నెహ్రూనికేతన్లో ప్రపంచ అబాకస్ దినోత్సవం


నెహ్రూనికేతన్లో ప్రపంచ అబాకస్ దినోత్సవం
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెనాలి: 08-08-2023: ప్రపంచ అబాకస్ దినోత్సవాన్ని (వేగ గణిత దినోత్సవం) స్థానిక బోస్రోడ్డులోని నెహ్రూనికేతన్ పాఠశాలలో మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి పర్యవేక్షణలో గురువారం ఘనంగా జరిపారు. బాలబాలికలు అబాకస్ పద్ధతిలో కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం వంటి లెక్కలను క్షణాలలో చేసి చూపించారు. ఈ సందర్భంగా నెహ్రూనికేతన్ ఎం.డి. మురళీకాంత్ వి దాసరి మాట్లాడుతూ హైదరాబాద్కు చెందిన విశ్వ ఎడ్యుటెక్ సంస్థ పర్యవేక్షణలో తమ పాఠశాలలో గత ఎనిమిది సంవత్సరాల నుండి అబాకస్ ప్రక్రియ ద్వారా కూడా బాలబాలికలకు గణితం నేర్పించే విధానం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు, ఉపాధ్యాయలు పాల్గొన్నారు.