హోం మంత్రి అనితతో దిలీప్ రాజా భేటీ

హోం మంత్రి అనితతో దిలీప్ రాజా భేట
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెనాలి, జూలై 3: రాష్ట్ర హోం శాఖ మంత్రి అనితతో సినీ దర్శకుడు,మా - ఏపి వ్యవస్థాపకులు దిలీప్ రాజా బుధవారం సెక్రెటేరియెట్ లో సమావేశమయ్యారు.స్టానిక విలేకరులకు సమావేశపు వివరాలను వెళ్ళడించారు.ఆగస్ట్ మాసంలో తెనాలిలో జరుగనున్న సినిమా సంబంధీత కార్యక్రమంపై హోం శాఖమంత్రి వంగలపూడి అనితతో ఆయన చర్చించినట్లు తెలిపారు.రాష్ట్ర సివిల్ సప్లైస్ శాఖమంత్రి నాదెండ్ల మనోహర్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లతో మాట్లాడిన అనంతరం ఏ రోజున కార్యక్రమం జరిగేది నిర్ణయిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈసినిమా కార్యక్రమానికి కొందరు శాసన సభ్యులను కూడా ఆహ్వానించినట్లు దిలీప్ రాజా చెప్పారు.హోం శాఖ మంత్రిని కలిసిన వారిలో నటుడు మిలటరీ ప్రసాద్, సహాయ దర్శకుడు వెంకీ రావన్ ఉన్నారు.