Skip to main content

Posts

Showing posts from December, 2024

నటన,దర్శకత్వం నాకు రెండు కళ్ళు

నటన,దర్శకత్వం నాకు రెండు కళ్ళు  - సినీ, టీవీ, రంగస్థల నటి, దర్శకురాలు డా.శ్రీజ సాదినేని టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: నాటకరంగంలో బాలనటిగా అడుగుపెట్టి, వందల నాటకాలు , వేల ప్రదర్శనలు ఇస్తూ, కళా ప్రస్థానం  కొనసాగిస్తూ, నటిగా, రచయిత్రిగా, దర్శకురాలిగా అవార్డులు, రికార్డులు సాధించడం అదృష్టమని, ఇదంతా నటరాజు ఆశీర్వాదమని, నటన, దర్శకత్వం నాకు రెండు కళ్ళు అని సినీ, నాటక నటి, రచయిత్రి, దర్శకురాలు డా.శ్రీజ సాదినేని అన్నారు. డిసెంబర్ 30, సోమవారం నాడు తమ సొంత సంస్థ శ్రీ జయా ఆర్ట్స్ ఇరవై ఒకటవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు శ్రీజ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ " నాటకరంగం మీద మమకారంతో 2003 డిసెంబర్ 30 న శ్రీ జయా ఆర్ట్స్ సాంస్కృతిక సంస్థను స్థాపించి తన స్వీయ నిర్మాణ దర్శకత్వంలో 33 తెలుగు నాటిక, నాటకాలు రూపొందించిన శ్రీజ కళారంగ ప్రయాణంలో ఎదురైన సవాళ్ళను, సమస్యలను ఎంతో ధైర్యంగా అధిగమించి ఇప్పటి వరకూ రెండు వేల మందికి పైగా విద్యార్థులకు నటనలో శిక్షణ ఇచ్చి నాటక, టీవీ, సినీ రంగాలలో అవకాశాలు కల్పించినందుకు ఎంతో గర్వంగా ఉంది" అని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆటుపోట్లను అధిగమించి అత్యంత క...

షీరో హోమ్ ఫుడ్ కి రతన్ టాటా పురస్కారం

షీరో హోమ్ ఫుడ్ కి రతన్ టాటా పురస్కారం టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: మహిళలు తాము చేసిన ఇంటి వంటకాలు ఆన్ లైన్ ద్వారా అమ్మకాలు జరిపి ఇంటినుండి స్వయం ఉపాధి పొందేలా వందలాది మహిళలకు ఉచిత శిక్షణ అందించి జీవితంలో స్థిరపడేలా తీర్చి దిద్దిన షీరో హోమ్ ఫుడ్ సంస్థకు రతన్ టాటా పురస్కారం లభించింది.రతన్ టాటా జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఈఫిల్ లైఫ్ సొసైటీ నిర్వహించిన ఈ కార్యక్రమం లో మహిళా సాధికారికతా విభాగంలో షీరో సంస్థ కోఆర్డినేటర్ వీస్ విజయ్ వర్మ పాకలపాటి కి ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ దేవులపల్లి అమర్ ఈ పురస్కారాన్ని అందజేశారు.తమని ఎంపిక చేసిన ఈఫిల్ సొసైటీ అధ్యక్షులు శివరాం కి కృతఙ్ఞతలు తెలిపిన విజయ్ వర్మ మాట్లాడుతూ ఇప్పటికే తమ సంస్థ ద్వారా 300 పైబడి మహిళలు ఉపాధి పొందుతున్నారని, దక్షిణాది ఉత్తరాది రుచుల ఉచిత శిక్షణలో పాల్గొని షీరో ద్వారా ఉపాధి పొందగోరు గృహిణులు 6309527444 నెంబర్ లో సంప్రదించవచ్చని తెలియజేసారు

ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు లో "ఆరుద్ర సభా వేదికపై మెరిసిన ఆదిత్య రమ

