వరల్డ్‌ టాప్‌ 2% సైంటిస్ట్‌లలో విజ్ఞాన్స్‌ అధ్యాపకులకు చోటు

వరల్డ్‌ టాప్‌ 2% సైంటిస్ట్‌లలో విజ్ఞాన్స్‌ అధ్యాపకులకు చోటు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన 6 అధ్యాపకులు వరల్డ్‌ టాప్‌ 2% సైంటిస్ట్‌లలో చోటు సాధించారని విజ్ఞాన్స్‌ వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ శుక్రవారం తెలిపారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అమెరికాలోని కాలిఫోర్నియా ప్రాంతంలోని స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీకు చెందిన ప్రొఫెసర్‌ అంబటి రంగారావు, డాక్టర్‌ కే.చంద్రశేఖర్, మెకానికల్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ప్రొఫెసర్‌ కే.వెంకట రావ్, ఫార్మసీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన డాక్టర్‌ రుద్రపాల్‌ మిథున్, అడ్వాన్డ్స్‌ సీఎస్‌ఈ విభాగానికి చెందిన డాక్టర్‌ జోత్న్సాదేవి బోడపాటి, కెమికల్‌ విభానికి చెందిన ప్రొఫెసర్‌ టీ.సుబ్బయ్యలు వరల్డ్‌ టాప్‌ 2% సైంటిస్ట్‌లలో నిలిచారని తెలిపారు. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ వారు 2023 సంవత్సరం వరకు ఉన్న ఉత్తమ సైంటిస్ట్‌ల డేటాను తీసుకోవడంతో పాటు స్టాండర్డ్‌ సైన్స్‌ మేట్రిక్స్‌ క్లాసిఫికేషన్‌లో గల 44 సైంటిఫిక్‌ ఫీల్డ్స్, 174 సబ్‌ ఫీల్డ్స్‌ను పరిగణలోనికి తీసుకుని ఈ ఫలితాలను వెల్లడించారని తెలియజేసింది. అందులో భాగంగా రీసెర్చ్‌ వర్క్, రీసెర్చ్‌ పబ్లికేషన్స్, హెచ్‌ ఇండెక్స్, సైటేషన్స్, రీసెంట్‌ పబ్లికేషన్స్, ఇతరత్రా పబ్లికేషన్స్‌లలో ఈ 6 అధ్యాపకులు ప్రచురించిన పేపర్లన్నింటిని కూడా పరిగణలోనికి తీసుకుని వరల్డ్‌ టాప్‌ 2% సైంటిస్ట్‌లలో గుర్తించారని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన 6గురు ప్రొఫెసర్‌లకు నగదు బహుమతులు అందించి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు.