Skip to main content

సరికొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమం

సరికొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమం 

 - ఇటలీలోని పొలిటెక్నికో డి టోరినో డాక్టర్‌ శాంటో బెనర్జీ
- విజ్ఞాన్స్‌లో ఘనంగా ప్రారంభమైన ఐసీఎన్‌ఏఎస్‌సీ–24 అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
నాన్‌ లీనియర్‌ అనాలిసిస్‌తో ఆవిష్కరణలను, పరిశోధనలను వేగంగా తీసుకెళ్లటంతో పాటు ఖచ్చితత్వం కలిగించి, సరికొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమం చేస్తుందని ఇటలీలోని పొలిటెక్నికో డి టోరినో డాక్టర్‌ శాంటో బెనర్జీ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ సైన్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ విభాగంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మేథమ్యాటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ విభాగం, సెర్బ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో  ‘‘ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ నాన్‌–లీనియర్‌ అనాలిసిస్‌ అండ్‌ సైంటిఫిక్‌ కంప్యూటింగ్‌ (ఐసీఎన్‌ఏఎస్‌సీ–2024)’’ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించనున్న అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను హైబ్రిడ్‌ మోడ్‌లో (ఆన్‌లైన్‌ అండ్‌ ఆఫ్‌లైన్‌) గురువారం ఘనంగా ప్రారంభించారు. అనంతరం ‘‘ఐసీఎన్‌ఏఎస్‌సీ–2024’’కు సంబంధించిన ప్రత్యేక సంచికను విడుదల చేశారు.  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇటలీలోని పొలిటెక్నికో డి టోరినో డాక్టర్‌ శాంటో బెనర్జీ మాట్లాడుతూ నాన్‌ లీనియర్‌ విశ్లేషణ సాంకేతికత, ఇంజనీరింగ్‌ సమస్యల పరిష్కారం కోసం ఉపయోగపడుతుందన్నారు. లీనియర్‌ పద్ధతులతో సాధ్యం కాని సమస్యలను ఇది అర్థం చేసుకుని వాటిని పరిష్కరించడానికి సహకరిస్తుందన్నారు. ఉదాహరణకు, వాతావరణ మార్పులపై లేదా భూకంపాలను అంచనా వేసే విషయాలలో నాన్‌ లీనియర్‌ అనలిసిస్‌ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. నాన్‌ లీనియర్‌ సిస్టమ్స్‌ వాస్తవ ప్రపంచ సమస్యలకు దగ్గరగా ఉంటాయన్నారు. మన వాతావరణం, జీవవైజ్ఞానిక సిస్టమ్స్, ఆర్థిక వ్యవస్థలు వంటి అంశాలన్నీ నాన్‌ లీనియర్‌ విధానాల్లో పనిచేయడం వలన సమస్యల పరిష్కారం సులభతరం అవుతుందన్నారు. వీటితో పాటు విద్యార్థులు ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్, క్రిప్టోగ్రఫీ, ఐవోటీ, డేటా సైన్స్‌ వంటి సబ్జెక్ట్‌ల మీద కూడా అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన ఎన్‌ఐటీ దుర్గాపూర్‌ ప్రొఫెసర్‌ సమర్జిత్‌ కర్‌ మాట్లాడుతూ సైంటిఫిక్‌ కంప్యూటింగ్‌ను ఉపయోగించడం వలన పెద్ద గణనలతో పాటు సంక్లిష్ట సిమ్యులేషన్లతో కఠినమైన ఇంజనీరింగ్‌ మరియు శాస్త్రీయ పరిశోధనలు వేగవంతం