- విజయవాడ లో 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు లో  "ఆరుద్ర సభా  వేదిక" పై  మెరిసిన ఆదిత్య రమ టాలెంట్ ఎక్స్ ప్రెస్: రాజమహేంద్రవరం స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్,రాజమండ్రి మొల్ల  డా.బి హెచ్.వి.రమాదేవి విజయవాడ  వన్ టౌన్ కె .బి.ఎన్.కాలేజి లో జరిగిన 6వ ప్రపంచ రచయితల మహాసభ లో *ఆరుద్ర సభావేదిక* పై  *యువత  కొరకు  అనేక ప్రక్రియలపై   ఎలాంటి మార్పు రావాలి!?* అనే అంశంపై ఆమె ప్రసంగించారు.చక్కని ప్రసంగం చేసి ,సీసపద్యం అశువుగా చెప్పినందుకు  పలువురు అభినందించారు. డి.ఎన్.ఏ ఛానల్ వారు వాయిస్ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భం గా ఆదిత్య అధినేత  ఛైర్మన్ డా.నల్లమిల్లి శేషారెడ్డి, ఆదిత్య  విద్యా సంస్థల  డైరెక్టర్ డా.ఎన్. సుగుణా రెడ్డి, రాజమండ్రి విద్యాసంస్థల డైరెక్టర్  ఎస్.పి.గంగిరెడ్డి, ప్రిన్సిపాల్స్  సి హెచ్. ఫణి కుమార్, ఎస్. కె.ఎన్.రెహ్మాన్,   చంద్రశేఖర్, రామకృష్ణ లు,అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు.ఆదిత్య ఎన్.. ఎస్ . ఎస్. డీన్  డా.జి.వి. ఎస్.నాగేశ్వర రావు  మాట్లాడుతూ ,డా.రమ...

ఇకపై ఆంధ్రలో సినిమా షూటింగ్ లు పెరుగుతాయి..

ఇకపై ఆంధ్రలో సినిమా షూటింగ్ లు పెరుగుతాయి !  — మా ఎపి వ్యవస్థాపక అధ్యక్షుడు దిలీప్ రాజ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:  నటుడు అల్లు అర్జునపై తెలంగాణా ప్రభుత్వ పనితీరు వల్ల ఇకపై ఆంధ్రలో సినిమా షూటింగ్లు పెరగటానికి దోహదం చేశాయని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల యూనియన్ (మా_ఎపి) వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీ దర్శకుడు దిలీప్ రాజూ చెప్పారు. గుంటూరు జిల్లా తెనాలి లోని మా_ఎపి కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  అల్లు అర్జున్ యాక్టర్ పై ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల యావత్తు సినీపరిశ్రమ సంఘటితమై నిరసన వ్యక్తం చేసిందన్నారు. దీంతో సినీపరిశ్రమను తెలంగాణా ప్రభుత్వం అణగదొక్కుతుందనే ప్రచారం జరిగిందని తెలిపారు. పైగా ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఇటీవల సినీ నిర్మాతలు ఆంధ్రలో షూటింగ్లు యదేచ్ఛగా జరుపుకోవడానికి స్వయంగా ఆహ్వానం పలికారు . సినీ నటుడైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలో ఎపిలో సినీపరిశ్రమ తరలి వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని దిలీప్ రాజా పేర్కొన్నారు. తెలంగాణాలోని సినిమా పెద్దల్లో ...

జనవరి 30న విజ్ఞాన్‌ ఫార్మసీలో అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌

జనవరి 30న విజ్ఞాన్‌ ఫార్మసీలో అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలలో జనవరి 30 నుంచి మూడు రోజుల పాటు అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీ.శ్రీనివాస బాబు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌కు సంబంధించిన బ్రౌచర్‌ను విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీ.శ్రీనివాస బాబు మాట్లాడుతూ  ‘‘ఎమర్జింగ్‌ ట్రెండ్స్‌ ఇన్‌ పర్సనలైజ్డ్‌ డ్రగ్‌ డిస్కవరీస్‌– ఏ ఫ్యూచరిస్టిక్‌ అప్రోచ్‌’’ అనే అంశంపై మూడు రోజుల పాటు ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ను ‘‘ నెక్ట్స్‌జెన్‌ ఫార్మా కనెక్ట్‌–2025’’ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నామని తెలియజేసారు. ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మొదటి రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌ డాక్టర్‌ మోంటుకుమార్‌ ఎం.పటేల్, గౌరవ అతిథులుగా ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌ మెంబర్, న్యూఢిల్లీలోని పీసీఐ సెంట్రల్‌ కౌన్సిల్‌ మెంబర్‌ డాక్టర్‌ ఎ...

