పెంపుడు కుక్కకు పెద్ద ఖర్మ !
తెనాలి,నవంబర్ 25: సాధరణంగా మరణించిన మనుషులకు పెద్దఖర్మలు చేయడం పరిపాటి.కానీ పెంపుడు కుక్కకు పెద్దఖర్మ చేయడం ఆసాధారణమే. కాగా
గుంటూరు జిల్లా తెనాలిలో సోమవారం జరిగింది.పైగా పెంపుడు కుక్క జ్ఞాపకార్ధo నిరుపేదలకు భోజనం పెట్టి నిత్యావసరాలను పంపిణి చేయడం చూస్తుంటే ఆ పెంపుడు కుక్కపై యజమాని మనసులో ఎంతస్థానం ఉంటుందో స్పష్టమవుతుంది.ఇంతకు ఆ పెంపుడు కుక్క యాజమని వేరెవ్వరో కాదు,తెనాలికి చెందిన సినీ దర్శకుడు దిలీప్ రాజా.ఎవరైనా కుక్క అని పిలిస్తే ఆయన ఊరుకోరు." వాడి పేరు బెట్టిబాబు..కుక్క అని పిలవకండి అంటూ కొంత అసహనాన్ని అయన వ్యక్తం చేస్తుoటారు." వాడు పుట్టినప్పటినుండి మరణం వరకు నన్నెంతో ప్రేమించాడు.నాకు జ్వరం వస్తే అన్నం తినేవాడు కాదని చెపుతూ కన్నీటి పర్యంతం అ య్యారు దిలీప్ రాజా .కుక్కలు విశ్వాసంగా ఉంటాయంటారు.కానీ జీవితంలో తన పెంపుడు కుక్క బెట్టిబాబు ఒకభాగం కాబట్టే మృతదేహాన్ని పారవేయకుండా ఆచార సంప్రదాయాలతో సొంత స్థలంలోనే అంత్యక్రియలను నిర్వహించినట్లు దిలీప్ రాజా తెలిపారు.దానికో సమాధిని కుడా ఏర్పటుచేస్తానని ఆయన అన్నారు. కాగా సమీపంలోని కుక్కలన్నిటికీ భోజనాలు పెట్టు పెంపుడు కుక్కపై వున్న ప్రేమను చాటారు.