డిసెంబర్ 16న విజ్ఞాన్స్‌లో ఇంటర్నేషనల్ వర్క్‌షాప్
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో డిసెంబర్ 16 నుంచి 23 వరకు ఇంటర్నేషనల్ వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వైస్ చాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వర్క్‌షాప్‌కు సంబంధించిన బ్రౌచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైస్ చాన్స్‌లర్ మాట్లాడుతూ వర్సిటీలోని స్కూల్ ఆఫ్ అప్లైడ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగంలోని డిపార్ట్‌మెంట్ మేథమేటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఈసీఈల సంయుక్త ఆధ్వర్యంలో ‘‘ ఇన్నోవేషన్స్ ఇన్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్ అండ్ మోడెలింగ్ (ఐఎంఎల్‌ఏఐడీఎస్‌ఎం–24)’’ అనే అంశంపై హైబ్రిడ్ మోడ్‌లో ఇంటర్నేషనల్ వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్‌హమ్ డాక్టర్ వాసిర్ రహమాన్, యూఎస్‌ఏలోని యూనివర్సిటీ ఆఫ్ సౌత్‌ఫ్లోరిడా ప్రొఫెసర్ భువనేష్ యున్హేల్కర్, కొరియాలోని క్యుంగ్‌పోక్ నేషనల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రామ్మోహన్ మలిపెద్ది, లెబనాన్‌లోని లెబనీస్ అమెరికన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జుల్కర్‌నేన్ సబీర్, ఎన్‌ఐటీ దుర్గాపూర్ ప్రొఫెసర్ సమర్జిత్ కర్, ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ సీఎస్ శాస్త్రి, ఆర్కిటిక్ యూనివర్సిటీ ఆఫ్ నార్వే డాక్టర్ ఆరిఫ్ అహ్మద్ షేక్, ఐఐటీ ఖరగ్‌పూర్ డాక్టర్ దేబశ్రీ గుహ ఆధ్య, ఎన్‌ఐటీ సిల్చార్ డాక్టర్ రాజేష్ సాహ, ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్ నీలాద్రి ఛటర్జీ విచ్చేస్తున్నారని వెల్లడించారు. బ్రౌచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వర్సిటీ వైస్ చాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.