విజ్ఞాన్ యూనివర్సిటీని సందర్శించిన జింబాబ్వే ప్రతినిధులు

విజ్ఞాన్ యూనివర్సిటీని సందర్శించిన జింబాబ్వే ప్రతినిధులు 
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
చేబ్రోలు మండలం వడ్లమూడి లోని విజ్ఞాన్ యూనివర్సిటీని ఈరోజు జింబాబ్వే నుంచి ప్రభుత్వ ప్రతినిధులు అలాగే న్యూఢిల్లీ నుంచి ఎంబసీ ప్రతినిధులు విచ్చేసారని వర్సిటీ వైస్ చాన్సలర్ కల్నల్, ప్రొఫెసర్ పీ. నాగభూషణ్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇండియాలోని జింబాబ్వే ప్రతినిధి మాట్లాడుతూ క్రిత సంవత్సరం 45 మంది విద్యార్థులను జింబాబ్వే ప్రభుత్వం విజ్ఞాన్ యూనివర్సిటీలో వేర్వేరు ఇంజనీరింగ్ కోర్సెస్ లో చదవడానికి పంపించామన్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా 107 మంది విద్యార్థులను వేర్వేరు కోర్సుల కోసం ఇక్కడికి పంపించడం జరిగిందన్నారు. ముఖ్యంగా ఈ కోర్సెస్ లో అగ్రికల్చర్ బీఎస్సీ కి ప్రాముఖ్యతనిస్తూ జింబాబ్వే ప్రభుత్వం ఎక్కువ మంది స్టూడెంట్స్ ని ఈ కోర్సుకి ఎంపిక చేయడం జరిగిందన్నారు. క్రితం సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ మంది విద్యార్థులను పంపించడానికి గల కారణాలు వివరిస్తూ విజ్ఞాన్ యూనివర్సిటీలో చదువుతోపాటు మంచి నైపుణ్యాలు అలాగే కమ్యూనికేషన్స్ స్కిల్స్ మరియు మానవతా విలువలు నేర్పడం జరుగుతుందని  వివరించారు. ఈ కారణాలతో ఇంకా భవిష్యత్తులో ఎక్కువ మంది విద్యార్థిని విద్యార్థులను పంపించడానికి మార్గం సుగమం అయిందని సంతోషం వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య మాట్లాడుతూ జింబాబ్వేలో ఎక్కువగా వరి పంట పండించడానికి కావలసినటువంటి నైపుణ్యాలను విజ్ఞాన్ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి జింబాబ్వే విద్యార్థిని విద్యార్థులకు నేర్పించడం జరుగుతుందన్నారు. తద్వారా ఈ విద్యార్థిని విద్యార్థులు జింబాబ్వేకి తిరిగి వెళ్ళిన తర్వాత అక్కడ కమర్షియల్ క్రాప్ గా వరి పంటను అభివృద్ధి చేయడానికి కావలసినటువంటి మెలకువలను నేర్పించడం జరుగుతుందని వివరించారు.
విజ్ఞాన్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ రెండు దేశాల మధ్యన ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరచడానికి విద్యార్థులు కీలకంగా వ్యవహరిస్తారని తద్వారా జింబాబ్వే కూడా త్వరితగతిన అభివృద్ధి చెందేలాగా విజ్ఞాన్ లో చదివినటువంటి విద్యార్థులు కృషి చేస్తారని తెలియజేశారు. వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణం మాట్లాడుతూ జింబాబ్వే విద్యార్థిని విద్యార్థులు ఆ దేశానికి తిరిగి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలని అందజేసి వాళ్ళు నేర్చుకున్నటువంటి విద్యను ఎక్కువమంది పిల్లలకు నాలెడ్జ్ షేరింగ్ ద్వారా అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఎక్కువ తెలివితేటలున్నటువంటి విద్యార్థులని నాలెడ్జ్ క్రియేటర్స్ గా ప్రమోట్ చేయాలని దానికి కావలసినటువంటి వసతులు కల్పించాలని జింబాబ్వే ప్రతినిధులకు సూచించారు. 
ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ పీ. నాగభూషన్, రిజిస్టర్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, సీఈవో నందిగామ శ్రీకాంత్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు