ఇండియన్ మీడియా కౌన్సిల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా డాక్టర్ పి సి ఆదిత్య
మన సినిమా:- దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఇండియన్ మీడియా కౌన్సిల్ వారు సీనియర్ జర్నలిస్టు విలక్షణ సినీ దర్శకుడు డాక్టర్ పి సి ఆదిత్యను తెలుగు రాష్ట్రాలకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ ఉత్తర్వులు, గుర్తింపు కార్డుని పంపి అభినందనలు తెలిపారు. ఇండియన్ మీడియా కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు అబ్దేష్ శర్మ ఈ సందర్భంగా వివరిస్తూ తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో గాక సినీ రంగంలో గత 30 సంవత్సరాలుగా పలు ఉపయోగత్మక సినిమాలు రూపొందిస్తూ జాతీయ స్థాయిలో పలు అవార్డులు రివార్డులు సాధించిన డాక్టర్ పిసి ఆదిత్యను తమ సంస్థ ఇండియన్ మీడియా కౌన్సిల్ కు సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా నియమించడం చాలా గర్వంగా ఉందన్నారు . దక్షిణ భారతదేశంలో కూడా ఆదిత్య గారి సారధ్యంలో ఐ ఎం సి సేవలు విస్తరిస్తాయని అబ్దేష్ శర్మ ఆశా భావాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పి సి ఆదిత్య స్పందిస్తూ తాను సినీ దర్శకుడిగా రాణించడానికి తనకు పునాది జర్నలిజమని ఐ ఎం సి ద్వారా జాతీయ స్థాయిలో ఉన్నత పదవికి నన్ను ఎంపిక చేయడం తెలుగు పాత్రికేయుడుగా గర్విస్తున్నానని తెలిపారు. తెలుగు పాత్రికేయుల గలం దేశ రాజధాని లో కూడా వినిపించే అవకాశం లభించడం ఆనందకరమని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పి సి ఆదిత్యకు అభిమానులు శ్రేయోభిలాషులు తన శిష్యులు ఆదిత్య గారిని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.