Skip to main content

మరుగున పడిన మేధావుల్లో ఒకరు మోదుకూరి జాన్సన్

మరుగున  పడిన  మేధావుల్లో ఒకరు
- మోదుకూరి జాన్సన్‌
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
జాన్సన్ పేరు వినగానే మానవుడు - దానవుడు, కరుణామయుడు, దేవాలయం, నేటి భారతం సినిమాలు గుర్తుకు వస్తాయి. నాటక ప్రపంచంలో 'నటనాలయం' పేరు తలిస్తే జాన్సన్‌ గుర్తుకు వస్తాడు.పాడిపంటలు సినిమాలో 'మన జన్మ భూమి బంగారు భూమి' పాటను శ్రీశ్రీ రాశారా అనుకునేంత గొప్పగా రాశాడు జాన్సన్‌. దళిత రచయితలకు సినిమా రంగంలో అవకాశాలు రావటం, నిలదొక్కుకోవటం, రాణించటం అంత సులభమైన పనికాదు. ప్రముఖ నాటక రచయిత పాటిబండ్ల ఆనందరావు సైతం సినిమా రచయితగా ప్రయత్నం చేసి అక్కడ ఇమడలేక తిరిగి వచ్చి నాటకాన్నే నమ్ముకున్న పరిస్థితి. ఒక 'జాలాది' మాత్రం ప్రత్యేకమైన పల్లె పదాలతో తనదైన ఒక బాణీలో పాటలు రాసి నిలదొక్కుకున్నాడు. మోదుకూరి జాన్సన్‌ ఏనాడూ సినీ పరిశ్రమకు వెళ్ళాలని ప్రయత్నం చెయ్యలేదు. సినీ పరిశ్రమే ఆయన ప్రతిభను గుర్తించింది. 'నటనాలయం' నాటకాన్ని తెనాలి దగ్గర ఒక పల్లెటూర్లో ప్రముఖ సినీ నటుడు గుమ్మడి చూశారు. గుమ్మడికి అందులోని సన్నివేశాలు, విషయాన్ని కొత్త కోణంలో చెప్పిన విధానం నచ్చింది. అదే కాలంలో అక్కినేని నాగేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావు మరో ప్రపంచం సినిమా కోసం 'ఎవరన్నా కొత్త రచయితలు ఉంటే చెప్పండి' అని గుమ్మడిని అడగ్గా వెంటనే మోదుకూరి జాన్సన్‌ని సిఫారసు చేసి మద్రాసు పిలిపించి పరిచయం చేశారు. ఆ విధంగా జాన్సన్‌ మరో ప్రపంచంలోకి అడుగుపెట్టి వెనుదిరిగి చూడలేదు. తెలుగు సినీరంగంలో రచయితగా చెరగని ముద్ర వేశాడు జాన్సన్‌. జాన్సన్‌ 1962లో తెనాలిలో కొంతకాలం అడ్వకేట్‌గా పనిచేశాడు. ఆ రోజుల్లో రాడికల్‌ హ్యుమనిస్టులతో ేస్నహం, చర్చలతో సామాజిక అవగాహన పెంచుకున్నాడు. ఆయనలో సృజనాశక్తి ఉన్నందువల్ల 'దేవాలయం', 'హృదయాలయం', 'నాగరికత', 'నిచ్చెనమెట్లు' వంటి చాలా నాటకాలు రాశాడు, ప్రదర్శించాడు. జాన్సన్‌ సినిమాలో ఇన్వాల్వ్‌ అయితే ఎలాంటి సాహిత్యం వస్తుందనడానికి ఉదాహరణ కరుణామయుడు. జాన్సన్‌ మాటలు రాసిన ఈ చిత్రంలోనే చిరస్థాయిగా నిలిచిపోయే పాట ఒకటి రాశాడు. 'కదిలిందీ కరుణ రధం, సాగిందీ క్షమాయుగం మనిషి కొరకు దైవమే కరిగీ వెలిగె కాంతి పథం'. ఈ పాట జాన్సన్‌ తప్ప ఎవరు రాసినా ఆ స్థాయిలో రాయలేరు. మానవుడు - దానవుడు సినిమా జాన్సన్‌కు డైలాగ్‌ రైటర్‌గా గుర్తింపు తెచ్చింది. 