కళలకాణాచితెనాలి నూతన కార్యవర్గం ఎంపిక

కళలకాణాచి-తెనాలి నూతన కార్యవర్గం ఎంపిక
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
పట్టణానికి చెందిన కళలకాణాచి-తెనాలి సర్వసభ్య సమావేశం గురువారం ఉదయం బుర్రిపాలెం రోడ్డు బి.సి. కాలనీలోని పట్టణ రంగస్థల కళాకారుల భవనంలో జరిగింది. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2019లో స్థాపించిన కళలకాణాచి సంస్థ కార్యవర్గ గడువు 2024 ఆగస్టులో ముగియడం వలన నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గ గౌరవ అధ్యక్షుడిగా ప్రవాసభారతీయుడు డాక్టర్ బాబు ఆర్ వడ్లమూడి, అధ్యక్షుడిగా సినీ మాటల రచయిత డాక్టర్ సాయి మాధవ్ బుర్రా, ఉపాధ్యక్షుడిగా చెరుకుమల్లి సింగారావు, ప్రధాన కార్యదర్శిగా సినీ, టి.వి., రంగస్థల నటుడు గోపరాజు విజయ్, సహాయ కార్యదర్శులుగా అయినాల మల్లేశ్వరరావు, కొండముది రమేష్, కత్తి సౌజన్య, కోశాధికారిగా దేవరపల్లి భవాని, కార్యవర్గ సభ్యులుగా గోళ్ళ సుబ్రహ్మణ్యం, వెంకటలక్ష్మి, బడుగుమోహనరావు, అలపర్తి వెంకటేశ్వరరావు, వెనిగళ్ళ నారాయణ ప్రసాద్, గోగినేని సుధీర్ బాబు, లుక్కా సోమేష్, పాశం వెంకటేష్, మద్దినేని కిరణ్, తరిణి హేమంత్ కుమార్,  రాధా శ్రీరామ్, ప్రింటీమీడియా ఇన్చార్జి ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ షేక్ అబ్దుల్ హకీం జాని, సోషల్ మీడియా ఇన్చార్జ్ కనపర్తి మధుకర్, ముఖ్య సలహాదారులుగా అమరేష్ గల్లా,మునగాల శ్యాంప్రసాద్, న్యాయసలహాదారుగా జి.వి.ఎన్.ఆర్.ఎస్.ఎస్.ఎస్. వరప్రసాద్, గౌరవ సలహాదారులుగా గోపరాజు రమణ, గోగినేని కేశవరావు, వేమూరి విజయభాస్కర్, టి.వి.ఎస్. శాస్త్రి, తమ్ముడు సత్యం, ఎం. వి. శాస్త్రి, వి.ఎస్.కె.ఎన్. స్వామి, దేవిరెడ్డి రామకోటేశ్వరరావు, తాడిబోయిన హరిప్రసాద్, హరిదాసు గౌరీశంకర్,బెజ్జంకినాగమణి,సాయి,సత్యనాయణ,సంస్కృతి బాలచందర్, ఉయ్యూరు హైమావతి, కృష్ణమాస్టారు, గరికపాటి సుబ్బారావు తదితరులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. నూతన కార్యవర్గం 2024 నుండి 2027 వరకు కొనసాగుతుంది.