటి చెకప్‌ క్యాంప్‌ను నిర్వహించనున్నారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌స్‌స్‌ విద్యార్థులు, పాల్గొన్నారు.