మ్యూజిక్ షాప్ మూర్తి చూడండి..

మ్యూజిక్ షాప్ మూర్తి . చూసారా ! చూసి ఉండకపోతే తప్పక చూడండి
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
మ్యూజిక్ కేసెట్ల వ్యాపారం చేసుకునే మూర్తి యాభై ఏళ్ళ వయసులో DJ నేర్చుకుని , పట్టుదలతో  హైదరాబాద్ వెళ్లి DJ ఆర్టిస్ట్ కావటం కధాంశం . ఈ క్రమంలో అంజనా అనే అమ్మాయి స్నేహితురాలు , గురువు కావటం బాగుంటుంది , కధను నడిపిస్తుంది . మంచి నటుడిగా మనందరికీ పరిచయమే . దిగువ మధ్య తరగతి కుటుంబీకుడిగా , దేనికయినా సర్దుకుపోయేవాడిగా , ఏ అవమానాన్ని అయినా భరించేవాడిగా , ఆశయాన్ని విడవని విక్రమార్కుడిగా subdued నటన చక్కగా ప్రదర్శించారు . 
అతని తర్వాత చాందినీ చౌదరి , ఆమని చాలా  బాగా నటించారు . అజయ్ ఘోష్ కుమార్తెలు , హైదరాబాదులో అతన్ని ఆదరించే మిత్రులుగా నటించినవారు , భానుచందర్ , అందరూ తమ తమ పాత్రలను బాగా పోషించారు . సినిమా లోని పాత్రలన్నీ మంచి పాత్రలే . సమాజంలో ఇంత మంది మంచివారు ఉన్నట్లు చూపిన కధా రచయితను , దర్శకుడు శివ పాలడుగుని మెచ్చుకోవాల్సిందే .సినిమాలో టివి ఇంటర్వ్యూ మనసుల్ని కదిలిస్తుంది . Really heart-touching . సంగీత దర్శకుడు పవన్ సంగీత దర్శకత్వంలో పాటలు , నేపధ్య సంగీతం బాగున్నాయి . స్లోగా ఉంటుంది . అయినా నాకు బాగా నచ్చింది . ప్రైంలో ఉంది . ఆమనిని చంపకుండా ఉంటే ఇంకా బాగుండేదేమో అని అనిపించింది . అప్పుడు feel good movie అని చెప్పేవాడినేమో . అయిననూ ఫీల్ గుడ్ సినిమా అని తీర్మానించవచ్చేమో .