Skip to main content

Posts

Showing posts from August, 2024

భారీ వర్షాల్లో బాధితులకు సాయం

భారీ వర్షాల్లో బాధితులకు సాయం బియ్యం పంపిణిచేస్తున్న రావూరి అంజలి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఎడతెరుపి లేకుండా భారీగా వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో శనివారం ట్రైబల్స్ ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు  రావూరి అంజలి కొలకలూరులోని నిరుపేద గిరిజనులకు బియ్యం పంపిణి చేశారు.రైల్వే స్టేషన్, కాలువకట్టలపైన నివసిస్తున్న ఆయా కుటుంబాలకు తాత్కాలిక వసతికోసం ప్లాస్టిక్ పట్టాలను అందించినట్లు ఆమె తెలియజేశారు.కాగా నందివెలుగు  కాలువకట్టపై నిర్వాసితులైన 12 కుటుంబాలకు ఆహారపొట్లాలను అందిoచామని అంజలి  పేర్కోన్నారు.కార్యక్రమoలో  ఇంటూరి విజయ భాస్కర్,రాయుడు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ – న్యూకాన్‌ ఏరోస్పేస్‌ల మధ్య అవగాహన ఒప్పందం

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ – న్యూకాన్‌ ఏరోస్పేస్‌ల మధ్య అవగాహన ఒప్పందం టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ – హైదరాబాద్‌లోని న్యూకాన్‌ ఏరోస్పేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ల(ఎన్‌ఏపీఎల్‌) మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని శనివారం యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్‌ఏపీఎల్‌ ఆర్‌ అండ్‌ డీ జనరల్‌ మేనేజర్‌ జేఎల్‌పీ తిలక్‌తో వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ అవగాహన ఒప్పందానికి సంబంధించిన పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ మాట్లాడుతూ ఈ అవగాహన ఒప్పందం వలన ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్, డిఫెన్స్‌ టెక్నాలజీలకు సంబంధించిన రంగాలలో ఉమ్మడిగా పరిశోధనలు చేయడంతో పాటు డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లను సులభతరం చేయవచ్చునన్నారు. ప్రస్తుతం పరిశ్రమలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం, వాటికి వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో ఉమ్మడిగా కృషి చేస్తామన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకుల్లో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడానికి ఉమ్మడి శ...

సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో చర్చల్లో పాల్గొన్న మా ఏపి నిర్వహకులు దిలీప్ రాజా

సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో చర్చలు జరుపుతున్న దిలీప్ రాజా,శ్రీనివాస్ యాదవ్ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడుతో ఏపీలో సినీపరిశ్రమ అభివృద్ధిపై సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సమీక్ష జరపడానికి అంగీకరించినట్లుగా 'మా - ఏపి' వ్యవస్థాపకులు, సినీ దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. ఈమేరకు అమరావతి సచివాలయంలో దిలీప్ రాజ తో పాటు మరో దర్శకుడు అచ్చన  శ్రీనివాస్ యాదవ్ తో  సినిమాటోగ్రఫీ మంత్రితో  చర్చలు జరిపినట్లుగా దిలీప్ రాజ చెప్పారు. బుధవారం  తెనాలిలో విలేకరులకు చర్చల వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో ఉచితంగా లోకేషన్లు ఇచ్చేందుకు ప్రస్తుత ప్రభుత్వం సుముఖంగా ఉందని ఆయన పేర్కొన్నారు.రాష్ట్రంలో స్టూడియోల నిర్మాణo,సినీ కార్మికులకు ఇండ్ల స్థలాలు,ఆంధ్రలో సినిమాలు నిర్మించే నిర్మాణ సంస్థలకు సబ్సిడి పెంపుదల తదితర ప్రధాన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి సినిమాటోగ్రఫీ మంత్రి  సమీక్ష జరుగుతోందన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధిపై  సినీ ప్రముఖులతో జరిగే తదుపరి సమావేశానికి మా-ఏపి ని ఆహ్వానిస్తామనిమంత్రిహమీఇచ్చినట్లుచెప్పారు.సినిమాటోగ్రఫీ మం...

