సూపర్ సెవెన్ గా సినిమా పరిశ్రమను చేయండి

సూపర్  సెవెన్ గా సినిమా పరిశ్రమను చేయండి
- ' మా- ఏపి ' దిలీప్ రాజా 
సమావేశం లోమాట్లాడుతున్న దిలీప్ రాజా
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెనాలి ఆగస్టు 24: ముఖ్యమంత్రి ప్రకటించిన సూపర్ సిక్స్ కు అదనంగా సినిమా పరిశ్రమ అభివృద్ధిని చేర్చవలసిందిగా' మా - ఏపి' వ్యవస్థాపకులు, సినీ దర్శకుడు దిలీప్ రాజా కొరారు.స్థానిక మూవీ ఆర్టిస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల యూనియన్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతు త్వరలో జరగనున్న కేబినెట్ సమావేశంలో ఆంధ్రాలో సినీ పరిశ్రమ అభివృద్ధి పై ఎలాంటి
చర్యలను ప్రభుత్వం  అమలు చేస్తుందో మంత్రివర్గ సమావేశంలో చర్చిoచవలసిందిగా ఆయన సీఎం చంద్రబాబుకు మనవి చేశారు. హైదరాబాద్, తిరుపతి విశాఖపట్నం పట్టణాలకు అనుకూలoగా అమరావతిలో సకల సదుపాయాలతో అవసర మైన ఫ్లోర్ లతో స్టూడియోను ప్రభుత్వం ఈ నిర్మిస్తే ప్రభుత్వానికి రెవిన్యూ వస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తo చేశారు.స్టూడియోల నిర్మాణాలకు ముందుకొచ్చిన వ్యాపారవేత్తలకు ప్రభుత్వం స్థలాలను కేటాయించవలసిందిగా ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రాలో నివాసం ఉండేందుకు ఇష్టపడుతున్న సినీ కార్మికులకు ఇండ్లస్థలాలను కేటాయిస్తే అమరావతిలో ఫిలిం నగర్ ఏర్పటుకాగలదనే ఆశాభావాన్ని వ్యక్తపరిచారు.సమావేశంలో అసోసియేట్ డైరెక్టర్ ఇంటూరి విజయభాస్కర్ పాల్గొన్నారు.