అక్కినేని చిత్రంతో పోస్టల్ స్టాంప్ విడుదల చేయండి


అక్కినేని చిత్రంతో పోస్టల్ స్టాంప్ విడుదల చేయండి
 - శతజయంతి వేడుకల్లో 'మా-ఎపి'తీర్మానo.
- భారతప్రభుత్వానికీ 'మా-  ఎపి' వినతి
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెనాలి, సెప్టెంబర్ 20 : అక్కినేని నాగేశ్వర రావు శతజయంతి సoదర్భంగా అయన చిత్రంతో పోస్టల్ స్టాంప్ ను భారత ప్రభుత్వం విడుదల చేయవలసిందిగా 'మా- ఎపి'  తీర్మానాన్ని ఆమోదించింది. రత్న ఫార్ట్యున్  కల్యాణ మండపంలో శుక్రవారం స్వర్గీయ అక్కినేని శతజయంతి వేడుకలు జరగాయి. సమావేశానికి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు, సినీ దర్శకుడు దిలీప్ రాజా అధ్యక్షత వహించారు. భారత ప్రభుత్వానికి ఆమోదించిన తీర్మానాన్ని పంపించినట్లుగా అయన తెలిపారు.నటిoచిన ప్రతి పాత్రకు ప్రాణం పోసిన మహానటుడు అక్కినేని నాగేశ్వరరావని ఆయన కొనియాడారు. నటనలో అక్కినేని ఒక విశ్వ విద్యాలయంగా ఆయన అభివర్ణించారు.తాగుబోతులను,ప్రేమలో  ఓడిపోయిన వ్యక్తులను దేవదాసుగా కొందరు నేటికీ సంభోధిస్తున్నారంటే ఆపాత్రలో అక్కినేని నటన ఎవరెస్ట్ అంత ఎత్తులోను,మహాసముద్రమంత వైశాల్యంలో ఉండటo జగమెరిగిన సత్యమని ఆయన
పేర్కొన్నారు.దేవదాసు,ప్రేమాభిషేకం,మాయాబజార్,మేఘసందేశం సినిమాలు తెలుగు చలనచిత్ర సీమలో చెరగని ఆస్తి అన్నారు.ప్రముఖ పారిశ్రామికవేత్త కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తన పర్సనాలిటీకి తగిన పాత్రలనే  ఎoపిక చేసుకొని ఆయా పాత్రలకు నూరుశాతం న్యాయం చేసినందువలనే పద్మశ్రీ,పద్మవిభూషణ్,దాదాసాహెబ్ ఫాల్కే,పద్మభూషణ్ అవార్డులు అక్కినేనిని వరించాయని చెప్పారు.కార్యక్రమములో దర్శకుడు రత్నాకర్, నటుడు వెలగా సుభాష్ చంద్రబోస్, మిలటరీ ప్రసాద్,రావూరి సురేష్ బాబు, బెల్లంకొండ వెంకట్, కొండముది జయకర్,శ్రీకాంత్, డాక్టర్ భూషణం,రమణయ్య,బసవయ్య తదితరులు పాల్గోన్నారు.ముందుగా అక్కినేని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.