విజ్ఞాన్స్‌ విద్యార్థికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ విద్యార్థికి పీహెచ్‌డీ
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగంలోని ఈఈఈ  డిపార్ట్‌మెంట్‌కు చెందిన విద్యార్థి ముత్తుకూరి నరేంద్ర కుమార్‌కు తమ యూనివర్సిటీ పీహెచ్‌డీ పట్టా అందజేసిందని వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ శనివారం తెలిపారు. ఈయన ‘‘ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ప్రొపోర్షనల్‌ రీసోనంట్‌ క్రంటోల్డ్‌ సింగల్‌ ఫేస్‌ ఫిఫ్టీన్‌ లెవల్‌ ప్యాక్డ్‌ యూ సెల్‌ మల్టిలెవల్‌ ఇన్వర్టర్‌ పీవీ అప్లికేషన్స్‌’’ అనే అంశంపై పరిశోధన చేశారని తెలియజేసారు. ఈయనకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఈఈఈ డిపార్ట్‌మెంట్‌లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ మోపిదేవి సుబ్బరావు గైడ్‌గా వ్యవహరించారని పేర్కొన్నారు. ఈయన తన పరిశోధనలో భాగంగా మొత్తం  ఎస్‌సీఐ–1, స్కోపస్‌ జర్నల్స్‌–2, ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌లు 2 ప్రచురించారని వెల్లడించారు. పీహెచ్‌డీ పట్టాపొందిన ముత్తుకూరి నరేంద్ర కుమార్‌ను ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు.