వరద ప్రాంతాల్లో కొనసాగుతున్న విజ్ఞాన్ విద్యార్థుల సర్వే

వరద ప్రాంతాల్లో కొనసాగుతున్న విజ్ఞాన్ విద్యార్థుల సర్వే 
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీకి చెందిన ఎన్ఎస్ఎస్ విద్యార్థులు విజయవాడలోని వరద ప్రాంతాల్లో వరుసగా నాలుగవ రోజు వరద సహాయక సర్వే లో పాల్గొన్నారని వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్ చాన్సలర్ మాట్లాడుతూ యూనివర్సిటీకి చెందిన 300 మంది ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఐదు గ్రూపులుగా విడిపోయి విజయవాడ నగరంలోని వాంబే కాలనీ రోడ్, శాంతి నగర్, డిస్నీ లాండ్ రోడ్, పైపుల్ రోడ్, అజిత్ సింగ్ నగర్, అంబేద్కర్ ఇన్నర్ రింగ్ రోడ్, ప్రకాష్ నగర్, రాజీవ్ నగర్, ఫైర్ స్టేషన్ రోడ్, సుందరయ్య నగర్, తోట వారి వీధి, సింగ్ నగర్, వడ్డెర కాలనీ, పిఎన్టి నగర్ కాలనీలో ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయ కార్యక్రమాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే అనే విషయాలపై సర్వే నిర్వహించి ప్రభుత్వం అందించిన గూగుల్ లింక్ లో అప్డేట్ చేస్తున్నారని పేర్కొన్నారు. సర్వేలో భాగంగా విద్యార్థులు ఆయా కాలనీలో సరైన సమయానికి ఆహారం, పాలు, నీరు అందుతున్నాయా లేదా అనే అంశాలపై సర్వే చేశారని వెల్లడించారు. మరి కొంతమంది విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి లారీల్లో వచ్చిన ఆహార పదార్థాలను ట్రాక్టర్స్ లోకి అన్ లోడింగ్ చేయించి సమీప ప్రాంతాల్లోని ప్రజలకు అందించడంలో సహాయపడ్డారని తెలియజేశారు. వరద సహాయక చర్యల సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులను విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వైస్ చాన్సలర్ కల్నల్ ప్రొఫెసర్ పి నాగభూషణ్, రిజిస్టార్ డాక్టర్ ఎమ్మెస్ రఘునాథన్, ఆయా విభాగాల డీన్స్, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.