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకురాలికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకురాలికి పీహెచ్‌డీ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ బయోటెక్, ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ విభాగంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీకు చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అన్నం నాగలక్ష్మికు తమ యూనివర్సిటీ పీహెచ్‌డీ పట్టాను అందజేసిందని వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘స్క్రీనింగ్‌ అండ్‌ ఎవాల్యూషన్‌ ఆఫ్‌ బయోయాక్టివ్‌ మెటబోలైట్స్‌ ఫ్రమ్‌ కుర్కుమ లోంగ అండ్‌ టినోస్పోర కార్డిఫోలియో అగెనెస్ట్‌ పల్మనరీ ఫిబ్రోసిస్‌ ఇన్‌ మైస్‌’’ అనే అంశంపై ఆమె పరిశోధన చేశారని తెలియజేశారు. ఈమెకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.కృపానిధి గైడ్‌గా వ్యవహరించారని పేర్కొన్నారు. డాక్టరేట్‌ పట్టా పొందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అన్నం నాగలక్ష్మిను వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు.

మానవత స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు అభినందనీయం

మానవత స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు అభినందనీయం టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:  మానవత స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తున్న సేవలు వెలకట్టలేనివని తహశీల్దార్ కెవి గోపాలకృష్ణ అన్నారు. సంస్థ సమావేశం ఆదివారం ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల లైబ్రరీలో జరిగింది. సంస్థ రీజినల్ ఛైర్మన్, ప్రముఖ మానవత వాది, పారిశ్రామికవేత్త కొత్త సుబ్రహ్మణ్యం తహశీల్దార్ కెవి గోపాలకృష్ణను సత్కరించారు. కార్యక్రమంలో అమృత సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రటరీ అండ్ కరెస్పాండంట్ కె. రామ్మోహనరావు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. సన్మాన గ్రహీత గోపాలకృష్ణ మాట్లాడుతూ మేధావులు, విద్యావంతులు, వ్యాపారవేత్తలు సామాజిక దృక్పథంతో ఒక సంస్థను ఏర్పాటు చేసి తద్వారా సమాజంలో అట్టడుగు వర్గాలకు సేవలందించడం అభినందనీయమన్నారు.ఇలాంటి సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని, వీలైతే తనను కూడా సేవా కార్యక్రమాలలో భాగస్వామిని చేయాలని సంస్థను కోరారు. సంస్థ తరఫున సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తామని రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం వెల్లడించారు. అధ్యక్షత వహించిన సంస్థ తెనాలి చైర్మన్ డాక్టర్ కొలసాని రాంచంద్ సంస్థ కార...

సూపర్ సెవెన్ గా సినిమా పరిశ్రమను చేయండి

సూపర్  సెవెన్ గా సినిమా పరిశ్రమను చేయండి - ' మా- ఏపి ' దిలీప్ రాజా  సమావేశం లోమాట్లాడుతున్న దిలీప్ రాజా టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తెనాలి ఆగస్టు 24: ముఖ్యమంత్రి ప్రకటించిన సూపర్ సిక్స్ కు అదనంగా సినిమా పరిశ్రమ అభివృద్ధిని చేర్చవలసిందిగా' మా - ఏపి' వ్యవస్థాపకులు, సినీ దర్శకుడు దిలీప్ రాజా కొరారు.స్థానిక మూవీ ఆర్టిస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల యూనియన్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతు త్వరలో జరగనున్న కేబినెట్ సమావేశంలో ఆంధ్రాలో సినీ పరిశ్రమ అభివృద్ధి పై ఎలాంటి చర్యలను ప్రభుత్వం  అమలు చేస్తుందో మంత్రివర్గ సమావేశంలో చర్చిoచవలసిందిగా ఆయన సీఎం చంద్రబాబుకు మనవి చేశారు. హైదరాబాద్, తిరుపతి విశాఖపట్నం పట్టణాలకు అనుకూలoగా అమరావతిలో సకల సదుపాయాలతో అవసర మైన ఫ్లోర్ లతో స్టూడియోను ప్రభుత్వం ఈ నిర్మిస్తే ప్రభుత్వానికి రెవిన్యూ వస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తo చేశారు.స్టూడియోల నిర్మాణాలకు ముందుకొచ్చిన వ్యాపారవేత్తలకు ప్రభుత్వం స్థలాలను కేటాయించవలసిందిగా ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రాలో నివాసం ఉండేందుకు ఇష్టపడుతున్న సినీ కార్...

