Skip to main content

సినిమా చెట్టు ఇక లేదు అనే వార్త నిజంగా బాధాకరం..!

 
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడిన ఒక అద్భుతం
మనిషి జీవితంలోనే కాదు సినిమాలో కూడా ప్రకృతి ఒక భాగం, ప్రకృతిలోని అందాలను తమ కెమెరా కళ్ళతో ప్రేక్షకులకు చూపిస్తారు దర్శకులు.తొలి తెలుగు టాకీ చిత్రం భక్త ప్రహ్లాద 1932 లో వచ్చింది, ఆ తరువాత ఎన్నో బ్లాక్ అండ్ వైట్ సినిమాల పరంపర కొనసాగింది, అయితే అప్పట్లో సినిమాలన్నీ దాదాపు స్టూడియోల్లోనే చిత్రీకరించేవారు, ఒకవేళ కొండలు పొలాలు పార్కులు లాంటి ప్రదేశాలు అవసరం అయితే తెర కట్టి ఆ తెరమీద పెయింటింగ్ తో పొలాలు కొండలు వేసి షూటింగ్ చేసేవారు, తరువాతి రోజుల్లో సెట్ చేసేవారు.
ఔట్ డోర్ షూటింగ్ లో చాలా తక్కువగా చిత్రీకరణ జరిపేవారు, అయితే 70 లో నుంచీ పరిస్థితి మారింది, ఊటీ కొడైకెనాల్ లాంటి పర్యాటక ప్రదేశాలే కాకుండా, విదేశాల్లో కూడా షూటింగ్ జరిపుకున్న చిత్రాలు అనేకం...
అయితే ఎన్ని ప్రదేశాలు ఉన్నా గోదావరి ఒడ్డున ఉన్న కుమారదేవం చెట్టు మాత్రం చాలా ప్రత్యేకం, ఇక్కడ షూటింగ్ జరుపుకున్న సినిమాలు దాదాపు అన్నీ పెద్ద హిట్లే, 150 ఏళ్ళ జీవితకాలంలో 300 సినిమాల్లో కనిపించింది ఈ చెట్టు.కుమారదేవం సినిమా చెట్టు ఇకనుంచి ఒక చరిత్ర... పోటెత్తిన గోదావరి వరదతో ఈ చెట్టు కూలిపోయింది. కొవ్వూరు మండలం తాళ్ళపూడి దగ్గర్లోని కుమారదేవం గ్రామంలో ఈ నిద్ర గన్నేరుచెట్టును గోదారితల్లి ఒడ్డున నాటారు  మహానుభావుడు శ్రీ సింగలూరి తాతబ్బాయి .ఎన్నో వరదల్నీ, తుఫాన్లనీ,తట్టుకుంటా తరతరాల్ని చూసుకుంటా పెరిగి మహా వృక్షమైన దీన్ని పేరు కూడా మర్చిపోయి సినిమా చెట్టు అని పిలుస్తారిక్కడి జనాలు. అలా అనడానికి కారణం  దీనికింద పాడిపంటలు ,దేవత ,వంశవృక్షం,బొబ్బిలిరాజా,హిమ్మత్వాలా,సీతారామయ్యగారి మనవరాలు ఇలా లెక్కెట్టు కుంటా పొతే మొత్తం నూటెనిమిది సినిమాల షూటింగ్ జరిగింది .కెమేరా తీసుకొచ్చి దీని కింద పెడితే ఫ్రేము దానంతటదే వచ్చేస్తుంది. అంత మహత్యం ఈ చెట్టుది. ఇంకో విషయం ఈ చెట్టు కింద ఒక్క షాట్ తీస్తే చాలు సిన్మా సూపర్ హిట్టు అన్న సెంటిమెంటు కూడా వుంది . దర్శకుడు వంశీ గారు అయితే ఈ చెట్టు లేకుండా సినిమా తీయరు. రాఘవేంద్రరావు గారు, దాసరి గారు , జంధ్యాల గారు, ఇవివి గారు ...ఇలా గొప్ప డైరెక్టర్లందరూ ఈ చెట్టు చుట్టూ తిరిగినవారే.
150 ఏళ్లనాటి సినిమా చెట్టు 
🔸ఈ చెట్టు వద్ద 308 సినిమాల చిత్రీకరణ
🔸వంశీ దర్శకత్వంలో 18 చిత్రాల షూటింగ్‌
1974 లో వచ్చిన పాడిపంటలు
చిత్రంలో ఇరుసులేని బండి ఈశ్వరుని బండి
పాటతో మొదలైన ఈ చెట్టు  ప్రస్థానం...
సీతా రామయ్య గారి మనవరాలు లో సమయానికి...,గోదావరి లో ఉప్పొంగేలే గోదావరి లాంటి పాటలు ...ఇలా ఒకటేమిటి
చెప్పుకుంటూపోతే వందలాది పాటలు... 
జనాల గుండెల్లో ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి... 
ఎన్నో వరదల్నీ తుఫాన్లనీ, తట్టుకుంటూ తరతరాల్ని చూసుకుంటూ పెరిగి మహా వృక్షమైన సినిమా చెట్టు ఇక లేదు అనే వార్త నిజంగా బాధాకరం.
- సేకరణ


Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...