సినిమా నిర్మాణం కోసం నిధుల సమీకరణ: మార్గాలు అంశంపై సాంకేతిక సదస్సు

సినిమా నిర్మాణం కోసం నిధుల సమీకరణ: మార్గాలు అంశంపై సాంకేతిక సదస్సు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
సెప్టెంబర్ 22, 2024, ప్రసాద్ ల్యాబ్స్, హైదరాబాద్
ఫిలిం బ్రాండింగ్, ఫిలిం సబ్సిడీ, క్రౌడ్ ఫండింగ్, బ్యాంకర్స్ సపోర్ట్, ప్రీ అగ్రిమెంట్ ఫండ్, ఏంజెల్ ఇన్వెస్టర్స్ సపోర్ట్... ఇలా 20 పద్దతులలో సినిమా నిర్మాణం కోసం పెట్టుబడులను సమకూర్చుకునే మార్గాలపై ప్రముఖ ఫిలిం బ్రాండింగ్ సంస్థ సినెటేరియా మీడియా వర్క్స్ సాంకేతిక సదస్సు ను ఈనెల 22వ తేదీన హైదరాబాద్ లో నిర్వహించనుంది.
ప్రముఖ కార్పోరేట్ కంపెనీల ఉన్నతాధికారులు, బ్యాంకింగ్ అడ్వైజర్లు, ఏంజెల్ ఇన్వెస్టర్లు, క్రౌడ్ ఫండింగ్ మేనేజ్మెంట్ కంపెనీలు ఈ సదస్సులో పాల్గొని, సినిమా నిర్మాణానికి సాంకేతికంగా నిధులను సమకూర్చుకునే అంశంపై దర్శక నిర్మాతలు, సొంతంగా సినిమాలు ప్రారంభించాలనే ఆసక్తి పరులతో సదస్సులో ముఖాముఖి చర్చాగోష్టిలో పాల్గొని, అతి ముఖ్యమైన సలహాలు, సూచనలను అందిస్తారు.
ఈ అత్యంత కీలకమైన సదస్సులో పాల్గొనదలచిన ఆసక్తిగల మరియు ఔత్సాహిక దర్శక నిర్మాతలు, సాంకేతిక నిపుణులు తమ పేర్లను ఈ నెల 18 వ తేదీలోగా నమోదు చేసుకోవచ్చు.
మరింత సమాచారం కోసం ఫోన్ నంబర్ 83416 89555 ద్వారా సంప్రదించవచ్చు.
సినెటేరియా మీడియా వర్క్స్ ఫిలిం నగర్, హైదరాబాద్