మానవత స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు అభినందనీయం

మానవత స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు అభినందనీయం
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:  మానవత స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తున్న సేవలు వెలకట్టలేనివని తహశీల్దార్ కెవి గోపాలకృష్ణ అన్నారు. సంస్థ సమావేశం ఆదివారం ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల లైబ్రరీలో జరిగింది. సంస్థ రీజినల్ ఛైర్మన్, ప్రముఖ మానవత వాది, పారిశ్రామికవేత్త కొత్త సుబ్రహ్మణ్యం తహశీల్దార్ కెవి గోపాలకృష్ణను సత్కరించారు. కార్యక్రమంలో అమృత సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రటరీ అండ్ కరెస్పాండంట్ కె. రామ్మోహనరావు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. సన్మాన గ్రహీత గోపాలకృష్ణ మాట్లాడుతూ మేధావులు, విద్యావంతులు, వ్యాపారవేత్తలు సామాజిక దృక్పథంతో ఒక సంస్థను ఏర్పాటు చేసి తద్వారా సమాజంలో అట్టడుగు వర్గాలకు సేవలందించడం అభినందనీయమన్నారు.ఇలాంటి సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని, వీలైతే తనను కూడా సేవా కార్యక్రమాలలో భాగస్వామిని చేయాలని సంస్థను కోరారు. సంస్థ తరఫున సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తామని రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం వెల్లడించారు. అధ్యక్షత వహించిన సంస్థ తెనాలి చైర్మన్ డాక్టర్ కొలసాని రాంచంద్ సంస్థ కార్యక్రమాలను వివరించారు. సమావేశంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ కటకం ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ పి శ్రీనివాస్, సెక్రటరీ పి వెంకట్, జాయింట్ సెక్రటరీ డి సోమయ్య శాస్త్రి, సంస్థ సభ్యుల పాల్గొన్నారు.