ప్రపంచం మీ కోసం ఎదురుచూస్తోంది

ప్రపంచం మీ కోసం ఎదురుచూస్తోంది   - సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ పమిడిఘంటం శ్రీ నరసింహ   - వేడుకగా విజ్ఞాన్స్‌ వర్సిటీ 12వ స్నాతకోత్సవం   -1539 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం    - 60 మంది విద్యార్థులకు బంగారు పతకాలు    - ముగ్గురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్‌లు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: హైదరాబాద్‌లోని ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్‌ ఫౌండర్‌ అండ్‌ చైర్మన్‌ దొంతినేని శేషగిరి రావు, హైదరాబాద్‌లోని లోకేష్‌ మెషీన్స్‌ ఫౌండర్‌ ముల్లపూడి లోకేశ్వర రావు, ఇండియన్‌ కంపోజర్‌ అండ్‌ సింగర్‌ సాలూరి కోటేశ్వర రావు (కోటి)లకు గౌరవ డాక్టరేట్‌లు   చిరస్మరణీయ వేదిక   :  హైదరాబాద్‌లోని లోకేష్‌ మెషీన్స్‌ ఫౌండర్‌ ముల్లపూడి లోకేశ్వర రావు ఎదిగిన మార్గాన్ని మర్చిపోవద్దు : విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య   ప్రపంచంపై మీ ముద్రను వేయండి   : విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రపంచం విభిన్న నైపుణ్యాలు కలిగిన విద్యార్థుల కోసం ఎదురుచూస్తోందని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌...

నెహ్రూనికేతన్ శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

నెహ్రూనికేతన్ శ్రీ కృష్ణాష్టమి వేడుకలు   టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: శ్రీ కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ముందస్తు వేడుకలను స్థానిక బోడ్డులోని నెహ్రూనికేతన్ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో శనివారం ఉదయం ఘనంగా జరిపారు. పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి పర్యవేక్షణలో నర్సరీ నుండి మొదటి తరగతికి చెందిన బాలురు కృష్ణుని వేషధారణలోను, చిన్నారి బాలికలు గోపికలు, రాధ వేషధారణలో అభినయిస్తూ అందరి ప్రశంసలందుకున్నారు. ముచ్చటగోలిపే చిన్నారుల ముద్దులొలికే పనులతో అందరూ అలౌకిక ఆనందాన్ని పొందారు. చిన్నారులు ఉట్టికొట్టే కార్యక్రమాన్ని చాలా ఉత్సాహంగా నిర్వహించారు. గోపికల వేషధారణ చేసిన చిన్నారులు ఉట్టిని లాగుతుండగా, కృష్ణుని వేషధారణలో ఉన్న చిన్నారులు ఎగిరి దాన్ని పగులగొట్టే ఘట్టం కనువిందు చేసింది. పలు పాటలకు చిన్నారులు చేసిన సంప్రదాయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కొందరు చిన్నారులు శ్రీకృష్ణుడి భక్తి పాటలకు ప్రత్యేక నృత్యాలు చేశారు. శ్రీకృష్ణ వేషధారణలో చిన్నారులు పిల్లనగ్రోవితోను, గోపికలు వెన్నకుండలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్య...

విజ్ఞాన్స్‌ వర్సిటీకు ప్రతిష్టాత్మక అబెట్‌ అక్రిడిటేషన్‌

విజ్ఞాన్స్‌ వర్సిటీకు ప్రతిష్టాత్మక అబెట్‌ అక్రిడిటేషన్‌   టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు ప్రతిష్టాత్మక యూఎస్‌ఏ బేస్డ్‌ అబెట్‌ (అక్రిడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ) అక్రిడిటేషన్‌ లభించిందని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలో కేవలం 12 యూనివర్సిటీలకు మాత్రమే అబెడ్‌ అక్రిడిటేషన్‌ ఉందని, అందులో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ కూడా ఒకటని తెలియజేసారు. రెండు తెలుగు రాష్ట్ర్రాలలో అబెట్‌ అక్రిడిటేషన్‌ను సాధించిన  మొట్ట మొదటి యూనివర్సిటీగా విజ్ఞాన్‌ నిలిచిందన్నారు. యూనివర్సిటీలోని 5 బ్రాంచ్‌లకు (సీఎస్‌ఈ, ఈఈఈ, ఈసీఈ, మెకానికల్, బయోటెక్నాలజీ) అబెట్‌ అక్రిడిటేషన్‌ 6 సంవత్సరాల పాటు లభించిందని వెల్లడించారు. అమెరికా నుంచి వచ్చిన 10 మంది సభ్యులతో కూడిన తనిఖీ బృందం యూనివర్సిటీలో మూడు రోజుల పాటు తనిఖీ నిర్వహించి అక్రిడిటేషన్‌ను అందించిందన్నారు.  అబెట్‌ అక్రిడిటేషన్‌ వలన∙విదేశాలలో ఉన్నత విద్యతో పాటు ఉపాధి అవకాశాలు బాగా ...