భారతీయ జర్నలిజం ధృవతార మానికొండ చలపతిరావు పుస్తకావిష్కణ

భారతీయ జర్నలిజం ధృవతార మానికొండ చలపతిరావు పుస్తకావిష్కణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: భారతీయ జర్నలిజంలో ధృవతారగా వెలిగిన మానికొండ చలపతిరావు భావితరాలకు మార్గదర్శి అని మేఘాలయ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కొట్టు శేఖర్ కొనియాడారు. అత్యున్నత వృత్తి ప్రమాణాలకు, నైతిక విలువలకు ఆయన పెట్టింది పేరని కీర్తించారు. అటువంటి మహనీయునిపై తెలుగులో వచ్చిన ఏకైక సంకలం బహుశా ఇదేనని అన్నారు. భారతీయ జర్నలిజం ధృవతార మానికొండ చలపతిరావు పేరిట సీనియర్ జర్నలిస్టు ఆకుల అమరయ్య రాసిన పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. మిరియాల వెంకట్రావ్ ఫౌండేషన్ ప్రచురించిన ఈ పుస్తకావిష్కరణ సభ హైదరాబాద్ యూసూఫ్ గూడలోని మహమ్మద్ ఫంక్షన్ హాలులో జరిగింది. ఈ సభకు సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి అధ్యక్షత వహించారు.  ఈ సందర్భంగా పలువురు వక్తలు మానికొండ చలపతిరావు జర్నలిజం వృత్తి ప్రమాణాలతో పాటు జర్నలిస్టుల జీవన స్థితిగతుల మెరుగుదలకు చేసిన అపార కృషిని వివరించారు. జర్నలిస్టులకు ఇవాళ అంతో ఇంతో వృత్తిపరమైన భద్రత, వేజ్ బోర్డు, ప్రెస్ కౌన్సిల్ వచ్చిందంటే అది మానికొండ చలపతిరావు ఆనాడు చేసిన పోరాట ఫలితమేనని చెప్పారు. భారత తొలిప్రధాని ...

Happy birthday wishes

Happy birthday wishes

చిత్ర నిర్మాణాలను ఏపీ ఎఫ్ డి సి ప్రోత్సహిస్తుంది

చిత్ర నిర్మాణాలను ఏపీ ఎఫ్ డి సి ప్రోత్సహిస్తుంది _ మేనేజర్ శ్రీనివాస్ నాయక్ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: విజయవాడ : శ్రీ కృష్ణ ఆర్ట్స్  బ్యానర్ పై డాక్టర్ రావిపాటి వీరనారాయణ సమర్పణలో, అమిరినేని వెంకట్ ప్రసాద్, సాదు చలపతి, కన్నెగంటి రవి, అనిల్ మూకిరిలు  నిర్మాతలుగా సీనియర్ జర్నలిస్ట్, వరల్డ్ రికార్డు హోల్డర్ కనిపర్తి రత్నాకర్ దర్శకత్వం వహిస్తున్న  శిశిరం చిత్రం ఆడియో సిడిని ఏపీ ఎఫ్ డి సి మేనేజర్ శ్రీనివాస్ నాయక్  ఆవిష్కరించారు. విజయవాడ ఎఫ్ డీ సి కార్యాలయంలో బుధవారం  సీడీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భం గా శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లో సినీ నిర్మాణాలను ఎఫ్ డి సి ప్రోత్సహిస్తుందన్నారు. రాష్ట్రం లో ఏ ప్రదేశం లో నైనా ఉచితంగా షూటింగ్ నిమిత్తం లోకేషన్ల కు ఉచితం గా అనుమతులు ఇస్తుందన్నారు. చిత్ర నిర్మాణం పూర్తిగా ఆంధ్ర ప్రదేశ్ లో జరిగితే పది లక్షలు సబ్సిడీ అందించి చిత్ర నిర్మాణాలను సులభతరం చేస్తుందన్నారు. సింగిల్ విండో పద్ధతిలో బ్యానర్, టైటిల్, లోకేషన్ల అ...

