లోక రక్షకుడు ఏసుక్రీస్తు
- సినీ దర్శకుడు దిలీప్ రాజా
లోకరక్షకుడు ఏసుక్రీస్తు అని సినీ దర్శకుడు, పెన్నీ మినిస్ట్రీస్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు దిలీప్ రాజ అన్నారు. రూరల్ మండలం పెదరావూరులో శుక్రవారం సెమీ క్రిస్మస్ వేడుకలను పెన్నీ మినిస్ట్రీస్ ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించారు. జీవకోటి పాపాల నిమిత్తం తన రక్తాన్ని శిలువపై ధారపోసి మరణించిన మహనీయుడు ఏసు క్రీస్తు అని ఆయన చెప్పారు. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వమని చరిత్రలో చెప్పబడింది అంటే క్రీస్తు ఉన్నాడన వాస్తవానికి సాక్షాలని దిలీప్ రాజా
వివరించారు. సమావేశానికి పెన్నీ మినిస్ట్రీస్ డైరెక్టర్ ప్రదీప్ డోనేపూడి అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా క్రిష్టమస్ కేక్ ను కట్ చేసారు. నక్షత్రాన్ని వెలిగించారు. సేవా కార్యక్రమం లో భాగం గా కుష్టు వ్యాధి గ్రస్తులకు, ఎయిడ్స్ వీడితులకు, వితంతువులకు నూతన వస్త్రాలను, నిత్యవసర వస్తువులను దిలీప్ రాజా పంపిణీ చేశారు. కార్యక్రమం లో సహాయ దర్శకుడు నరేష్ దోనే, ఇంటూరి విజయ్ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.