'హ్యారీ పోటర్ ' నటి మృతికి ' మా.. ఏపి' సంతాపం

' 'హ్యారీ పోటర్ ' నటి మృతికి ' మా.. ఏపి' సంతాపం 
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
 తెనాలి: సెప్టెంబర్ 28 : ప్రముఖ బ్రిటీష్  నటీ ఆస్కార్ గ్రహీత మాగ్ స్మిత్ (89) మృతిపట్ల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల యూనియన్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా 'మా ఎపి' వ్యవస్థాపక అధ్యక్షులు, సినీ దర్శకుడు దిలీప్ రాజా శనివారం పాత్రికేయులకు తెలిపారు. హ్యారీపోటర్ చిత్రంలో విశేష నటన చేసిన ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును తీసుకురావడమే కాకుండా రెండు సార్లు ఆస్కార్ అవార్డును, నాలుగు పర్యాయాలు బ్రిటిన్ 'ఎమ్మి' అవార్డులను సొంతం చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రపంచం లో అతికొద్ది నటీనటులు మాత్రమే ఈ గౌరవం దక్కించుకున్నారని ఆయన వివరించారు. 1956లోనే సినీకెరీర్ ను ప్రారంభించిన మాగ్ స్మిత్ షేక్స్పియర్ నాటకాల లోనూ, సినిమాలు, టీవీ షో లలో నటించారని దిలీప్ రాజా చెప్పారు. హ్యారీ పోటర్ ' భారతదేశంలో కూడా విడుదల కాగా అందులో ప్రొఫెసర్ మెక్ నాగల్ పాత్రలో ప్రపంచం దృష్టి తనవైపుకు మరలించిన ఆమె మృతి సినీ జగత్తుకి తీరనిలోటని ఆయన అన్నారు. మ్యాగ్ స్మిత్ ' కుటుంబ సభ్యులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులకు ప్రగాఢ సంతాపాన్ని 'మా_ఎపి' వ్యక్తం చేస్తుందని తెలిపారు