సాయం చెయ్యడంలోనే నిజమైన క్రిస్మస్

సాయం చెయ్యడంలోనే నిజమైన  క్రిస్మస్   - సినీ దర్శకుడు దిలీప్ రాజా   టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: పేదలకు ఇవ్వడంలోనే నిజమైన క్రిస్మస్ ఉందని సినీ దర్శకుడు,పెన్నీ మినిస్ట్రీస్ స్వచ్ఛంద సేవాసంస్థ వ్యవస్థాపకులు దిలీప్ రాజా అన్నారు. పెదరావూరు గ్రామంలోని పెన్నీ మినిస్ట్రీస్ స్వచ్ఛంద సేవాసంస్థలో వితంతువులకోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.సమావేశానికి సంస్ధ డైరెక్టర్ ప్రదీప్ దోనేపూడి అద్యక్షత వహించారు. వృద్ధాప్యంలో ఉన్న జన్మనిచ్చిన తల్లితండ్రులను ఆదరించడంలో బిడ్డగా రుణం తీర్చుకున్నట్లు అవుతుందని దిలీప్ రాజా అభిప్రాయం వ్యక్తం చేశారు.క్రిస్టమస్ రోజుల్లో క్రీస్తు బోధనలను మానవాళి ఆచరించడం ఎoతగానో అవసరం అన్నారు. ప్రపంచ యుద్ధాలను నివారించే శక్తి క్రీస్తుచూపిన ప్రేమ మార్గంలో ఉందని ఆయన పేర్కొన్నారు.ఈసందర్భంగా వితంతువులకు ఆయన నూతన వస్త్రాలను,నిత్యావసరాలను పంపిణి చేశారు .కార్యక్రమములో సహాయ దర్శకులు నరేష్ దోనె, మణి చింతా,తదితరులు పాల్గొన్నారు.                 

రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధే లక్ష్యం

రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధే లక్ష్యం - రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్, ఏపీ ప్రభుత్వ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ కోఆపరేషన్‌ అడ్వైజర్, మాజీ ఐఏఎస్‌ టీ.విజయ్‌ కుమార్‌ - విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సు టాలెంట్ ఎక్స్ ప్రెస్: రైతు సాధికార సంస్థ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి, మరియు జీవనోపాధి మెరుగుదలకు కృషి చేయడమే లక్ష్యమని రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్, ఏపీ ప్రభుత్వ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ కోఆపరేషన్‌ అడ్వైజర్, మాజీ ఐఏఎస్‌ టీ.విజయ్‌ కుమార్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫుడ్‌ టెక్నాలజీ విభాగంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ అండ్‌ హార్టికల్చరల్‌ సైన్సెస్, అపారి ( ఆసియా–పసిఫిక్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ ఇనిస్టిట్యూట్స్‌) మరియు యూరోపియన్‌ ప్లాంట్‌ హెల్త్‌ రీసెర్చ్‌ అండ్‌ కోఆర్డినేషన్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ‘‘ ప్లాంట్‌ హెల్త్‌ ఇన్‌ ఆసియా : రీసెర్చ్‌ ప్రయారిటీస్‌ అండ్‌ ప...

వరలక్ష్మి శరత్ కుమార్ పాన్-ఇండియా చిత్రం

* వరలక్ష్మి శరత్ కుమార్ పాన్-ఇండియా చిత్రం * *"అర్జునుడి గీతోపదేశం"* టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: *చిత్రానికి "సినెటేరియా మీడియా వర్క్స్"  బ్రాండింగ్* ఫస్ట్ కట్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానరుపై ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలో వెలిచెర్ల ప్రదీప్ రెడ్డి, త్రిలోక్ నాథ్ కలిశెట్టి నిర్మిస్తున్న పాన్-ఇండియా చిత్రం "అర్జునుడి గీతోపదేశం" చిత్రానికి ప్రముఖ ఫిలిం బ్రాండింగ్ సంస్థ సినెటేరియా మీడియా వర్క్స్ ఇన్-ఫిలిం బ్రాండింగ్, పోస్ట్ ఫిలిం బ్రాండింగ్, ప్రొమోషన్ ఫిలిం బ్రాండింగ్ సర్వీసులను అందిస్తోంది. సతీష్ గోగడ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రాజీవ్ సాలూరి, అఖిల్ రాజ్, ఆదిత్య శశికుమార్, సదన్, దివిజ ప్రభాకర్, మౌనిక, కల్పన, వసంతిక మచ్చ, బద్రం తదితరులు నటిస్తున్నారు. సంగీతం: చరణ్ అర్జున్, సినెమాటోగ్రఫీ: చైతన్య కందుల. ఇటీవలే హైదరాబాద్ లో షూటింగ్ ప్రారంభించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషలలో రూపుదిద్దుకుంటోంది.  *సినెటేరియా మీడియా వర్క్స్* ఫిలిం నగర్, జూబిలీ హిల్స్, హైదరాబాద్ ఫోన్ నెంబర్: 0 83416 89555

