ఇకపై ఆంధ్రలో సినిమా షూటింగ్ లు పెరుగుతాయి!
— మా ఎపి వ్యవస్థాపక అధ్యక్షుడు దిలీప్ రాజ
నటుడు అల్లు అర్జునపై తెలంగాణా ప్రభుత్వ పనితీరు వల్ల ఇకపై ఆంధ్రలో సినిమా షూటింగ్లు పెరగటానికి దోహదం చేశాయని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల యూనియన్ (మా_ఎపి) వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీ దర్శకుడు దిలీప్ రాజూ చెప్పారు. గుంటూరు జిల్లా తెనాలి లోని మా_ఎపి కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అల్లు అర్జున్ యాక్టర్ పై ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల యావత్తు సినీపరిశ్రమ సంఘటితమై నిరసన వ్యక్తం చేసిందన్నారు. దీంతో సినీపరిశ్రమను తెలంగాణా ప్రభుత్వం అణగదొక్కుతుందనే ప్రచారం జరిగిందని తెలిపారు. పైగా ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఇటీవల సినీ నిర్మాతలు ఆంధ్రలో షూటింగ్లు యదేచ్ఛగా జరుపుకోవడానికి స్వయంగా ఆహ్వానం పలికారు . సినీ నటుడైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలో ఎపిలో సినీపరిశ్రమ తరలి వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని దిలీప్ రాజా పేర్కొన్నారు. తెలంగాణాలోని సినిమా పెద్దల్లో కొందరు ఈ మేరకు ఆంధ్రలో షూటింగ్ లు తీయడానికి మానసికంగా సిద్ధపడినట్లుగా తమ వద్ద సమాచారం వుందన్నారు. ఆంధ్రలో విశాఖపట్నంలో సినిమా స్టూడియోలు ఇప్పటికే నిర్మాణంలో ఉండగా తలకోన,హార్సిలీ హిల్స్, కోనసీమ, భవానీద్వీపం, కొండవీడు, సూర్యలంక బీచ్, అరకు లోయ లాంటి ఎన్నో అందమైన ప్రదేశాలు సినిమా షూటింగ్లుకు సిద్దం గా వున్నాయన్నారు. కాగా మా _ఎపి కూడా ఆంధ్రలో సినిమా షూటింగ్ లు తీయడానికి ముందుకు వచ్చే నిర్మాతలకు ఎఫ్ డిసి ద్వారా తను సహాయం చేయడానికి ముద్దుకొస్తాము అని దిలీప్ రాజ చెప్పారు. సమావేశంలో సహాయ దర్శకులు నరేష్ దోనె, మణివరన్, నటులు వేమూరు విజయభాస్కర్, తదితరులు పాల్గొన్నారు.