షారోన్ అంతర్జాతీయ అవార్డు నా భాధ్యతను పెంచింది
- అవార్డు గ్రహీత డాక్టర్ యశోధర పువ్వాడ
ప్రముఖ స్వచ్ఛంద సేవకురాలు షారోన్ పేరిట షారోన్ అంతర్జాతీయ అవార్డును తీసుకోవడం వలన డాక్టర్ గా సేవాగుణాన్ని మెరుగు పరచుకునే భాద్యతను పెంచిందని అవార్డు గ్రహీత డాక్టర్ యశోధర పువ్వాడ అన్నారు. బుర్రిపాలెం రోడ్ లోని డాక్టర్ యస్' సమావేశ మందిరంలో గురువారం జరిగిన ప్రతిష్టాత్మకమైన ఫారోన్ అంతర్జాతీయ అవార్డు ప్రధానోత్సవ వేడుకలును పెన్నీ మినిస్ట్రీస్ స్వచ్ఛంధ సంస్థ డైరెక్టర్ ప్రదీప్ దోనపూడి నిర్వహించారు. సమావేశానికి సినీ దర్శకుడు, పెన్నీ మినిస్ట్రీస్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు దిలీప్ రాజ అధ్యక్షత వహించారు. ఆఫ్రికన్ దేశాల్లో సేవా రంగం లో ఘనకీర్తి సంపాదించిన షారోన్ పేరిట అవార్డు అందుకోవడం పూర్వజన్మ సుకృతమని డాక్టర్ యశోధర చెప్పారు. పేద ప్రజలకు సేవలందిస్తూ డాక్టర్ గా ముందుకు కొనసాగుతానని ఆమె ప్రకటించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి అద్యక్షలు డాక్టర్ కె. అనిల్ కుమార్ మాట్లాడుతూ వెనుకబడిన దేశాల్లో డాక్టర్ షారోన్ చేసిన సేవల స్ఫూర్తి తో యశోధర వైద్య సేవలు అందించాలని ఆకాక్షించారు. శారద సోషల్ సర్వీస్ నిర్వాహకురాలు డాక్టర్ శారద మాట్లాడుతూ వైద్యరంగం పెట్టుబడి రంగంగా మారిన ఈరోజుల్లో కొంతమంది వైద్యులు సేవాభావంతో పని చేస్తూ ప్రజల మనసులోని నిలిచిపోతారని ఆ కోవకు చెందిన డాక్టర్ యశోధర అని అన్నారు. మునిసిపల్ ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హెవెన్ నిర్మల, దళిత విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ అచార్య గుజ్జర్ల మూడి కృపాచారి, ఇన్కమ్ ట్యాక్స్ మాజీ డిప్యూటీ కమిషనర్ మధు బాబు, గాంధీ ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి, రోటరీ క్లబ్ ఇంటర్ క్లబ్స్ రిలేషన్స్ జోనల్ ఛైర్మన్ ఈదర పూర్ణ చంద్, సినీ దర్శకుడు శ్రీనివాస్ యాదవ్, సినీ నటుడు విజయ భాస్కర్, బెల్లంకొండ వెంకట్, గ్యాస్ డీలర్స్ అసోసియేషన్ రమణ, డాక్టర్ యశోధర ను పూల మాలలు, శాలువాలతో సత్కరించారు. దిలీప్ రాజ ప్రత్యేక జ్ఞాపిక, మెడల్ అందజేశారు. దర్శకుడు రత్నాకర్ కనపర్తి స్వాగతం పలకగా మునిపల్లి శ్రీకాంత్, నరేష్, మణి కుమార్, నరేష్, వెంకి రావణ్, హాజిలు వందన సమర్పణ చేశారు.