'అవసరానికి మించి ఐశ్వర్యం ఇస్తే మనిషి కన్నుమిన్నూ కానబోడేమో, కడుపుకు చాలినంత కబలమీయకుంటే మనిషి నీతీ నియమం పాటించడేమో' అంటూ దేవుడికి మానవుడి బలహీనతల గురించి వివరిస్తాడు జాన్సన్‌. రాసేది భక్తి గీతమే అయినా, అందులోనూ సామాజికాంశాన్ని చొప్పించడం జాన్సన్‌ ప్రత్యేకత.
రామానాయుడు, కృష్ణ లాంటి నిర్మాతలు జాన్సన్‌ను కోరి మరీ తమ సినిమాల్లో రచన చేయించుకున్నారు. నవయుగ కవి చక్రవర్తి గుఱ్ణం జాషువాతో జాన్సన్‌కు ఆత్మీయ సంబంధం ఉంది. దళితుడుగా తాను పడే బాధలను చెప్పడానికి జాషువా 'గబ్బిలం' రాస్తే, జాన్సన్‌ అదే విషయాన్ని మరింత బలంగా వినిపించడానికి 'కాకి' కావ్యం రాసి, ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల వేదిక మీద చదివాడు. జాషువా 'స్మశానం' మీద పద్యం రాేస్త, జాన్సన్‌ అదే స్మశానాన్ని 'దేవాలయం' సినిమాలో కళ్యాణ వేదికగా మలిచాడు. జాషువా తన చివరి కాలం ఎక్కువగా తెనాలి ప్రాంతంలోనే గడిపాడు. ఈ ప్రాంతం వేస్త జాన్సన్‌ తప్పకుండా జాషువా వెంట ఉండేవాడు. దళితుల ఆత్మ గౌరవం కోసం కులాన్ని పేరు చివర పెట్టుకోవడమే మంచిదని 1970 ప్రాంతాల్లోనే తను 'కాకి' కావ్యం రాేస నాటికే అభిప్రాయపడిన క్రాంతి దర్శి జాన్సన్‌.
తెనాలి సమీపంలోనీ కొలకలూరు లో 1934 సంవవత్సరంలో ఆగస్టు 8న మోదుకూరి గురవయ్య, రత్నమ్మ దంపతులకు జన్మించాడు జాన్సన్‌. వీరిది సాధారణ వ్యవసాయ కూలీ మాదిగ కుటుంబం. జాన్సన్‌ కళావాచస్పతి జగ్గయ్య శిష్యుడు. ఆయనే జాన్సన్‌కు 'అగ్నికవి' అని నామకరణం చేశాడు. గుంటూరు ఏ.సి. కాలేజీలో బి.ఏ. చదివినప్పుడు ఇంగ్లిష్‌ లెక్చరర్‌ రోశయ్య, తర్వాత 'లా' చదవడానికి ఆంధ్ర యూనివర్శిటీ వెళ్ళినప్పుడు అక్కడ కూర్మ వేణుగోపాలస్వామి జాన్సన్‌లోని కవిని, నాటక రచయితని నిద్రలేపి నిలబెట్టారు. ప్రపంచానికి పరిచయం చేశారు. జాన్సన్‌ 1988 డిసెంబర్‌ 24న గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.'చలన చిత్రాలను ప్రేక్షకులు కేవలం వినోదం కోసమే చూస్తారంటే నేను నమ్మను. ప్రజల కష్ట సుఖాలు, వారి సమస్యలకు పరిష్కారాలు చెప్పే చిత్రాలు కూడా చూస్తారు. అసలు సినిమా లక్షణం, ప్రయోజనం అదేనని నా గట్టి నమ్మకం' అని ఓ సందర్భంలో చెప్పారు మోదుకూరి జాన్సన్‌.

- కత్తి కళ్యాణ్‌

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...