ఆరుగురు ఎమ్మెల్యేలు నటిస్తున్న జగజ్జీవన్ రామ్ సినిమా
- దర్శకుడు దిలీప్ రాజా
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెనాలి, అక్టోబర్ 30: జమైక దేశంలో డాక్టర్ వృత్తిలో కొనసాగుతున్న డాక్టర్ చందోలు నాగమల్లేశ్వర రావు నిర్మిస్తున్న జగజ్జీవన్ రామ్ బయోపిక్ లో ఆరుగురు శాసన సభ్యులు నటిస్తున్నట్లుగా ఆచిత్ర దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు.గుంటూరుజిల్లా తెనాలిలోని 'మా - ఏపీ' కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నవంబరు 9 నుంచి తెనాలిలో రెగ్యులర్ షూటింగ్ జరుగుతోందన్నారు.స్వాతంత్రోద్యమంలో జగజ్జీవన్ రామ్ రెండు పర్యాయాలు బ్రిటిష్ చెరసాలకు వెళ్లిన నేపధ్యంలో స్వాతంత్రోద్యమoలోని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు .ఇందులో భాగంగానే భగత్ సింగ్ పాత్రలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు,చంద్రశేఖర్ ఆజాద్ గా పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర,బ్రిటీష్ గవర్నర్ జనరల్ గా చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్,ఎమ్మెల్యేలు వర్ల కుమార్ రాజా,దస్తగిరి,జయసూర్యలు వివిధ పాత్రలు పోషిస్తున్నారని దర్శకుడు దిలీప్ రాజా తెలిపా రు.వంద సంవత్సరాల క్రితం జరిగిన యదార్ధ సంఘటనలను చిత్రీకరించడానికి నిర్మాణ సమయం,వ్యయం ఎక్కువ అయిందని ఆయన వివరించారు.టైటిల్ పాత్రలో మిలటరీ ప్రసాద్, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ పాత్రలో సీనియర్ నటి తాళ్లూరి రామేశ్వరి, కన్నడ నటుడు మర్కాలి, జీవ, నరసింహ రాజు, అన్నపూర్ణ, కావ్య కీర్తి,దివిజ, పద్మిని, రజియ,ఎర్రబాబు,భాను, హరిబాబు తదితరులు నటవర్గమని దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు.కాగా ఇప్పటికే జగజ్జీవన్ రామ్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆంధ్ర ప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్,ఎమ్మార్పీస్ నేత మందా కృష్ణ ,రాజ్యసభ మాజీ సభ్యులు మోపిదేవి వెంకట రమణ రావు,బీజేపీ నేత యడ్లపాటి రఘునాథ్ బాబు,ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు,మాజీమంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లు పబ్లిసిటీ పోస్టర్‌ను పరిశీలించారని దర్శకుడు దిలీప్ రాజా చెప్పారు.పెదరావురు ఫిలిం స్టూడియో పతాకంపై చందోలు దేవదాసు సమర్పణలో ఎన్నారై డాక్టర్ నాగ మల్లేశ్వర రావు నిర్మాతగా తెనాలిలో రూపొందుతున్న జగజ్జీవన్ రామ్ సినిమాకు కో-ఆర్డినేటర్ కాలేబ్ రాజు కాగా కథ,మాటలు, స్క్రీన్ ప్లే,దర్శకత్వం దిలీప్ రాజా .పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల అనంతరం 2025 లో సినిమాను తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషలతో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని యూనిట్ కంట్రోలర్ ప్రదీప్ దోనేపూడి తేలిపారు.