పాలిమర్‌ల సాయంతో పర్యావరణ కాలుష్యం తగ్గించవచ్చు - పూణెలోని సోమయ్య విద్యావిహార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సీ.వీ.అవధాని - విజ్ఞాన్స్ వర్సిటీలో ఘనంగా ప్రారంభమైన జాతీయస్థాయి కాన్ఫరెన్స్ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: జీవశక్తితో సులభంగా కరిగే పాలిమర్‌లను అభివృద్ధి చేయడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చునని పూణెలోని సోమయ్య విద్యావిహార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సీ.వీ.అవధాని పేర్కొన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ అప్లైడ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సెర్బ్ ఇండియా ఏఎన్‌ఆర్‌ఎఫ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ‘‘ ఫ్రాంటియర్స్ ఇన్ పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎన్‌సీఎఫ్‌పీఎస్‌టీ–2024)’’ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయస్థాయి కాన్ఫరెన్స్‌ను గురువారం వైభవంగా ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన నిర్వహించి కాన్ఫరెన్స్‌కు సంబంధించిన ప్రొసీడింగ్స్ బ్రౌచర్‌ను ముఖ్య అతిథులు ఘనంగా ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పూణెలోని సోమయ్య...