ఎంత పని చేశావ్ చంటి ప్రచారచిత్రం ఆవిష్కరణ

- "ఎంత పని చేశావ్ చంటి" ప్రచారచిత్రం ఆవిష్కరించిన "ధమాకా" దర్శకుడు త్రినాథరావు నక్కిన - "ఈ చిత్రం ఆడవాళ్లకు మాత్రమే మగవారు పొరపాటున కూడా చూడొద్దు" అంటున్న చిత్ర దర్శకుడు ఉదయ్ కుమార్ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: పి.జె.కె.మూవీ క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్-1గా తెరకెక్కిన విభిన్న కథాచిత్రం "ఎంత పని చేశావ్ చంటి". "తస్మాత్ జాగ్రత్త" చిత్రంతో దర్శకుడిగా పరిచయమై, తన ప్రతిభను ప్రకటించుకున్న యువ ప్రతిభాశాలి ఉదయ్ కుమార్ దర్శకత్వంలో "లడ్డే బ్రదర్స్" నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ నేపథ్యంలో "ఎంత పని చేశావ్ చంటి" ట్రైలర్ రిలీజ్ వేడుక హైదరాబాద్, నిర్మాతల మండలి హాల్ లో ఘనంగా జరిగింది. సంచలన దర్శకులు త్రినాథరావు నక్కిన ముఖ్య అతిధిగా విచ్చేసి, ట్రైలర్ రిలీజ్ చేసి, వైజాగ్ కు చెందిన కళాకారులు, సాంకేతిక నిపుణులు రూపొందించిన ఈ చిత్రం ఘన విజయం సాధించి, మరింతమందికి స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలో చిత్ర కథానాయకుడు శ్రీనివా...

"నేను-కీర్తన" ట్రైలర్ కుఅనూహ్య స్పందన!!

"నేను-కీర్తన" ట్రైలర్ కు అనూహ్య స్పందన!! - ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చిమటా రమేష్ బాబు హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన "నేను కీర్తన" ప్రచారచిత్రానికి సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. ఎమ్.ఎల్.రాజా ఈ చిత్రానికి సంగీత సారధి. చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా రమేష్ బాబు ("సి.హెచ్.ఆర్")ను దర్శకుడిగా పరిచయం చేస్తూ... చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) - రిషిత - మేఘన హీరోహీరోయిన్లుగా... చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ) సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మించిన "నేను-కీర్తన" అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. మల్టీ జోనర్ ఫిల్మ్ గా తెరకెక్కి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న "నేను కీర్తన" చిత్రానికి బిజినెస్ పరంగానూ మంచి క్రేజ్ ఏర్పడింది. కులుమనాలిలో చిత్రీకరించిన పాటలతోపాటు... ఆరు రోప్ ఫైట్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని చిత్రబృందం చెబుతోంది!! రేణు ప్రియ, సంధ్య, జీవా, విజయరంగ రాజు, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ సన్నీ, రాజ్ కుమార్, మంజునాథ్ ఇతర ముఖ్య...

24న విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ 12వ స్నాతకోత్సవం

24న విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ 12వ స్నాతకోత్సవం   - ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ పమిడిఘంటం శ్రీ నరసింహ   గౌరవ అతిథులుగా హైదరాబాద్‌లోని ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్‌ ఫౌండర్‌ అండ్‌ చైర్మన్‌ దొంతినేని శేషగిరి రావు, హైదరాబాద్‌లోని లోకేష్‌ మెషీన్స్‌ ఫౌండర్‌ ముల్లపూడి లోకేశ్వర రావు, ఇండియన్‌ కంపోజర్‌ అండ్‌ సింగర్‌ సాలూరి కోటేశ్వర రావు (కోటి) ముగ్గురికి గౌరవ డాక్టరేట్లు ప్రధానం  1526 మందికి పైగా విద్యార్థులకు డిగ్రీలు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఆగస్టు 24వ తేదీ శనివారం విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ 12వ స్నాతకోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌  శనివారం తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌  మాట్లాడుతూ 24న  జరిగే 12వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా  సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ పమిడిఘంటం శ్రీ నరసింహ , గౌరవ అతిథులుగా  హైదరాబాద్‌లోని ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్‌ ఫౌండర్‌ అండ్‌ చైర్మన్‌ దొంతినేని శేషగిరి రావు, హైదరా...

టాలెంట్ ఎవరి సొత్తూ కాదు..అవకాశం వదలొద్దు

టాలెంట్ ఎవరి సొత్తూ కాదు.. అవకాశం వదలొద్దు   - సోషల్ మీడియా మీ హద్దు!! -థ్రిల్ సిటీ సోషల్ మీడియా  ఇన్ఫ్లుయన్సర్స్ ఛాలెంజ్  కర్టెన్ రైజర్ ఈవెంట్'లో *మాస్ కా దాస్ విశ్వక్సేన్* -సృజనాత్మకతను చాటండి  లక్షల ప్రైజ్ మనీ గెలవండి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: హైద్రాబాద్ కు తలమానికంగా భాసిల్లుతున్న "థ్రిల్ సిటీ - అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్"... సోషల్ మీడియా ప్రభావాశీలుర సృజనాత్మకతకు సవాలు విసిరింది. అసాధారణమైన, అద్భుతమైన అనేక విశేషాల సమాహారంగా ఇంటిల్లిపాదినీ అలరిస్తున్న "థ్రిల్ సిటీ - థీమ్  పార్క్"లోని ఫన్ గేమ్స్, అడ్వెంచర్ గేమ్స్, హార్రర్ మేజ్, 12D థియేటర్ లాంటి వందలాది యాక్టివిటీస్'ని బేస్ చేసుకుని షూట్ చేసిన వీడియో రీల్ ను  చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోల నుంచి అత్యుత్తమమైన వీడియో రీల్స్ మూడింటిని ఎంపిక చేసి, తలా లక్ష రూపాయల చొప్పున మూడు లక్షల నగదు బహుమతులను అందించే బృహత్ కార్యక్రమానికి తెర తీసింది. యంగ్ టాలెంట్ ను కూడా యంకరేజ్ చేసే "థ్రిల్లింగ్ ఇన్ఫ్లేన్సర్  చాలెంజ్" ఈవెంట్ కర్టెన్ రైజర్ వేడుకకు ముఖ్య అతిధిగా టాలీవుడ్ యువ సంచలనం విశ్వక్స...

గ్రాఫిక్స్ - విజువల్ ఎఫెక్ట్స్ వల్లబడ్జెట్ పెరగదు - తగ్గుతుంది

గ్రాఫిక్స్ - విజువల్ ఎఫెక్ట్స్ వల్ల బడ్జెట్ పెరగదు - తగ్గుతుంది "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్"తో అద్భుతాలు అలవోకగా ఆవిష్కరించవచ్చు!! "గీతాంజలి-2"కి గ్రాఫిక్స్ అద్దే అవకాశం ఇచ్చిన కోన వెంకట్ సార్'కి ఎప్పటికీ రుణపడి ఉంటాను!! -గ్రాఫిక్ & విజువల్ ఎఫెక్ట్స్ జీనియస్ *ఉదయ్ తిరుచినాపల్లి* టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ అనగానే... అవి పెద్ద సినిమాలకు మాత్రమే అనుకుంటారు. కానీ అది కేవలం అపోహ మాత్రమే" అంటున్నాడు గ్రాఫిక్స్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ జీనియస్ ఉదయ్ తిరుచినాపల్లి.  అంతేకాదు... గ్రాఫిక్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ వల్ల చిన్న సినిమాలు మాత్రమే కాకుండా, పెద్ద సినిమాల బడ్జెట్ ను కూడా గణనీయంగా తగ్గించవచ్చని, ఇక ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్"తో అలవోకగా అద్భుతాలు ఆవిష్కరించవచ్చని ఘంటాపధంగా చెబుతున్నాడు!! కంప్యూటర్ ఇంజినీరింగ్ లో పట్టభద్రుడైన ఉదయ్ తిరుచినాపల్లి... అమెరికా, ఆస్ట్రేలియాలో మల్టీ నేషనల్ సంస్థల్లో ఉన్నతోద్యోగాలు చేశాడు. అయితే చిన్నప్పటి నుంచి "సినిమా పిచ్చోడైన" ఉద...

