ఆరుగురు ఎమ్మెల్యేలు నటిస్తున్న జగజ్జీవన్ రామ్ సినిమా - దర్శకుడు దిలీప్ రాజా టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: తెనాలి, అక్టోబర్ 30: జమైక దేశంలో డాక్టర్ వృత్తిలో కొనసాగుతున్న డాక్టర్ చందోలు నాగమల్లేశ్వర రావు నిర్మిస్తున్న జగజ్జీవన్ రామ్ బయోపిక్ లో ఆరుగురు శాసన సభ్యులు నటిస్తున్నట్లుగా ఆచిత్ర దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు.గుంటూరుజిల్లా తెనాలిలోని 'మా - ఏపీ' కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నవంబరు 9 నుంచి తెనాలిలో రెగ్యులర్ షూటింగ్ జరుగుతోందన్నారు.స్వాతంత్రోద్యమంలో జగజ్జీవన్ రామ్ రెండు పర్యాయాలు బ్రిటిష్ చెరసాలకు వెళ్లిన నేపధ్యంలో స్వాతంత్రోద్యమoలోని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు .ఇందులో భాగంగానే భగత్ సింగ్ పాత్రలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు,చంద్రశేఖర్ ఆజాద్ గా పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర,బ్రిటీష్ గవర్నర్ జనరల్ గా చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్,ఎమ్మెల్యేలు వర్ల కుమార్ రాజా,దస్తగిరి,జయసూర్యలు వివిధ పాత్రలు పోషిస్తున్...