విజ్ఞాన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు రూ.5 లక్షల విలువ కలిగిన గృహ సామాగ్రి పంపిణీ

విజ్ఞాన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు రూ.5 లక్షల విలువ కలిగిన గృహ సామాగ్రి పంపిణీ
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలోని ఎన్ఎస్ఎస్ విద్యార్థుల ఆధ్వర్యంలో తాడేపల్లి లోని వరద బాధితులకు రూ.5 లక్షల విలువగల గృహ సామాగ్రి పంపిణీ చేశామని వర్సిటీ వైస్ చాన్సలర్ కల్నల్, ప్రొఫెసర్ పీ. నాగభూషణ్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య పాల్గొని గృహ సామాగ్రితో కూడిన బస్సును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్ చాన్సలర్ మాట్లాడుతూ ఇటీవల వరద ప్రాంతాల్లో ముంపుకు గురైన తాడేపల్లి మండలంలోని నులకపేట సమీప ప్రాంతాల్లోని 500 కుటుంబాలకు గృహ సామాగ్రి పంపిణీ చేశామన్నారు. ఈ గృహ సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని నులకపేట ప్రాంతంలోని చైతన్య తపోవన్ శ్రేయో కళ్యాణ మండపంలో నిర్వహించామన్నారు. ఈ గృహ సామాగ్రి పంపిణీ కార్యక్రమంలో యూనివర్సిటీకి చెందిన 300 మంది ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారని తెలియజేశారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, ఆధిపతులు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.