కర్భన ఉత్ప్రేరిత చర్యల ద్వారా విప్లవాత్మక ఫలితాలు
- ఐఐటీ కాన్పూర్ నుంచి పద్మశ్రీ, ప్రొఫెసర్ వీకే.సింగ్
- విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఘనంగా ప్రారంభమైన ఇంటర్నేషనల్ సెమినార్
కొత్త విధానాలు, ప్రయోగాలు, కర్భన ఉత్ప్రేరిత చర్యల ద్వారా విప్లవాత్మక ఫలితాలను సాధించవచ్చునని ఐఐటీ కాన్పూర్ నుంచి పద్మశ్రీ, ప్రొఫెసర్ వీకే.సింగ్ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ అపై్లడ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, న్యూఢిల్లీలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఐఎఫ్‌సీపీఏఆర్ (ఇండో–ఫ్రెంచ్ సెంటర్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ అడ్వాన్డ్స్ రీసెర్చ్), సీఈఎఫ్‌ఐపీఆర్‌ఏ (సెంటర్ ప్రాంకో–ఇండీన్ పౌర్ లా ప్రమోషన్ డీ లా రీసెర్చ్ అవంకీ)ల ఆర్థిక సౌజన్యంతో జాయింట్ ఇండో–ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ సెమినార్ ఆన్ ‘‘ ఎక్స్‌ప్లోరింగ్ కాంటెంపోరరి విస్తాస్ ఇన్ అపై్లయింగ్ (ఆర్గానో) కాటలిసిస్ ఫర్ ఫార్మా ఇండస్ట్రీ: ఫర్ సస్టేయినింగ్ ఫ్యూచర్’’ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఇంటర్నేషనల్ సెమినార్‌ను బుధవారం ఘనంగా ప్రారంభించారు. ముందుగా ఇంటర్నేషనల్ సెమినార్‌కు సంబంధించిన బ్రౌచర్‌ను ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐఐటీ కాన్పూర్ నుంచి పద్మశ్రీ, ప్రొఫెసర్ వీకే.సింగ్ మాట్లాడుతూ క్రియేటివిటీ ద్వారా పర్యావరణ అనుకూల కాటలిస్ట్‌లను అభివృద్ధి చేయడం సులభమని, ఇది గ్రీన్ కెమిస్ట్రీ దిశగా ముందడుగు వేసినట్లవుతుందన్నారు. తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన కాటలిటిక్ ప్రక్రియలను రూపొందించినటై్లతే పరిశ్రమలకు లాభదాయకమన్నారు. అదే విధంగా క్రియేటివిటీ సహాయంతో ప్రత్యేకమైన అసిమ్మెట్రిక్ సింథసిస్ మార్గాలు అభివృద్ధి చేసి, కొత్త ఔషధ సమ్మేళనాలను తయారు చేయవచ్చునని పేర్కొన్నారు. అసమాన కాటలిసిస్ ప్రక్రియలలో నాణ్యతను పెంచడం, సమర్థతను మెరుగుపరచడం కూడా సాధ్యమవుతుందన్నారు. నిర్దిష్ట సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేకమైన రసాయన పద్ధతులను కూడా సృష్టించవచ్చునని పేర్కొన్నారు. అసిమ్మెట్రిక్ ఆర్గానోకాటలిసిస్‌లో సృజనాత్మక ఆలోచనలు కొత్త టెక్నాలజీల అభివృద్ధికి దారి తీస్తాయని అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా అసిమ్మెట్రిక్ ఆర్గానోకాటలిసిస్ అనేది రసాయన శాస్త్రంలో అత్యంత ఆసక్తికరమైన పరిశోధనలలో ఒకటని, దీని ద్వారా పరిశ్రమలకు, పరిశోధనలకు, పర్యావరణానికి కలిగే ప్రయోజనాలను ప్రజలకు అందించడంలో క్రియేటివిటీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన సీఈఎఫ్‌ఐపీఆర్‌ఏ డైరెక్టర్ ప్రొఫెసర్ నితిన్ సేథ్ మాట్లాడుతూ సీఫిప్రా ద్వారా భారతదేశం మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అనేక పద్ధతుల్లో మౌలిక సహకారం జరుగుతోందన్నారు. దీని ద్వారా తాజా ఆవిష్కరణలతో పాటు పరిశోధనలు సమర్థవంతంగా జరుగుతాయన్నారు. సీఫిప్రా సముచితమైన నిధులు, వనరులు అందించి, సైన్సు పరిశోధనల్లో నూతన ఆవిష్కరణలకు దోహదపడుతుందన్నారు. ముఖ్యంగా విద్యార్ధులు, పరిశోధనలు చేసేవారికి ఇది ఎంతో ఉపయుక్తమన్నారు. అంతేకాకుండా భారత విద్యార్థులు ఫ్రాన్స్‌లో ఉన్నత విద్య, పరిశోధనలకు అవకాశం పొందుతారన్నారు. ఇది విద్యార్థుల్లో జ్ఞానం, అనుభవం, సామర్థ్యాలను పెంపొందిస్తుందన్నారు. సీఫిప్రా ప్రాజెక్టులు భారతదేశం – ఫ్రాన్స్ దేశాల ఆర్థిక వ్యవస్థలకు కూడా సహకారం అందిస్తాయన్నారు. పరిశోధన ద్వారా కొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీ అభివృద్ధి వల్ల పర్యావరణ అనుకూల ఉత్పత్తులు, సర్వీసులు అభివృద్ధి చెందుతాయన్నారు. కార్యక్రమంలో వివిధ దేశాల ప్రతినిధులు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి ప్రొఫెసర్ డి బి రామాచారి, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ పి వెంకటేశు, ఐఐటి ఖరగ్పూర్ నుంచి ప్రొఫెసర్ మధుసూదన్, వైస్ చాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.