అంబులెన్సు రిపేర్ కి సినీ నటులు ఆదిత్య ఓం - నిర్మాత విజయ్ వర్మ సహకారం

అంబులెన్సు రిపేర్ కి సినీ నటులు ఆదిత్య ఓం -  నిర్మాత విజయ్ వర్మ సహకారం టాలెంట్ ఎక్స్ ప్రెస్: భద్రాచలం దగ్గరలోని మారుమూల ప్రాంతమైన దుమ్ముగూడెం మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీకి , ముఖ్యంగా చెరుపల్లి మరియు చుట్టుపక్కల గ్రామాలకి అందుబాటులో ఉండాలన్న ఉద్దేశ్యంతో సినీ నిర్మాత విజయ్ వర్మ పాకలపాటి ప్రోద్బలంతో అమెరికా లోని షిర్డీ సాయి సంస్థాన్ , రోటరీ క్లబ్ మరియు సినీ హీరో బిగ్ బాస్ ఫేమ్ ఆదిత్యాఓం ఆర్థిక సహాయంతో ఒక అంబులెన్సు ని కొని ఇవ్వడం జరిగింది. ఇప్పటికే వేలాది ప్రాణాలను కాపాడిన ఈ అంబులెన్సు రిపేర్ కి వచ్చిందని కొద్దీ మొత్తం సహాయం కావాలని స్థానిక సామాజిక వేత్త రేసు ఆదినారాయణ మూర్తి కోరిక మేరకు నటులు ఆదిత్యాఓం నిర్మాత విజయ్ వర్మ పాకలపాటి లు పది వేల రూపాయల సాయం అందించుటయే కాక తరుచుగా వచ్చే ఈ రిపేర్ లకై ఒక నిధిని తయారు చేద్దామని , ఇందునిమిత్తం  తమ వంతుగా సహాయం అందిస్తామని మాట ఇచ్చారని రేసు ఆదినారాయణ మూర్తి హర్షం వ్యక్తం చేశారు

Aditya om supported for Ambulance Repair

Aditya om supported for Ambulance Repair Talent Express News: Telugu Renowned film artist Big Boss fame Aditya om singh who has supported 3 years back to buy Ambulance for kothapally Gram Panchayat and Cherupalli Surrounded villages of Telangana state is now helped for it's repair works.  Ambulance Maintenance committee convention Resu Adinaarayana Murthy has requested a financial aid for ambulance repair and with advice of Aditya om charity activities advisor and Film producer Vijay varma pakalapati's request Aditya om has transferred the money for it's repairs and besides Aditya om suggested the committee to plan a fixed treasure for it's repairs and for which he has promised to give a 50000/- rupees from his end. For which Producer Vijay varma pakalapati thanked Aditya om. He is the man who's ready to support with immediate our request Villagers and Varma said to media.

లోక రక్షకుడు ఏసుక్రీస్తు

లోక రక్షకుడు ఏసుక్రీస్తు - సినీ దర్శకుడు దిలీప్ రాజా టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:  లోకరక్షకుడు ఏసుక్రీస్తు అని సినీ దర్శకుడు, పెన్నీ మినిస్ట్రీస్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు దిలీప్ రాజ అన్నారు. రూరల్ మండలం పెదరావూరులో శుక్రవారం సెమీ  క్రిస్మస్ వేడుకలను పెన్నీ మినిస్ట్రీస్ ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించారు. జీవకోటి పాపాల నిమిత్తం తన రక్తాన్ని శిలువపై ధారపోసి మరణించిన మహనీయుడు ఏసు క్రీస్తు అని ఆయన చెప్పారు. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వమని చరిత్రలో చెప్పబడింది అంటే క్రీస్తు ఉన్నాడన వాస్తవానికి సాక్షాలని దిలీప్ రాజా  వివరించారు. సమావేశానికి పెన్నీ మినిస్ట్రీస్ డైరెక్టర్ ప్రదీప్ డోనేపూడి అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా క్రిష్టమస్ కేక్ ను కట్ చేసారు. నక్షత్రాన్ని వెలిగించారు. సేవా కార్యక్రమం లో భాగం గా కుష్టు వ్యాధి గ్రస్తులకు, ఎయిడ్స్ వీడితులకు, వితంతువులకు నూతన వస్త్రాలను, నిత్యవసర వస్తువులను దిలీప్ రాజా పంపిణీ చేశారు. కార్యక్రమం లో సహాయ దర్శకుడు నరేష్ దోనే, ఇంటూరి విజయ్ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

