విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకురాలికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకురాలికి పీహెచ్‌డీ
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ బయోటెక్, ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ విభాగంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీకు చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అన్నం నాగలక్ష్మికు తమ యూనివర్సిటీ పీహెచ్‌డీ పట్టాను అందజేసిందని వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘స్క్రీనింగ్‌ అండ్‌ ఎవాల్యూషన్‌ ఆఫ్‌ బయోయాక్టివ్‌ మెటబోలైట్స్‌ ఫ్రమ్‌ కుర్కుమ లోంగ అండ్‌ టినోస్పోర కార్డిఫోలియో అగెనెస్ట్‌ పల్మనరీ ఫిబ్రోసిస్‌ ఇన్‌ మైస్‌’’ అనే అంశంపై ఆమె పరిశోధన చేశారని తెలియజేశారు. ఈమెకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.కృపానిధి గైడ్‌గా వ్యవహరించారని పేర్కొన్నారు. డాక్టరేట్‌ పట్టా పొందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అన్నం నాగలక్ష్మిను వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు.