విజ్ఞాన్స్ యూనివర్సిటీ అధ్యాపకుడికి పీహెచ్‌డీ
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని ఈసీఈ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ కొమ్మోజు లోవరాజు అనే అధ్యాపకుడికి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో తమ యూనివర్సిటీ పీహెచ్‌డీ పట్టా అందించిందని వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యాన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ బేస్డ్ క్లౌడ్ ఎనేబుల్డ్ సర్వీస్ ఫర్ స్మార్ట్ అగ్రికల్చర్ మోనిటరింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ సిస్టమ్’’ అనే అంశంపై ఆయన పరిశోధన చేశారని తెలియజేశారు. ఈయనకు విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని ఈసీఈ డిపార్ట్‌మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్, అసోసియట్ డీన్–ఏఏఏ డాక్టర్ వి. విజయరాఘవన్ గైడ్‌గా వ్యవహరించారని పేర్కొన్నారు. పీహెచ్‌డీ పట్టా పొందిన కొమ్మోజు లోవరాజును వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది అభినందించారు.