దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త నాయుడమ్మ


టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త నాయుడమ్మ అని, ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో చర్మ పరిశోధన శాస్త్రవేత్త దివంగత యలవర్తి నాయుడమ్మ స్మారక పురస్కారాన్ని నేషనల్ లిగ్నేట్ కార్పొరేషన్ సీఎండీ మోటుపల్లి ప్రసన్నకుమార్ కు మంగళవారం ప్రదానం చేశారు. నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ చైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు అధ్యక్షతన నిర్వహించిన సభలో మంత్రి మనోహర్
మాట్లాడుతూ, ఏపీ ని గ్రీన్ హైడ్రోజన్ రాష్ట్రంగా మార్చేందుకు సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని సౌర విద్యుత్ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. పురస్కార గ్రహీత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ వేసిన పునాది కారణంగా సౌర విద్యుత్ 1.50 లక్షల మెగా వాట్ల ఉత్పత్తికి చేరుకుందని, దానిని 2030 నాటికి 1.50 లక్షల గిగా వాట్ల ఉత్పత్తికి పెంచే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. చెన్నై సీఎల్ఆర్ఐ శాస్త్రవేత్త స్వర్ణ వి.కాంత్ మాట్లాడుతూ, దేశంలో చర్మ పరిశోధన సంస్థ సాధిస్తున్న అభివృద్ధి వెనుక నాయుడమ్మ కృషి, ప్రోత్సాహం ఎంతగానో ఉందన్నారు. ఫౌండేషన్ వైస్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నేటి తరం విద్యార్థులకు శాస్త్ర సాంకేతిక పరి జ్ఞానం అందించాలంటే సైన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని, ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. డాక్టర్ నాయుడమ్మ జీవిత చరిత్రపై నిర్వహించి వ్యాచసరచనలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందించారు. తొలుత డాక్టర్ నాయుడమ్మ జీవిత చరిత్రపై రూపొందించిన ఎ.వి ని ప్రదర్శించారు 
పవన్ కుమార్ తదితరులు మాట్లాడారు.