విజ్ఞాన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు ఆహారం పంపిణీ

విజ్ఞాన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు ఆహారం పంపిణీ
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన యూనివర్సిటీ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలోని వరద ప్రభావిత కాలనీల్లో ఆహారం, బ్రెడ్, నిత్యవసర సరుకులు పంపిణీ చేశామని వర్సిటీ వైస్ చాన్సలర్ కల్నల్, ప్రొఫెసర్ పీ. నాగభూషణ్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్సిటీ వైస్ చాన్సలర్ మాట్లాడుతూ యూనివర్సిటీలోని 250 మంది ఎన్ఎస్ఎస్ విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి విజయవాడ సిటీ లోని చిన్ని నగర్, అజిత్ సింగ్ నగర్, వడ్డెర కాలనీ, పీన్టీ నగర్, వైఎస్ఆర్ కాలనీ, ఆంధ్రప్రభ కాలనీ, తోట వారి వీధి, సింగ్ నగర్ కాలనీలోని ప్రజలకు బ్రెడ్ ప్యాకెట్స్, రైస్ ప్యాకెట్స్, గుడ్లు, నిత్యవసర సరుకులు అందజేశారు. మరి కొంతమంది విద్యార్థులు తాడేపల్లి లోని పలు కాలనీలలో ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయ కార్యక్రమాల సర్వే లో పాల్గొన్నారు. కష్ట సమయంలో వరద బాధితులకు ప్రజలందరూ బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు. వరద సహాయక చర్యల సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులను విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వైస్ చాన్సలర్ కల్నల్ ప్రొఫెసర్ పి నాగభూషణ్, రిజిస్టార్ డాక్టర్ ఎమ్మెస్ రఘునాథన్, ఆయా విభాగాల డీన్స్, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.