కళలకాణాచితెనాలి నూతన కార్యవర్గం ఎంపిక

కళలకాణాచి-తెనాలి నూతన కార్యవర్గం ఎంపిక టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: పట్టణానికి చెందిన కళలకాణాచి-తెనాలి సర్వసభ్య సమావేశం గురువారం ఉదయం బుర్రిపాలెం రోడ్డు బి.సి. కాలనీలోని పట్టణ రంగస్థల కళాకారుల భవనంలో జరిగింది. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2019లో స్థాపించిన కళలకాణాచి సంస్థ కార్యవర్గ గడువు 2024 ఆగస్టులో ముగియడం వలన నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గ గౌరవ అధ్యక్షుడిగా ప్రవాసభారతీయుడు డాక్టర్ బాబు ఆర్ వడ్లమూడి, అధ్యక్షుడిగా సినీ మాటల రచయిత డాక్టర్ సాయి మాధవ్ బుర్రా, ఉపాధ్యక్షుడిగా చెరుకుమల్లి సింగారావు, ప్రధాన కార్యదర్శిగా సినీ, టి.వి., రంగస్థల నటుడు గోపరాజు విజయ్, సహాయ కార్యదర్శులుగా అయినాల మల్లేశ్వరరావు, కొండముది రమేష్, కత్తి సౌజన్య, కోశాధికారిగా దేవరపల్లి భవాని, కార్యవర్గ సభ్యులుగా గోళ్ళ సుబ్రహ్మణ్యం, వెంకటలక్ష్మి, బడుగుమోహనరావు, అలపర్తి వెంకటేశ్వరరావు, వెనిగళ్ళ నారాయణ ప్రసాద్, గోగినేని సుధీర్ బాబు, లుక్కా సోమేష్, పాశం వెంకటేష్, మద్దినేని కిరణ్, తరిణి హేమంత్ కుమార్,  రాధా శ్రీరామ్, ప్రింటీమీడియా ఇన్చార్జి ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ...

విజ్ఞాన్‌లో ఘనంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

-మార్పు విద్యార్థులతోనే సాధ్యం  -విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌      పీ.నాగభూషణ్‌  -విజ్ఞాన్‌లో ఘనంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు   టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: దేశం అభివృద్ధి చెందాలన్నా, సమాజంలో మార్పు మొదలవ్వాలన్నా విద్యార్థులతోనే సాధ్యమని విజ్ఞాన్స్‌ వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ, విజ్ఞాన్‌ లారా, ఫార్మసీ, జూనియర్‌ కళాశాలలో ఆధ్వర్యంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పంద్రాగస్టు వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మాట్లాడుతూ దేశం ఎంత ప్రగతి సాధించినా... ఇంకా చేయాల్సింది, ప్రయాణించాల్సింది మిగిలే ఉంటుందన్నారు. విద్యార్థుల్లో ఎంత సృజనాత్మకత ఉంటే దేశం అంత వృద్ధిలోకి వస్తుందన్నారు. వచ్చే 10 నుంచి 20 ఏళ్లలో భారతదేశం ప్రపంచ దేశాలలో అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందన్నారు. గతాన్ని వ...

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీతో కేంబ్రిడ్జి అవగాహన ఒప్పందం

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీతో కేంబ్రిడ్జి అవగాహన ఒప్పందం టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఇంగ్లాండ్‌లోని ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జి యూనివర్సిటీలోని ఇంగ్లీష్‌ అసెస్‌మెంట్‌ విభాగం వారు  చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీతో లింగ్వాస్కిల్‌ సర్టిఫికేషన్‌ ఇన్‌ ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌లో అవగాహన ఒప్పందాన్ని (ఎంఓయూ) చేసుకున్నారని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంఓయూకు సంబంధిన అవగాహన పత్రాలను కేంబ్రిడ్జి యూనివర్సిటీ సౌత్‌ ఏసియా రీజనల్‌ డైరక్టర్‌ అరుణాచలం, సౌత్‌ ఇండియా డీజీఎం కార్తి సుబ్రమణియన్‌కు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ అందించారు. ఈ సందర్భంగా వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మాట్లాడుతూ కేంబ్రిడ్జి యూనివర్సిటీ వారు లింగ్వాస్కిల్‌ సర్టిఫికేషన్‌ ఇన్‌ ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ను ప్రపంచ వ్యాప్తంగా మొట్టమొదటగా తమ యూనివర్సిటీలోనే ప్రయోగాత్మకంగా ప్రవేశ పెడుతున్నారని తెలియజేసారు. అంతేకాకుండా విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో కేంబ్రిడ్జి సెంటర్‌ను, సెంటర్‌...

