సినిమావారిని విమర్శించడమే రాజకీయమా?

సినిమావారిని విమర్శించడమే రాజకీయమా? 
- మా ఎపి' వ్యవస్థాపక అధ్యక్షుడు  దిలీప్ రాజా
సమావేశం లోమాట్లాడుతున్న దిలీవ్ రాజా
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
 అక్టోబర్ 4: సినీ నటీనటులను విమర్శించడమే రాజకీయమైతే ఆయా పార్టీల మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికల బరిలోకి రావలసిందిగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ఆంధ్ర ప్రదేశ్ 24 క్రాఫ్ట్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు, సినీదర్శకుడు దిలీప్ రాజా సూచించారు. సినిమావాల్లంటే ఎంతో చులకన భావం ఉండటం వలనే వ్యక్తిగత జీవితలపై కామెంట్స్ చేస్తున్నారని ఆయన అన్నారు. గుంటూరు జిల్లా, తెనాలి లోని మా ఎపి కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన వివేకరుల సమావేశంలో మాట్లాడుతూ బహుభాషా హీరోయిన్ విడాకులపై పొలిటీషియన్ చేసిన వ్యాఖ్యలు చూశాక మంచి భాషలో మాట్లాడటానికి నోరుని ఎంతో అదుపులో ఉంచుకోవాల్సి వచ్చిందన్నారు. మీకు మీకు రాజకీయ విభేదాలుంటే ఆయా విధి విధానాలపై విమర్శలు చేయాలి గానీ సెటైర్లు వేయడానికి కాదన్నారు. సినిమా వారి మనోభావాలు దెబ్బతినే లా ఎవరు మాట్లాడినా సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఇల్లు కాల్చిన తర్వాత తప్పయి పోయింది వెనక్కి తీసుకుంటున్నా అంటే ఎలా సరిపోతుందని ఆయన ప్రశ్నించారు.
ప్రజలు ఓట్ల తో గెలిపించేది నిరుద్యోగాన్ని పారద్రోలటానికి ప్రజాశ్రేయస్సుకోసం అని చెప్పారు. వీలైతే పేదోడికి విద్య వైద్యం ఉచితంగా అందించడానికి,రహదారులు సక్రమంగా వుంచడానికి కానీ సినిమా నటుల వ్యక్తిగత జీవితాలపై బురదజల్లడానికి కాదని దిలీప్ రాజ హితవు పలికారు. ఉన్నత న్యాయ స్థానం ఇచ్చిన విడాకుల తీర్పుపై విపరీత వ్యాఖ్యలు చేయడమంటే న్యాయస్థానాలను అగౌరవపరచినట్లే అని ఆయన చెప్పారు. గతంలో తమిళనాడులోని ఒక రాజకీయ నాయకుడు నటి త్రిష పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని  రేపిందని దర్శకుడు కనపర్తి రత్నాకర్ గుర్తు చేశారు. సహజంగా సినిమా వాళ్ళెవరూ రాజకీయనాయకులను విమర్శించరని అలాంటి నేపధ్యంలో సినిమావాళ్ళ స్య్వక్తిగత జీవితాలకు ఇబ్బందులు కలిగేలా రాజకీయ నాయకులు మాట్లాడటం ఎంత వరకు సముచితమని నటుడు మిలటరీ ప్రసాద్, వేమూరి విజయభాస్కర్ లు అన్నారు.సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ మురళీకృష్ణ, సహాయ దర్శకులు ఇంటూరి విజయ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు