24న విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ 12వ స్నాతకోత్సవం

24న విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ 12వ స్నాతకోత్సవం

  - ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ పమిడిఘంటం శ్రీ నరసింహ
  గౌరవ అతిథులుగా హైదరాబాద్‌లోని ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్‌ ఫౌండర్‌ అండ్‌ చైర్మన్‌ దొంతినేని శేషగిరి రావు, హైదరాబాద్‌లోని లోకేష్‌ మెషీన్స్‌ ఫౌండర్‌ ముల్లపూడి లోకేశ్వర రావు, ఇండియన్‌ కంపోజర్‌ అండ్‌ సింగర్‌ సాలూరి కోటేశ్వర రావు (కోటి)
ముగ్గురికి గౌరవ డాక్టరేట్లు ప్రధానం
 1526 మందికి పైగా విద్యార్థులకు డిగ్రీలు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ఆగస్టు 24వ తేదీ శనివారం విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ 12వ స్నాతకోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌  శనివారం తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌  మాట్లాడుతూ 24న  జరిగే 12వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా  సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ పమిడిఘంటం శ్రీ నరసింహ , గౌరవ అతిథులుగా  హైదరాబాద్‌లోని ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్‌ ఫౌండర్‌ అండ్‌ చైర్మన్‌ దొంతినేని శేషగిరి రావు, హైదరాబాద్‌లోని లోకేష్‌ మెషీన్స్‌ ఫౌండర్‌ ముల్లపూడి లోకేశ్వర రావు, ఇండియన్‌ కంపోజర్‌ అండ్‌ సింగర్‌ సాలూరి కోటేశ్వర రావు (కోటి)  హాజరవుతున్నారని పేర్కొన్నారు.
1526 మందికి పైగా డిగ్రీలు అందజేత
12వ స్నాతకోత్సవం సందర్భంగా తమ యూనివర్సిటీ 1526 మందికి పైగా విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయనుందని వైస్‌ చాన్స్‌లర్‌ తెలిపారు. 12వ స్నాతకోత్సవం సందర్భంగా 26 మంది విద్యార్థులకు బ్రాంచ్‌ల వారీగా అత్యుత్తమ ప్రతిభ చూపిన వారికి బంగారు పతకాలు అందజేస్తామన్నారు. వీటితో పాటు బెస్ట్‌ అవుట్‌ గోయింగ్‌ స్టూడెంట్‌ మెడల్, ఎండోమెంట్‌ అవార్డులు, బహుముఖ ప్రతిభ కనబరిచిన విద్యార్థికి చైర్మన్‌ బంగారు పతకం, బెస్ట్‌ ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ, సోషల్‌ ఎంగేజ్‌మెంట్‌ అవార్డు, బెస్ట్‌ లీడర్‌ మెడల్స్‌ ఉంటాయన్నారు. వివిధ విభాగాలలో అద్భుత ప్రతిభ చూపిన విద్యార్థులకు కూడా ప్రత్యేక బహుమతులు ఇస్తున్నట్లు తెలిపారు.
ముగ్గురికి గౌరవ డాక్టరేట్లు 
12 స్నాతకోత్సవాన్ని పురస్కరించుకుని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వివిధ రంగాలలో వారు అందించిన సేవలు, కృషికు గాను ముగ్గురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్‌లను ప్రధానం చేయనుందని తెలిపారు.  హైదరాబాద్‌లోని ఎస్‌ఈసీ ఇండస్ట్రీస్‌ ఫౌండర్‌ అండ్‌ చైర్మన్‌ దొంతినేని శేషగిరి రావు, హైదరాబాద్‌లోని లోకేష్‌ మెషీన్స్‌ ఫౌండర్‌ ముల్లపూడి లోకేశ్వర రావు, ఇండియన్‌ కంపోజర్‌ అండ్‌ సింగర్‌ సాలూరి కోటేశ్వర రావు (కోటి)లు గౌరవ డాక్టరేట్‌లు అందుకోనున్నారు. 24 న జరిగే స్నాతకోత్సవ కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్, చాన్స్‌లర్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సభ్యులు, అకడమిక్‌ కౌన్సిల్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొంటారని పేర్కొన్నారు.