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌లో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు 72వ ర్యాంకు

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌లో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు 72వ ర్యాంకు టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ( ఎంహెచ్‌ఆర్‌డీ) సోమవారం విడుదల చేసిన 2024వ సంవత్సరం ఉన్నతస్థాయి విద్యాసంస్థల ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ (నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌) ర్యాంకులలో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు జాతీయస్థాయిలో 72వ ర్యాంకు లభించిందని యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ  దేశ వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు 72వ ర్యాంకు లభించిందన్నారు. అదే విధంగా ఇంజినీరింగ్‌ విభాగంలో కూడా 91వ ర్యాంకు సాధించినట్లు తెలియజేసారు. టీచింగ్‌ లెర్నింగ్‌ రిసోర్సెస్, రీసెర్చ్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ ప్రాక్టీస్, గ్రాడ్యుయేషన్‌ ఔట్‌కమ్స్, ఔట్‌రీచ్‌ అండ్‌ ఇంక్లూజివిటీ, పీఆర్‌ పర్‌సెప్షన్‌ కేటగిరీల్లో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ పనితీరును కేంద్రం పరిశీలించి 100 పాయింట్ల స్కోర్‌ ప్రామాణికంగా ఈ ర్యాంకులను కేటాయించిందన్నారు. విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకు లభించడం వల్ల కేంద్ర, రాష...

మరుగున పడిన మేధావుల్లో ఒకరు మోదుకూరి జాన్సన్

మరుగున  పడిన  మేధావుల్లో ఒకరు - మోదుకూరి జాన్సన్‌ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: జాన్సన్ పేరు వినగానే మానవుడు - దానవుడు, కరుణామయుడు, దేవాలయం, నేటి భారతం సినిమాలు గుర్తుకు వస్తాయి. నాటక ప్రపంచంలో 'నటనాలయం' పేరు తలిస్తే జాన్సన్‌ గుర్తుకు వస్తాడు.పాడిపంటలు సినిమాలో 'మన జన్మ భూమి బంగారు భూమి' పాటను శ్రీశ్రీ రాశారా అనుకునేంత గొప్పగా రాశాడు జాన్సన్‌. దళిత రచయితలకు సినిమా రంగంలో అవకాశాలు రావటం, నిలదొక్కుకోవటం, రాణించటం అంత సులభమైన పనికాదు. ప్రముఖ నాటక రచయిత పాటిబండ్ల ఆనందరావు సైతం సినిమా రచయితగా ప్రయత్నం చేసి అక్కడ ఇమడలేక తిరిగి వచ్చి నాటకాన్నే నమ్ముకున్న పరిస్థితి. ఒక 'జాలాది' మాత్రం ప్రత్యేకమైన పల్లె పదాలతో తనదైన ఒక బాణీలో పాటలు రాసి నిలదొక్కుకున్నాడు. మోదుకూరి జాన్సన్‌ ఏనాడూ సినీ పరిశ్రమకు వెళ్ళాలని ప్రయత్నం చెయ్యలేదు. సినీ పరిశ్రమే ఆయన ప్రతిభను గుర్తించింది. 'నటనాలయం' నాటకాన్ని తెనాలి దగ్గర ఒక పల్లెటూర్లో ప్రముఖ సినీ నటుడు గుమ్మడి చూశారు. గుమ్మడికి అందులోని సన్నివేశాలు, విషయాన్ని కొత్త కోణంలో చెప్పిన విధానం నచ్చింది. అదే కాలంలో అక్కినేని నాగేశ్వరర...

నెహ్రూనికేతన్లో ప్రపంచ అబాకస్ దినోత్సవం

నెహ్రూనికేతన్లో ప్రపంచ అబాకస్ దినోత్సవం టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తెనాలి: 08-08-2023: ప్రపంచ అబాకస్ దినోత్సవాన్ని (వేగ గణిత దినోత్సవం) స్థానిక బోస్రోడ్డులోని నెహ్రూనికేతన్ పాఠశాలలో మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి పర్యవేక్షణలో గురువారం ఘనంగా జరిపారు. బాలబాలికలు అబాకస్ పద్ధతిలో కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం వంటి లెక్కలను క్షణాలలో చేసి చూపించారు. ఈ సందర్భంగా నెహ్రూనికేతన్ ఎం.డి. మురళీకాంత్ వి దాసరి మాట్లాడుతూ హైదరాబాద్కు చెందిన విశ్వ ఎడ్యుటెక్ సంస్థ పర్యవేక్షణలో తమ పాఠశాలలో గత ఎనిమిది సంవత్సరాల నుండి అబాకస్ ప్రక్రియ ద్వారా కూడా బాలబాలికలకు గణితం నేర్పించే విధానం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, ఉపాధ్యాయలు పాల్గొన్నారు.