కొత్త రసాయన చర్యల ఆవిష్కరణ సాధ్యమే

కొత్త రసాయన చర్యల ఆవిష్కరణ సాధ్యమే - ఐఐఎస్‌సీ బెంగళూరు ప్రొఫెసర్‌ ఏటీ.బిజు - విజ్ఞాన్స్‌లో ఘనంగా కొనసాగుతున్న ఇంటర్నేషనల్‌ సెమినార్‌ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఆర్గానో క్యాటలిసిస్‌ ద్వారా అనేక కొత్త రసాయన చర్యలను అవిష్కరించడం సాధ్యమవుతోందని, అంతేకాకుండా ఇవి పరిశోధనలో పురాతన మార్గాలను తెరవగలవని ఐఐఎస్‌సీ బెంగళూరు ప్రొఫెసర్‌ ఏటీ.బిజు అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ సైన్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ విభాగంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కెమిస్ట్రీ, న్యూఢిల్లీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఐఎఫ్‌సీపీఏఆర్‌ (ఇండో–ఫ్రెంచ్‌ సెంటర్‌ ఫర్‌ ద ప్రమోషన్‌ ఆఫ్‌ అడ్వాన్డ్స్‌ రీసెర్చ్‌), సీఈఎఫ్‌ఐపీఆర్‌ఏ (సెంటర్‌ ప్రాంకో–ఇండీన్‌ పౌర్‌ లా ప్రమోషన్‌ డీ లా రీసెర్చ్‌ అవంకీ)ల ఆర్థిక సౌజన్యంతో జాయింట్‌ ఇండో–ఫ్రెంచ్‌ ఇంటర్నేషనల్‌ సెమినార్‌ ఆన్‌ ‘‘ ఎక్స్‌ప్లోరింగ్‌ కాంటెంపోరరి విస్తాస్‌ ఇన్‌ అపై్లయింగ్‌ (ఆర్గానో) కాటలిసిస్‌ ఫర్‌ ఫార్మా ఇండస్ట్రీ: ఫర్‌ సస్టేయినింగ్‌ ఫ్యూచర్‌’’ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఇంటర్నేషనల్‌ సెమినార్‌న...

కర్భన ఉత్ప్రేరిత చర్యల ద్వారా విప్లవాత్మక ఫలితాలు

కర్భన ఉత్ప్రేరిత చర్యల ద్వారా విప్లవాత్మక ఫలితాలు   - ఐఐటీ కాన్పూర్‌ నుంచి పద్మశ్రీ, ప్రొఫెసర్‌ వీకే.సింగ్‌  - విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ప్రారంభమైన ఇంటర్నేషనల్‌ సెమినార్‌ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: కొత్త విధానాలు, ప్రయోగాలు, కర్భన ఉత్ప్రేరిత చర్యల ద్వారా విప్లవాత్మక ఫలితాలను సాధించవచ్చునని ఐఐటీ కాన్పూర్‌ నుంచి పద్మశ్రీ, ప్రొఫెసర్‌ వీకే.సింగ్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ అపై్లడ్‌ సైన్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ విభాగంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కెమిస్ట్రీ, న్యూఢిల్లీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఐఎఫ్‌సీపీఏఆర్‌ (ఇండో–ఫ్రెంచ్‌ సెంటర్‌ ఫర్‌ ద ప్రమోషన్‌ ఆఫ్‌ అడ్వాన్డ్స్‌ రీసెర్చ్‌), సీఈఎఫ్‌ఐపీఆర్‌ఏ (సెంటర్‌ ప్రాంకో–ఇండీన్‌ పౌర్‌ లా ప్రమోషన్‌ డీ లా రీసెర్చ్‌ అవంకీ)ల ఆర్థిక సౌజన్యంతో జాయింట్‌ ఇండో–ఫ్రెంచ్‌ ఇంటర్నేషనల్‌ సెమినార్‌ ఆన్‌ ‘‘ ఎక్స్‌ప్లోరింగ్‌ కాంటెంపోరరి విస్తాస్‌ ఇన్‌ అపై్లయింగ్‌ (ఆర్గానో) కాటలిసిస్‌ ఫర్‌ ఫార్మా ఇండస్ట్రీ: ఫర్‌ సస్టేయినింగ్‌ ఫ్యూచర్‌’’ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించను...