చేయవచ్చునన్నారు. ఇది ఆస్ట్రోఫిజిక్స్‌ నుండి మెటీరియల్‌ సైన్స్‌ వరకు విస్తృతంగా ఉపయోగపడుతుందన్నారు. ఐఐటీ ధన్‌బాద్‌ ప్రొఫెసర్‌ శ్రీనివాసరావ్‌ పెంట్యాల మాట్లాడుతూ సైంటిఫిక్‌ కంప్యూటింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించి చాలా ఎక్కువ గణనలను, డేటా విశ్లేషణను తక్కువ సమయంలోనే చేయవచ్చునన్నారు. ఇది పరిశోధనలకు, పరిశ్రమలకు ఖర్చును తగ్గించడంతో పాటు పరిశోధనల వేగాన్ని పెంచుతుందన్నారు. పాండిచ్చేరి యూనివర్సిటీ ప్రొఫెసర్‌ తిరుపతి రావ్‌ పాడి మాట్లాడుతూ విద్యార్థుందరూ స్టెమ్‌ ( సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమేటిక్స్‌) కాన్సెప్ట్‌ను అర్థం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మేథమేటిక్స్‌ మీదనే దృష్టిని కేంద్రీకరిస్తుందన్నారు. డేటా సైన్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషీన్‌ లెర్నింగ్‌ వంటి ఆధునిక సాంకేతికతలు కూడా సైంటిఫిక్‌ కంప్యూటింగ్‌పై ఆధారపడి ఉంటాయన్నారు. ఇవి ఆధునిక సమస్యలకు, భారీ డేటా విశ్లేషణలకు తోడ్పడుతాయన్నారు. టాంజానియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ డొడోమా అధ్యాపకులు డాక్టర్‌ జీ.శ్రీనివాస రావు మాట్లాడుతూ నాన్‌ లీనియర్‌ అనలిసిస్‌ మరియు సైంటిఫిక్‌ కంప్యూటింగ్‌లు కొత్త కొత్త ఆవిష్కరణలకు దారితీస్తాయన్నారు. ఇది పరిశోధనలను మరింత అధునాతనంగా చేయడమే కాకుండా భవిష్యత్‌ సమస్యలను పరిష్కరించేందుకు కొత్త మార్గాలను చూపిస్తాయన్నారు. అలహాబాద్‌లోని ఎమ్‌ఎన్‌ఎన్‌ఐటీ ప్రొఫెసర్‌ శివ్‌ దత్‌ కుమార్‌ మాట్లాడుతూ మేథమేటిక్స్‌లో ఇప్పటికీ పరిష్కరించని ప్రాబ్లమ్స్‌ అనేకం ఉన్నాయన్నారు. వాటిలో విద్యార్థులు ఏదైనా ఒక ప్రాబ్లమ్‌ను పరిష్కరించగలిగితే వారి జీవితం స్థిరపడుతుందన్నారు. ఐఎస్‌ఐ కోల్‌కత్త ప్రొఫెసర్‌ అరుప్‌ కుమార్‌ దాస్‌ మాట్లాడుతూ భౌతిక, జీవ, రసాయన శాస్త్రాలలో విస్తృత అనువర్తనాలు చేయాలన్నారు. నాన్‌ లీనియర్‌ అనలిసిస్‌ మరియు సైంటిఫిక్‌ కంప్యూటింగ్‌ను ఫ్లూయిడ్‌ డైనమిక్స్, క్వాంటం ఫిజిక్స్, బయోలాజికల్‌ సిస్టమ్స్‌ వంటి అనేక రంగాల్లో వాడుకోవచ్చని తెలియజేసారు. సిక్కిం మణిపాల్‌ యూనివర్సిటీ అధ్యాపకులు డాక్టర్‌ అసిత్‌ సాహ మాట్లాడుతూ మేథమ్యాటిక్స్, స్టాటిస్టిక్స్‌లో ప్రావీణ్యం పొందిన విద్యార్థులు భవిష్యత్‌లో డేటాసైన్స్‌ను పరిశోధనాంశంగా ఎంచుకోవాలన్నారు. ప్రస్తుతం అన్ని మల్టీ నేషనల్‌ కంపెనీలు డేటాసైన్స్‌ను విరివిగా వినయోగిస్తున్నారని తెలియజేసారు. కాబట్టి ఇందులో ప్రావీణ్యం పొందిన విద్యార్థులకు మంచి డిమాండ్‌ ఉంటుందన్నారు. ఈ అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి 500 మందికి పైగా అధ్యాపకులు, రీసెర్చ్‌ స్కాలర్స్‌ పాల్గొని వారి పరిశోధనా పత్రాలను ప్రచురించారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...