సినిమా చెట్టు ఇక లేదు అనే వార్త నిజంగా బాధాకరం..!

  టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడిన ఒక అద్భుతం మనిషి జీవితంలోనే కాదు సినిమాలో కూడా ప్రకృతి ఒక భాగం, ప్రకృతిలోని అందాలను తమ కెమెరా కళ్ళతో ప్రేక్షకులకు చూపిస్తారు దర్శకులు.తొలి తెలుగు టాకీ చిత్రం భక్త ప్రహ్లాద 1932 లో వచ్చింది, ఆ తరువాత ఎన్నో బ్లాక్ అండ్ వైట్ సినిమాల పరంపర కొనసాగింది, అయితే అప్పట్లో సినిమాలన్నీ దాదాపు స్టూడియోల్లోనే చిత్రీకరించేవారు, ఒకవేళ కొండలు పొలాలు పార్కులు లాంటి ప్రదేశాలు అవసరం అయితే తెర కట్టి ఆ తెరమీద పెయింటింగ్ తో పొలాలు కొండలు వేసి షూటింగ్ చేసేవారు, తరువాతి రోజుల్లో సెట్ చేసేవారు. ఔట్ డోర్ షూటింగ్ లో చాలా తక్కువగా చిత్రీకరణ జరిపేవారు, అయితే 70 లో నుంచీ పరిస్థితి మారింది, ఊటీ కొడైకెనాల్ లాంటి పర్యాటక ప్రదేశాలే కాకుండా, విదేశాల్లో కూడా షూటింగ్ జరిపుకున్న చిత్రాలు అనేకం... అయితే ఎన్ని ప్రదేశాలు ఉన్నా గోదావరి ఒడ్డున ఉన్న కుమారదేవం చెట్టు మాత్రం చాలా ప్రత్యేకం, ఇక్కడ షూటింగ్ జరుపుకున్న సినిమాలు దాదాపు అన్నీ పెద్ద హిట్లే, 150 ఏళ్ళ జీవితకాలంలో 300 సినిమాల్లో కనిపించింది ఈ చెట్టు.కుమారదేవం సినిమా చెట్టు ఇకనుంచి ఒక చరిత్ర... పోటెత్త...

10 లక్షల ఇంటి భోజనాలని సరఫరా చేసిన షీరో హోమ్ ఫుడ్

10 లక్షల ఇంటి భోజనాలని సరఫరా చేసిన షీరో హోమ్ ఫుడ్   - మహిళల స్వయం ఉపాధికి తోడ్పడుతున్న షీరో  టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: హీరో లాగా షీరో తన కాళ్లపై తాను నిలబడి తనకు తెలిసిన వంట నైపుణ్యానికి సంస్థ అందించే మెళకువలను జోడించి ఇంటి భోజనాన్ని తయారు చేస్తూ ఆన్ లైన్ ద్వారా ఆర్డర్స్ పొందుతూ ప్రతినెలా మహిళలు తమ ఇంటినుండే స్థిరమైన ఆదాయాన్ని పొందేలా విశిష్ట అవకాశాన్ని కల్పిస్తున్న సంస్థ షీరో హోమ్ ఫుడ్. ఒక్క కిచెన్ తో ప్రారంభమైన షీరో నేడు దక్షిణ భారత దేశంలో 2000 లు పైబడి కిచెన్స్ తో ఓ అతిపెద్ద మహిళా సాధికారికతా సంస్థగా ఆవిర్భవించింది. నాలుగో సంవత్సరంలో అడుగిడిన ఈ సంస్థ విజయోత్సవంలో మరో మైలురాయిని చేరుకుంది.ఇప్పటికి 10 లక్షల మందికి రుచికరమైన సుచికరమైన శాఖాహార భోజన పదార్థాలని డెలివరీ చేసి సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. తిలక్ వెంకటస్వామి , జయశ్రీ తిలక్ లు ప్రారంభించిన ఈ సంస్థ తెలుగు రాష్ట్రాల మాస్టర్ ఫ్రాంచైజ్ తీసుకున్న సువర్ణా దేవి పాకలపాటి మాట్లాడుతూ : వ్యాపారం చేయడం వేరు, పది మందికి ఉపయోగపడే వ్యాపారం చేయడం వేరు, అందులోను మహిళగా సాటి...