విజ్ఞాన్స్‌ వర్సిటీ వీసీకు ఎన్‌సీసీ విభాగంలో గౌరవ కల్నల్‌ ర్యాంక్‌

విజ్ఞాన్స్‌ వర్సిటీ వీసీకు ఎన్‌సీసీ విభాగంలో గౌరవ కల్నల్‌ ర్యాంక్‌  టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌కు న్యూఢిల్లీలోని గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా – మినిస్ట్రీ ఆఫ్‌ డిఫెన్స్‌ వారు ఎన్‌సీసీ విభాగంలో గౌరవ కల్నల్‌ ర్యాంక్‌ను మంగళవారం అందించింది. ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను, గెజిట్‌ నోటిఫికేషన్‌ను ఏపీ – తెలంగాణ రాష్ట్రాల ఎన్‌సీసీ డైరెక్టరేట్‌ డెప్యూటీ డైరెక్టర్‌ జనరల్, ఎయిర్‌ కమోడర్‌ వీ. మధుసూదన్‌ రెడ్డి విజ్ఞాన్‌ యూనివర్సిటీకి విచ్చేసి వెస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌కు అందజేశారు . ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీ – తెలంగాణ రాష్ట్రాల ఎన్‌సీసీ డైరెక్టరేట్‌ డెప్యూటీ డైరెక్టర్‌ జనరల్, ఎయిర్‌ కమోడర్‌ వీ. మధుసూదన్‌ రెడ్డి మాట్లాడుతూ విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అకడమిక్‌ ఫ్రేమ్‌వర్క్‌లో ఎన్‌సీసీను ఏకీకృతం చేయడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచి విద్యార్థుల్లో క్రమశిక్షణ, స్నేహభావం, నిబద్ధత, సమగ్ర అభివృద్ధికై చేస్తున్నటువంటి కృషికి గాను ఎన్‌సీసీ విభాగంలో గౌరవ కల్నల్‌ ర్యాంక్‌ను అందించామ...

ప్రపంచాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధం విద్యనే

ప్రపంచాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధం విద్యనే !    - హైదరాబాద్‌లోని నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ శ్రీక్రిష్ణ దేవ రావ్‌   - సమాజానికి తిరిగి ఇవ్వాలి : విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య  -  ప్రపంచం ఎదురుచూస్తోంది : విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు  - విజ్ఞాన్స్‌ వర్సిటీలో ఘనంగా ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ 2వ స్నాతకోత్సవం - 860 మంది విద్యార్థులకు డిగ్రీలు అందజేత : విజ్ఞాన్స్‌ వర్సీటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ప్రపంచాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధం ఏదైనా ఉందంటే అది ఒక్క విద్యతోనే సాధ్యమని  హైదరాబాద్‌లోని నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ శ్రీక్రిష్ణ దేవ రావ్‌ అన్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఆన్‌లైన్‌ లెర్నింగ్, ఓపెన్‌ అండ్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్‌లో ఎంసీఏ, ఎంబీఏ పూర్తి చేసిన విద్యార్థులకు 2వ స్నాతకోత్సవాన్ని శనివారం వర్సిటీ ప్రాంగణంలో అంగరంగ ...

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ – థెరల్లెన్‌ ఫార్మా ప్రైవేట్‌ లిమిటెడ్‌ల మధ్య అవగాహన ఒప్పందం

