విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకురాలికి పీహెచ్‌డీ

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకురాలికి పీహెచ్‌డీ
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్‌ విభాగానికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కేతేపల్లి గాయత్రికు తమ యూనివర్సిటీ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో పీహెచ్‌డీ పట్టా అందజేసిందని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మంగళవారం తెలియజేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ యాన్‌ ఎంపిరికల్‌ స్టడీ ఆన్‌ డీప్‌ లెర్నింగ్‌ బేస్డ్‌ ఎన్‌సెంబుల్‌ క్లాసిఫైర్స్‌ ఫర్‌ నెట్‌వర్క్‌ అనోమలీ డెటెక్షన్‌’’ అనే అంశంపై పరిశోధన చేసిందని తెలియజేసారు. ఈమెకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ విభాగంలోని మాజీ ప్రొఫెసర్‌ బీ.ప్రేమామయుడు గైడ్‌గా వ్యవహరించారు.  ఈమె తన పరిశోధనలో భాగంగా మొత్తం 1 ఎస్‌సీఐఈ పేపర్,  2 స్కూపస్‌ పబ్లికేషన్స్, 2 కాన్ఫరెన్స్‌ పేపర్లు పబ్లిష్‌ చేశారని వెల్లడించారు. పీహెచ్‌డీ పట్టాపొందిన కేతేపల్లి గాయత్రిను విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు.