విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఇంకుబేషన్ సెంటర్ ప్రారంభం టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ విభాగంలోని అగ్రికల్చరల్ అండ్ హార్టికల్చరల్ సైన్సెస్ డిపార్ట్‌మెంట్, యూఎస్‌ఏఐడీ, సిఫార్, వరల్డ్ ఆగ్రోఫారెస్ట్రీల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘‘ట్రీ బేస్డ్ ఎంటర్‌ప్రైజ్ ఇంకుబేషన్ సెంటర్‌ను (టీబీఈఐసీ)’’ సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఇంకుబేషన్ సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఇండియాలోని యూఎస్‌ఏఐడీ జనరల్ డెవలప్‌మెంట్ ఆఫీస్ డైరెక్టర్ టెగెన్‌ఫెల్‌డెట్ మార్క్ హాజరై సెంటర్‌ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విజ్ఞాన్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలలో ట్రీ బేస్డ్ ఎంటర్‌ప్రైజ్ ఇంకుబేషన్ సెంటర్‌ను ప్రారంభించిన ఘనత విజ్ఞాన్స్ యూనివర్సిటీకే దక్కుతుందన్నారు. అంతేకాకుండా విజ్ఞాన్‌లో ఏర్పాటు చేసిన సెంటర్ దేశంలోనే రెండవ అత్యధికమైన ఇంకుబేషన్ సెంటరని తెలియజేసారు. దేశ ఆర్థిక వృద్ధిని పెంచడంతో పాటు జనాభా ప్రయోజన...