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ – థెరల్లెన్‌ ఫార్మా ప్రైవేట్‌ లిమిటెడ్‌ల మధ్య అవగాహన ఒప్పందం టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ – హైదరాబాద్‌లోని థెరల్లెన్‌ ఫార్మా ప్రైవేట్‌ లిమిటెడ్‌ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని బుధవారం యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో థెరల్లెన్‌ ఫార్మా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సీఈవో, మేనేజింగ్‌ డైరక్టర్‌ యలమంచిలి శ్రీనివాసరావుతో యూనివర్సిటీ డీన్‌ పీసీఎఫ్‌ డాక్టర్‌ దిరిశాల విజయరాము అవగాహన ఒప్పందానికి సంబంధించిన పత్రాలను మార్చుకున్నారని తెలియజేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ మాట్లాడుతూ ఈ అవగాహన ఒప్పందం వలన ఎం.ఫార్మసీ చదివే ఇద్దరు విద్యార్థులకు నెలకు రూ.10,000 చొప్పున రెండు సంవత్సరాలు అందిస్తామన్నారు. ఇలా 2024–25 విద్యా సంవత్సరం నుంచి 2029–30 విద్యా సంవత్సరం అంటే 5 బ్యాచ్‌ల విద్యార్థులకు స్కాలర్‌షిప్స్‌ను అందజేస్తామన్నారు. అంతేకాకుండా ఫ్యాకల్టీ ఎక్స్‌చేంజ్‌ ప్రోగ్రామ్, ఉమ్మడిగా పరిశోధనలు, ఫ్యాకల్టీ ట్రైనింగ్‌ ...

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకుడికి డాక్టరేట్‌

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అధ్యాపకుడికి డాక్టరేట్‌ టాలెంట్ ఎక్స్ ప్రెస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఈసీఈ విభాగానికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మడకా కృష్ణ చెన్నకేశవరావు అనే అధ్యాపకుడికి ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో తమ యూనివర్సిటీ పీహెచ్‌డీ పట్టా అందించిందని వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ ఇన్వెస్టిగేషన్స్‌ ఆన్‌ కాంపాక్ట్‌ సీపీడబ్యూ ఫెడ్‌ సర్కులర్లీ పోలరైజ్డ్‌ వైడ్‌ అండ్‌ డ్యూయల్‌ బ్యాండ్‌ యాంటీనాస్‌ ఫర్‌ 5జీ, వైర్‌లెస్‌ ల్యాన్‌ అండ్‌ శాటిలైట్‌ అప్లికేషన్స్‌’’ అనే అంశంపై ఆయన పరిశోధన చేశారని తెలియజేశారు. ఈయనకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఈసీఈ డిపార్ట్‌మెంట్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ పచియానన్‌ ముత్తుస్వామి గైడ్‌గా వ్యవహరించారని పేర్కొన్నారు. ఈయన తన పరిశోధనలో భాగంగా 2 ఎస్‌సీఐ, 4 స్కోపస్‌ పేపర్లు పబ్లిష్‌ చేశారని వెల్లడించారు. పీహెచ్‌డీ పట్టా పొందిన మడకా కృష్ణ చెన్నకేశవరావును వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూ...

ఇండియన్ మీడియా కౌన్సిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా డాక్టర్ పి సి ఆదిత్య

ఇండియన్ మీడియా కౌన్సిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా డాక్టర్ పి సి ఆదిత్య టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: మన సినిమా:-  దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఇండియన్ మీడియా కౌన్సిల్ వారు సీనియర్ జర్నలిస్టు విలక్షణ సినీ దర్శకుడు డాక్టర్ పి సి ఆదిత్యను తెలుగు రాష్ట్రాలకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ ఉత్తర్వులు,  గుర్తింపు కార్డుని పంపి అభినందనలు తెలిపారు. ఇండియన్ మీడియా కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు అబ్దేష్ శర్మ ఈ సందర్భంగా వివరిస్తూ తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో గాక సినీ రంగంలో గత 30 సంవత్సరాలుగా పలు ఉపయోగత్మక సినిమాలు రూపొందిస్తూ జాతీయ స్థాయిలో పలు అవార్డులు రివార్డులు సాధించిన డాక్టర్ పిసి ఆదిత్యను తమ సంస్థ ఇండియన్ మీడియా కౌన్సిల్ కు సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా నియమించడం చాలా గర్వంగా ఉందన్నారు . దక్షిణ భారతదేశంలో కూడా ఆదిత్య గారి సారధ్యంలో ఐ ఎం సి సేవలు విస్తరిస్తాయని అబ్దేష్ శర్మ ఆశా భావాన్ని వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా డాక్టర్ పి సి ఆదిత్య స్పందిస్తూ తాను సినీ దర్శకుడిగా రాణించడానికి తనకు పునాది జర్నలిజమని ఐ ఎం సి ద్వారా జాతీయ స్థాయిలో ఉన్నత పదవికి న...