నేటి కేబినెట్లో సినిమాపై చర్చించండి

నేటి కేబినెట్లో సినిమాపై చర్చించండి.
-ముఖ్యమంత్రికి ' మా - ఎపీ' బహిరంగ లేఖ
 మా _ ఎపి' దిలీప్ రాజా
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెనాలి, సెప్టెంబర్ 17: బుధవారం జరుగుతున్న రాష్ట్ర మంత్రిమండలి కేబినెట్  స‌మావేశంలో సినిమా ప‌రిశ్ర‌మ పై ప్ర‌తిపాదిత అంశాల గురించి చ‌ర్చ‌లు జ‌ర‌ప‌వ‌ల‌సిందిగా మూవీ  ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల యూనియన్  వ్యవస్థాపకులు, సినీ దర్శకుడు దిలీప్ రాజా రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. స్థానిక 'మా _ ఎపి' కార్యాలయంలో మంగళవారo ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థను సమాచారశాఖలో నుండి విడతీసి పర్యాటక,సాంస్కృతిక శాఖల్లో విలీనం చేస్తే ప్రయోజనాలు అధికంగా ఉంటాయన్నారు.సినిమా షూటింగ్ లోకేషన్ లన్ని  టూరిజంశాఖ పరిధిలోనే ఉన్నందువలన అనుమతుల కోసం కాలయాపన జరగదని ఆయన స్పష్టం చేశారు.గతంలో ప్రకటించిన నంది అవార్దులను అందజేస్తూ ప్రస్తుతకాలానికి నంది అవా ర్దులను ప్రకటించాలని ఆయన కోరారు. రాజకీయాలతో సంబంధంలేని వ్యక్తులను న్యాయనిర్ణేతల కమిటీలో నియమించాల్సిందిగా ఆయన సూచించారు.సినిమా పరిశ్రమను ఆంధ్రకు తీసుకురావడానికీ ప్రభుత్వం తీసుకున్న విధివిధానాలను కేబినెట్‌లో తెలియజేయాలని దిలీప్ రాజా ప్రభుత్వాన్ని కోరారు. కొన్ని రాస్ట్రాల్లో సబ్సిడీ 50 లక్షల రూపాయలు చెల్లిస్తున్న నేపధ్యంలో నిర్మాణవ్యయం తీవ్రంగా పెరిగినందువలన ఆంధ్రలో సబ్సిడిను 10 లక్షలనుండి 50 లక్షలకు పెంచే దిశగా కేబినెట్లో నిర్ణయం తీసుకోవలసిందిగా ఆయన 'మా - ఏపీ' యూనియన్ తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.స్టూడియోల నిర్మాణoకు,పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోల ఏర్పాటుకు,సినిమా కార్మికులకు స్థలాలను కేటాయించే అంశoపై ముఖ్యమంత్రి దృష్టిపెట్టాలని దిలీప్ రాజా మనవిచేశారు.పర్యాటక,సాంస్కృతిక,ఎఫ్ డిసి శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టలను  నియమించేందుకు తగిన చర్యలు తీసుకోవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రికి బహిరంగలేఖను మీడియద్వారా దిలీప్ రాజా తెలిపారు.