చైల్డ్ పోర్నోగ్రఫీ పై సుప్రీం కోర్టు తీర్పు కీలకం

చైల్డ్ పోర్నోగ్రఫీ పై సుప్రీం కోర్టు తీర్పు కీలకం
--- సినీ దర్శకుడు దిలీప్ రాజా 
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెనాలి, సెప్టెంబర్ 23 : పిల్లలు అశ్లీల వీడియోలను చూడటం, డౌన్‌లోడ్ చేయడo నేరం కాదన్న తమిళనాడు హైకోర్ట్ ఉత్తర్వులను   సుప్రీoకోర్టు తోసిపుచ్చడం భారత దేశంలో పిల్లలున్న ప్రతి తల్లి తండ్రి గుండెలమీదున్న కుంపటిని దించడమేనని సినీ దర్శకుడు దిలీప్ రాజా అభిప్రాయం వ్యక్తo చేశారు.స్థానిక  మూవీ
  ఆర్టిస్టు   అసోసియేషన్   ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల యూనియన్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోక్సో చట్ట ప్రకారంగా పిల్లలు పోర్న్ వీడియోలు చూడటం డౌన్‌లోడ్ చేయడం నేరమని దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు హర్షణీయం అన్నారు.చెన్నై హైకోర్ట్ ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తు ఓ తండ్రి సుప్రీo  కోర్టును ఆశ్రయించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.దీనిపై సుప్రీం తీర్పు భారత దేశ ఆచార సాంప్రదాయాలను గౌరవిస్తు పిల్లల రక్షణపై ప్రత్యేక శ్రద్ధవహించినదన్నారు.అందుకుగాను సుప్రీo ధర్మాసనానికి భారతీయుడిగా చేతులుజోడించి నమస్కరిస్తున్నానని ఆయన చెప్పారు.అంతేకాకుండా విచారణ సందర్భంగా  చైల్డ్ పోర్నోగ్రఫీ పదంపై చట్టసవరణ చేయాలని సూచించడం గమనార్హమని దిలీప్ రాజా  పేర్కొన్నారు.కొందరి జీవితాలు పోర్న్ వీడియోలకు బానిసలై నందువలన మానసికంగా విపరీతంగా ప్రవర్తించడం బాధాకరమని ఆయన 
వ్యాఖ్యానించారు.

ఫోటో రైటప్
మాట్లాడుతున్న దిలీప్ రాజా